broadband data
-
ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు?!
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్ వర్క్ వినియోగంతో భారత్ లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు తిరుగుండదనే కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఊక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇండియన్ టెక్నాలజీపై చైనా యాప్స్ ప్రభావం ఇండియా - చైనా సరిహద్దు వివాదం కారణంగా కేంద్రం డ్రాగన్ కంట్రీకి చెందిన సుమారు 200యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో ఇండియన్ టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ స్థాపించేందుకు సొంతంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. అందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, క్వాల్ కమ్ వంటి టెక్ కంపెనీలతో హార్డ్ వేర్ లను తయారు చేసుందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థలు భారత్‌లో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ కేంద్రం సున్నితంగా తిరస్కరించి దేశీ పరిజ్ఞానంతో 5జీ నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సమాచార నిపుణుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 5జీ నెట్ వర్క్ వినియోగం ►2020 థాయిలాండ్, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్ వర్క్ ప్రారంభమైంది. ఊక్లా అంచనా ప్రకారం..ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్ టీఈ(Long-Term Evolution) నెట్ వర్క్ కంటే 5జీ స్పీడుగా ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని 2021 ఏప్రిల్ నాటికి దాని వేగం 9రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ లో విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ►2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు 5G నెట్ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ వినియోగం పెరిగిపోతుందని ఊక్లా ప్రతినిధులు వెల్లడించారు. ►మనదేశంలో జియో నెట్ వర్క్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్ వర్క్ డౌన్లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది. ►ప్రస్తుతం, యూకే,యూఎస్ వంటి దేశాల్లో 5 నెట్ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఊక్లా గుర్తించింది. ►5జీ నెట్ వర్క్ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్వర్క్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆపరేట్లు ఓపెన్ ర్యాన్ నెట్ వర్క్ (open radio access network architecture) వల్ల 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్ గ్లోబల్ లీడర్ ఊక్లా అంచనా వేసింది. -
కనీసం 2 ఎంబీపీఎస్ వేగం ఉండాలి
న్యూఢిల్లీ: ‘దేశంలో బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనాన్ని మార్చాలి. ఇంటర్నెట్ కనీస వేగం ఇప్పుడున్న 512 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలి’ అని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం తన లేఖలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. నిర్వచనం మార్పు, వేగం పెంపు ప్రతిపాదనలు ఎన్నాళ్ల నుంచో పెండింగులో ఉన్నాయని ఫోరం తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ వేగం పెంపునకు ప్రణాళిక అన్న అంశంపై ట్రాయ్ సంప్రదింపుల పత్రంపై ఫోరం తన స్పందనను తెలియజేసింది. ‘కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం కొన్నేళ్లుగా తీవ్రంగా మారిపోయింది. దేశంలో డేటా సేవలకు పూర్తిగా నూతన మార్కెట్లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత ఆధునిక అప్లికేషన్స్, వాటి వినియోగానికి ప్రస్తుత నిర్వచనం ప్రకారం నిర్దేశించిన దాని కంటే అధిక స్పీడ్ ఉండాలి. బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుత నిర్వచనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తగ్గట్టుగా లేదు. హైస్పీడ్ కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చదు’ అని లేఖలో బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం స్పష్టం చేసింది. దేశంలో 4జీ అమలైనప్పటికీ.. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ వేగం చాలా తక్కువ. 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగులో ఉందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టి.వి.రామచంద్రన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలే కాదు, నేషనల్ పాలసీ ప్రకారం కూడా ఈ వేగం తక్కువ అని ఆయన అన్నారు. ‘4జీ అమలైనప్పటికీ ప్రపంచంలోని మెరుగైన పద్ధతులతో పోలిస్తే సగం కంటే తక్కువగా వేగం ఉంది. టెక్నాలజీ ఏది వాడినా 2 ఎంబీపీఎస్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ అందించేలా నెట్వర్క్ ఉంటేనే బ్రాడ్‌బ్యాండ్‌గా పరిగణించాలి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బేసిక్, ఫాస్ట్, అల్ట్రా–ఫాస్ట్ విభాగాలుగా బ్రాడ్‌బ్యాండ్ అందించాలి. సేవల అభివృద్ధి, వినియోగదార్ల అంచనాలకు అనుగుణంగా తరచూ పరిశీలన జరగాలి. 2 ఎంబీపీఎస్ కంటే వేగం అనే ప్రామాణికం ప్రధాన అవసరం ఇప్పుడు. అధిక నాణ్యత కలిగిన సేవలకై అదనపు మార్గదర్శకాలను ట్రాయ్ చేర్చాలి. 15 ఎంబీపీఎస్ వేగాన్ని ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌గా, 30 ఎంబీపీఎస్‌ను అల్ట్రా ఫాస్ట్‌గా నిర్వచించాలి’ అని ఫోరం అభిప్రాయపడింది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, క్వాల్కామ్, జియో, స్టార్, సిస్కో వంటి సంస్థలు ఫోరం సభ్యులుగా ఉన్నాయి. -
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ అన్లిమిటెడ్ డేటా
జియోతో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోంది. మై హోం పథకంలో మరో బంపర్ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది. మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులోఉందనీ, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది. గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది. కాగా మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చాయి. సెట్ టాప్ బాక్సుల సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే పలు అంచనాలతో పాటు సెట్ టాప్ బాక్సుల ఫోటోలు వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్ల కోసం బుధవారం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఎదురవుతున్న ముప్పు ను తట్టుకొనే చర్యల్లో భాగంగా తాజాగా భారతీ ఎయిర్టెల్ తన ప్రతి పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు 5 జీబీ అదనపు డేటాను అందించనుంది. ఎయిర్ టెల్ ల్యాండ్ లైన్ లో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం తో పాటు, వినియోగదారులకు ఇప్పుడు ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కల్పిస్తోంది. వారికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ధన్యవాదాలు చెప్పారు భారతి ఎయిర్టెల్ (భారతదేశం) సీఈఓ హేమంత్ కుమార్ గురుస్వామి. 'మై హోం రివార్డ్స్' పథకం కింద ఈ అఫర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు.