
బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టైలరింగ్ పరీక్ష
మంచిర్యాలఅర్బన్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో టెక్నికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. టైలరింగ్ లోయర్ పరీక్షకు 124 మందికి గాను 78 మంది హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాల డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 104 మందికి గాను 68, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్ పరీక్షకు 32 మందికిగాను 32 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డీఈవో డాక్టర్ కె.రవికాంత్‌రావు, పరీక్షల విభాగం జిల్లా సహయక కమిషనర్ సురేష్‌బాబు పరీక్షలను పర్యవేక్షించారు.