
ప్రారంభమైన గూగూడు బ్రహ్మోత్సవాలు
గూగూడు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పీర్లచావిడిలోని పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను దొరికిన కొండారెడ్డి వంశీకులు బయటకు తీసి ప్రథమ దర్శనం చేయించారు. కుళ్లాయిస్వామి పంజాను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి పీరును ప్ర«థమ దర్శనం కోసం చావిడి ముందుటి అరుగు పైకి తీసుకు రాగానే భక్తులు పెద్ద ఎత్తున కుళ్లాయిస్వామి నామస్మరణ చేశారు.