Fairs
-
ఇవీ.. వానాకాలం జాతరలు! ‘త్షెచు’ అంటే అర్థమేంటో తెలుసా?
హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్‌లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్‌లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్‌లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా! -
నిత్యం తెరచి ఉండే హృదయాలయాలు
అక్కడ ఉండేవి ఆలయాలే కాని నిత్యధూపదీప నైవేద్యాలు, పూజలు ఉండవు కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. వైవిధ్యభరితంగా కనిపించే ఆ ఆలయాలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం నిత్య ధూపదీపనైవేద్యాలు ఉండకపోయినా భద్రత ఉంటుంది. ఆలయాలకు తలుపులు, చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. వాటిలో విగ్రహాలకు ఖచ్చితమైన రూపురేఖలు ఉంటాయి కానీ ఇక్కడ అవేమి కనిపించవు. మత్స్యకారులు మనస్సులోనే అమ్మను తలచుకుంటూ ఆమెపై భారం వేసి జీవనోపాధికి వెళుతుంటారని చెబుతున్నారు. తీరప్రాంత గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ తమ ఇష్టదైవాలైన అమ్మవార్లకు మొక్కుకుని వేటకు వెళుతుంటారు. దానికి అనువుగా నిర్మించుకున్న ఆలయాలు చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వైవిధ్యభరిత ఉత్సవాలు ఈ ఆలయాలని విచిత్రంగా కనిపిస్తాయి చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి ఆలయాలు వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు ముఖమండపాలు అసలే కనిపించవు. వాటిలో దేవతామూర్తుల ప్రతి రూపాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. తలుపులు ఎందుకు ఉండవంటే..! ఏ ఆలయానికి ద్వారబందాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపుకు ముఖం ఉండేలా (సముద్రంలోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడు తమకు అండగా ఉండాలని ఆలయాలకు తలుపులు వేయడంవల్ల ఆమెను బంధించినట్లుగా భావించే మత్స్యకార పూర్వీకులు ఈవిధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడు అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్ధేశ్యంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని మత్స్యకారులు చెబుతున్నారు. అమ్మవార్ల పేర్లు సాధారణంగా మత్స్యకారులు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటి పేర్లతో పిలుచుకుంటారు. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు. ఉత్సవాలూ వైవిధ్యభరితమే సాధారణంగా గ్రామదేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ ఆలయాలలో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కఠినమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. సముద్ర తీరంలో ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజున వచ్చే ఫాల్గుణ బహుళ అమావాస్య అంటే కొత్త అమావాస్యరోజున ఈ అమ్మవార్లకు మత్స్యకారులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. – వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్, సాక్షి, పిఠాపురం -
సత్య ధర్మ పరిరక్షణే ధ్యేయం...
‘‘మీ ఇళ్లల్లో మీరే హోమాలు చేయండి. శక్తిమంతులుకండి. తద్వారా సమాజానికి సేవచేయండి. మంత్రదీక్ష తీసుకుని సమస్యలు పరిష్కరించుకోండి... వ్యాధులు నయం చేసుకోండి... ధర్మాన్ని కాపాడండి...’’ అంటున్నారు కుర్తాళం పీఠాధిపతి.. పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి. 83 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వామీజీ నిరాడంబరతకు మారుపేరు. ఆయన జీవితంలో వెయ్యి పున్నములను చూసిన సందర్భంగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సహస్రచంద్ర దర్శనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో.. శ్రీనాథ పీఠం ఆధ్వర్యాన గుంటూరులో ఈ ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామీజీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. కుర్తాళం పీఠం కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతోపాటు ధర్మపరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. ఇంకా సాక్షి అడిగిన పలు సందేహాలకు సవివరమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు స్వామీజీ మాటల్లోనే.... నా గురించి... పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రధాన అధ్యాపకుడిగా పనిచేశాను. వెంకట లక్ష్మీ వరప్రసాదరావు అనే నేను ప్రసాదరాయ కులపతిగా అందరికీ సుపరిచితుడిని. పరమ గురువు త్రివిక్రమ రామానంద భారతీస్వామి ప్రేరణతో అరవైఏళ్ల క్రితమే సన్యాసాన్ని స్వీకరించాలని భావించి నా తల్లిదండ్రులైన పోతరాజు పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మిలకు మనసులోని మాట చెప్పాను. వారు అంగీకరించలేదు. 2002లో భార్యాపిల్లల సమ్మతితో నా కోరిక నెరవేరింది. హిమాలయాలు, బృందావనం, కాశీ, కామాఖ్య, కుర్తాళం తదితర ప్రదేశాల్లో తపస్సు చేశాను. రాధాదేవి, కాలభైరవుడు, కాళీమాత వంటి దేవతల దర్శనభాగ్యం కలిగి అనుగ్రహం పొందాను. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాను. పీఠం కార్యకలాపాలు భారతదేశంలోని పీఠాల్లో శంకర పీఠాలకు సంబంధించింది మా పీఠం. కుర్తాళంతోపాటు తిరుమల, గుంటూరుల్లోనూ పీఠాలున్నాయి. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలలో ఉప శాఖలున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, వారి మనశ్శక్తి పెరిగేందుకు ప్రయోజన హోమాలు చేయిస్తున్నాం. కుర్తాళం పీఠానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, అమెరికా, శ్రీలంకల్లో ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆలయాలు, తెలంగాణలో 8 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రస్టుబోర్డుల అధీనంలోనివే.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాల్లో పర్యటించి సప్తాహాలు నిర్వహించాం. హిందూ ధర్మ రక్షణ, మంత్రశాస్త్రం, పురాణాలు, వేదాంత సంబంధ విషయాలపై వేలాది ఉపన్యాసాలు ఇచ్చాను. సామూహిక యజ్ఞాలు నిర్వహించాం. 20 మంది శిష్యులకు సన్యాసదీక్ష ఇప్పించాం. విశ్వవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు కుర్తాళం పీఠాలకు వస్తుంటారు. వారందరికీ మార్గనిర్దేశం చేస్తూ రుషులు బోధించిన మార్గాల్లో నడిపిస్తున్నాం. సామాజిక సేవల విషయానికొస్తే.. నిరంతర అన్నదానం, ఉచిత ధ్యాన శిబిరాల ఏర్పాటు ప్రధానమైనవి. కవితా గోష్ఠులను ఏర్పాటుచేసి కవులను భారీగా సన్మానిస్తుంటాం. భవిష్యత్ ప్రణాళిక అమెరికాలోని అట్లాంటాలో 500 ఎకరాల స్థలం పీఠానికి ఉంది. ఇక్కడ 108 కుండాలు ఏర్పాటుచేసి యజ్ఞాలు నిర్వహించాం.. 108 మంది సువాసినీలకు పూజలు జరిపించాం. ఈ ప్రాంతంలో ఒక నది, ఆరు సరస్సులు కూడా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులవారి 108 అడుగుల లోహపువిగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఏడాదిలోగా ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తాం. నమ్మకమే గెలుపు మనం ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందనే విశ్వాసం తొలుత కలగాలి. అప్పుడే ముందడుగు వేయగలుగుతాం. పీఠానికొచ్చిన నాస్తికులు ఆస్తికులుగా మారిన సందర్భాలు అనేకం. నమ్మి వచ్చినవారికి భక్తి మరింత పెరిగి ఆధ్యాత్మికానందంలో మునిగి తేలిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. యోగులు–సూక్ష్మ శరీరులు ధ్యాన సమయంలో కొందరు సూక్ష్మ శరీరంతో వచ్చి సందేశమిచ్చేవారు. కొందరు స్నేహపూర్వకంగా పలకరించి వెళ్లేవారు. మరికొందరు మహనీయులు ఆశీర్వదించి కర్తవ్య ఉపదేశం చేసేవారు. ఇంకొందరు తమ సాధనలో ముందుకెళ్లడానికి దారి చూపాలని కోరేవారు. ఇలా అశరీరులతో సంభాషించవలసి వచ్చేది. అలా నేను గుంటూరులోని ఇంట్లో ఆత్మావాహన విద్య ద్వారా అప్పటికే దేహం వదిలిన జిల్లెళ్లమూడి అమ్మతో మాట్లాడుతుంటాను. ఆమె అనేక సిద్ధసంబంధ విషయాలను చెప్పి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. ఆ అమ్మ ఆశీస్సులు ఇప్పటికీ నాకు అడుగడుగునా అందుతూ ఉంటాయి. కోరికలను జయించడమెలా? మనిషన్న తర్వాత కోరికలుంటాయి. వాటిని హద్దుల్లో ఉంచుకోవాలి. ఆదిశంకరాచార్యులవారి వేదాంతగ్రంథాలను చదవడం ద్వారా, ధ్యానం.. తపస్సు చేయడం ద్వారా కోరికలను అదుపులో ఉంచొచ్చు.ఇటీవలి కాలంలో యువతలోనూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. ఆలయాలకు వెళ్తున్నారు. టీవీలో భక్తి కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు. ఇది శుభ పరిణామం. స్వయంసిద్ధ కాళీ పీఠం గుంటూరు రవీంద్రనగర్ కొత్త పట్టాభిపురంలో ఉంది. ఆలయంలో అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని నిర్మించి నిత్యం హోమాలు చేయిస్తున్నాను. ఇది నిత్యాగ్నికుండం. ఇక్కడ ఎవరు హోమం చేసినా వారి సంకల్పం సిద్ధిస్తుంది. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహిస్తుంటాం’అంటూ సంభాషణను ముగించిన స్వామీజీ కాళికా మాతకు హారతివ్వడానికి ఉపక్రమించారు. కుర్తాళం పీఠం విశేషాలు శ్రీ శివచిదానంద సరస్వతీస్వామి (మౌనస్వామి) 1916లో హిమాలయాలకు వెళ్లి సన్యసించారు. అనంతరం తమిళనాడు రాష్ట్రం.. తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళంలో దత్తాత్రేయ మఠాన్ని నిర్మించారు. కొంతకాలం తర్వాత శ్రీ సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించి అద్భుతమైన సిద్ధశక్తులను సాధించారు. ఆయన తదనంతర పీఠాధిపతులుగా శ్రీ విమలానంద భారతీస్వామి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వామి, శ్రీ శివచిదానంద భారతీస్వామి వ్యవహరించారు. ఐదో పీఠాధిపతిగా శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి 2002లో బాధ్యతలు స్వీకరించారు. అపురూపం ముత్యాల గురించి అందరికీ తెలుసు. నవరత్నాలలో ముత్యాలను చంద్ర గ్రహ దోష పరిహారం కోసం ఉపయోగిస్తారు. ముత్యాలను ఉంగరాల్లో ధరిస్తారు. ముత్యాల హారాలను ధరిస్తారు. జాతకచక్రంలో చంద్రుని కారణంగా ఏర్పడిన దోషాలకు పరిహారంగా ముత్యాలు ఎలా ఉపయోగపడతాయో, ముత్యపు చిప్పలు కూడా దాదాపు అలాగే ఉపయోగపడతాయి. ముత్యపు చిప్పలతో తయారు చేయించిన లాకెట్లు, బ్రాస్లెట్లు వంటి ఆభరణాలు చంద్రదోషాలను పరిహరిస్తాయి. ఏదైనా సోమవారం లేదా అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దీపావళి వంటి పర్వదినాల్లో లక్ష్మీపూజ చేసేటప్పుడు ముత్యపుచిప్పలను కూడా పూజలో ఉంచి, వాటికి ధూపదీపాలను సమర్పించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు తొలగిపోతాయి. కుటుంబంలోని కలతలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. గోమతి చక్రాల మాదిరిగానే, ముత్యపు చిప్పలను కూడా ఇళ్లలోను, వ్యాపార కేంద్రాల్లోను డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు – సంభాషణ: చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ సాక్షి, విజయవాడ -
సరిగమల తాలింపు మార్గళి మేళవింపు
చెన్నైవాసులకు ఈ ‘మార్గళి’ సంగీత మాసం. ఈ ముప్పై రోజులూ నగరమంతా సంగీతంతో ‘ఘుమఘుమ’లాడుతుంది. సభలన్నీ సంప్రదాయ నృత్యాలతో ఇంద్రసభను మించిపోతాయి. పట్టుచీరలు, బంగారు నగలు, పరిమళాలు వెదజల్లే కుసుమాలు, నుదుటన రూపాయ బిళ్లంత బొట్లు.. చూడ్డానికి రెండు కళ్లు కాదు కదా, శివుడి మూడు కళ్లు, సాక్షాత్తూ ఇంద్రుడి సహస్రాక్షులు కూడా సరిపోవు అన్నట్లు ఉంటుంది ఈ నాలుగు వారాలూ చెన్నై. ధనుర్మాసంలో చెన్నైలో జరిగే ఉత్సవాలే మార్గళి. ఈసారి మార్గళి డిసెంబర్ 16న మొదలైంది. జనవరి 14 వరకు జరుగుతుంది. మన పుష్య మాసాన్నే తమిళులు మార్గళి అంటారు. అతిథులకు ఆతిథ్యం ఇచ్చే మాసం ఇది. దేశంలోని కళాకారులందరూ వలస పక్షుల్లా ఇక్కడకు వచ్చి ఏదో ఒక సభలో తమ సంగీత పరిజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు. అందుకే చెన్నైకిది మ్యూజిక్ సీజన్ కూడా. చెన్నైలోని నారద గాన సభ, కృష్ణ సభ, వాణి మహల్ అన్నీ ఈ నాలుగు వారాలూ కిటకిటలాడతాయి. మహిళలు కంచిపట్టు చీరలు, యువతులు కుర్తీ పైజమాలు, వృద్ధులు పంచెలతో భోజనాల దగ్గర సహపంక్తిలో కూర్చొని విందు ఆరగిస్తారు. అరటి ఆకులలో వడ్డించిన అన్నం, ఇలై సాపాడు, సాంబారు అన్నం, పాయసం రకరకాల స్వీట్లు తింటూ కనిపిస్తారు. కొందరు మద్రాసు ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తారు. చెన్నై నగరంలో మొత్తం యాభై ప్రదేశాలలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వచ్చేందుకు పదకొండు నెలల పాటు డబ్బులు దాచుకుంటామని చెబుతారు ఇక్కడకు వచ్చే సంగీతాభిమానులు. ‘‘హోటల్స్‌కి వెళ్లి భోజనం చేస్తే, పొట్ట బరువుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడి ఆహారం మాత్రం చాలా తేలికగా ఉంటుంది’’ అంటారు వాళ్లు నవ్వుతూ. అందుకే, ఒకప్పుడు తన క్యాంటీన్లో కేవలం కాఫీ, బజ్జీలు మాత్రమే అమ్మే బాలాజీ పట్టప్ప.. కాలగమనంలో తన మెనూ మార్చుకోవలసి వచ్చింది. ‘పట్టప్ప’ క్యాంటీన్ యజమాని బాలాజీ పట్టప్ప. అతి ప్రాచీనమైన మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో ఈ క్యాంటీన్ తన సేవలను అందిస్తోంది. కొత్తగా కీర వడ, కుళుంబు, కూటులతో పాటు పుచ్చకాయ రసం (సాంబారు), వెజిటబుల్ పాయసం కూడా చేర్చారు. ఈ కొత్త రుచులకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. అయితే రానురాను ఈ సభలలో సంగీతం కంటే రుచులకే ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందని కొంతమంది సంగీత ప్రియులు వాపోతున్నారు. ఒక దశాబ్ది కాలంగా ఈ మార్గళి ఉత్సవాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న సినీ నేపథ్య గాయకుడు ఉన్నికృష్ణన్ కూడా ఈ విషయంలో కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ‘‘ఆహారం మీద ధ్యాస ఉంటే, సంగీత కచేరీలను శ్రద్ధగా వినలేకపోతారు’’ అంటారు ఆయన. అయితే, ‘‘ఈ కచేరీలకు వస్తే, వండుకోవడానికి కుదరదు. కచేరీకి కచేరీకి మధ్యలో ఏదో కొద్దిగా తినడానికి ఏమైనా ఉండడం మంచిదే కదా’’ అంటున్నారు ఉమా శ్రీనివాసన్ (పట్టప్ప కుమార్తె). ముందు కనువిందు..! ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి సభ నిత్యం సంగీత ఆస్వాదకులతో నిండిపోతుంది. ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ ఈ సభలకు హాజరవుతుంటారు. వీరు కూడా అక్కడకు రాగానే మొదట మెనూలో ఏముందో చదువుతారు. బొప్పాయి వేపుడు, చిలగడదుంపల వడ, బాదం బొబ్బట్లు, పల్లీ పుడ్డింగ్ వంటి వాటిని అక్కడ అందరికీ సుపరిచితులైన మౌంట్‌బాటెన్ మణి అయ్యర్ తయారు చేయిస్తుంటారు. అయ్యర్ 1960 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం లార్డ్ మౌంట్‌బాటెన్ మద్రాసు వచ్చారు. గిండీ నుంచి పాలన చేసేవారు. ఆ సమయంలో మా నాన్నగారి వయసు 17. ఆయన వారికి స్వచ్ఛమైన దక్షిణ భారత భోజనం అందించేవారు. అందులో బాదం హల్వా, బంగాళదుంపల వేపుడు, సాంబారు అన్నం, పాల పాయసం ఉండేవి. నాన్నగారు తయారుచేసిన రుచికరమైన ఆహారానికి సంబర పడిన మౌంట్ బాటెన్ పేరుమీదుగా మా నాన్నగారు తన వ్యాపారం ఆ పేరుతోనే ప్రారంభించారు.మౌంట్ బాటెన్ మణి అయ్యర్ క్యాంటీన్ రుచుల గురించి అందరికీ తెలియడంతో, అందుకు భిన్నంగా పట్టప్ప పురాతన సంప్రదాయ వంటలైన క్షీరాన్నం, అక్కడర వడిసల్ (పాలు, పంచదారలతో చేసేది), బూడిద గుమ్మడి కాయ రైతా, రసవాంగీ (వంకాయ గ్రేవీ), మూర్ కూటు (మజ్జిగ గ్రేవీ), సెన్నై సోదీ (కంద కూర) వంటకాలను తయారుచేయడం ప్రారంభించారు. ఈ వంటకాలకు మంచి ఆదరణ వచ్చింది. ఈ వంటకాలను వేరే చోట తినగలం, కాని క్షీరాన్నం మాత్రం ఇంకెక్కడా దొరకదు’ అంటారు అక్కడ భోజనం చేసినవారంతా. మార్గళి క్యాంటీన్లలో పదిహేను రోజులు ముందుగానే మెనూ సిద్ధం చేస్తారు. ప్రసిద్ధులైనవారి కచేరీలు ఉంటే, ఆరోజు మెనూ కూడా చాలా ప్రసిద్ధంగా, ఎక్కువ వంటకాలతో రూపొందిస్తారు. యువతకు ఆకర్షణీయంగా, వృద్ధులకు తేలికగా అరిగే వంటకాలతో ఉంటుంది మెనూ.ఒకప్పుడు సభకు వచ్చేవారి టికెట్ చూసి మాత్రమే భోజనాలకు అనుమతించేవారు. కానీ ఇప్పుడు కచేరీలకు రాకపోయినా, క్యాంటీన్‌కి వచ్చి భోజనం చేయవచ్చు. ‘‘వండిన వంట కంటే తక్కువ మంది వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా ఏమీ చేయలేమని, ఉదయం 7.30 నుంచి వంట ప్రారంభమవుతుందని’’ చెబుతారు పట్టప్ప. మలేసియాలో నివసించే ఉమా బాలన్ అనే సంగీతాభిమాని ప్రతి సంవత్సరం ఈ కచేరీల కోసం మద్రాసు వస్తారు. భోజనాల దగ్గర వారు ప్రేమగా నెయ్యి వడ్డించడం దగ్గర నుంచి అన్నీ ఆవిడ మనసుని హత్తుకున్నాయట. సంగీత సాహిత్య సమలంకృతే అనడానికి బదులు సంగీత ఆహార సమలంకృతే అనాలేమో ఈ మార్గళి మాసాన్ని. – జయంతి -
సోమేశ్వరుడి కోవెలలో దశాబ్ది ఉత్సవాలు
బెల్లంపల్లిరూరల్ : భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న మండలంలోని చంద్రవెల్లి సోమేశ్వరుడి ఆలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 200 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయం పునఃనిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఎంతో ప్రాధాన్యత, ఘనమైన చరిత్ర గల శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వరాలయంపై ప్రత్యేక కథనం.. రెండు వందల ఏళ్ల కిందట పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్మెర వంశస్థులు బతుకు దెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సంస్థానాధీశుని వద్దకు వెళ్లి చదువులో నిష్ణాతులైన కొమ్మెర వంశీయులు తమ ప్రతిభను ప్రదర్శించగా, సంస్థానాధీశుడు మెచ్చుకుని తమ ఆధీనంలో ఉన్న చంద్రవెల్లి గ్రామాన్ని అగ్రహారముగా రాసి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి కొమ్మెర వంశస్థులు వచ్చి స్థిరపడినట్లు ప్రతీతి. మహా శివభక్తులైన ఆ వంశీయులు నిరంతర లింగారాధన, శైవ నామస్మరణతో పూజలు చేసి ఆరాధించారు. అనంతరం గ్రామంలో ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో, మట్టి ఇటుకలు, పెంకులతో ఓ చిన్న గుడిని నిర్మించి పూజలుగా వించారు. ఉత్సవ విగ్రహాల కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి శివ పంచాయతనము, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుడు, నాగేం ద్రుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. పునఃనిర్మాణం.. వందల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 1987లో దేవాలయ కమిటీ, భక్తులు ఏకతాటిపైకి వచ్చి పునఃనిర్మాణానికి పూనుకున్నారు. 2008 ఫిబ్రవరి 11 వసంత పంచమి నాడు వేద మంత్రోచ్ఛరణాల మధ్య కొత్తగా నిర్మించిన ఆలయాన్ని పునః ప్రారంభించారు. ఈనెల 22న వసంత పంచమి పురస్కరించుని ఆలయ దశమ వార్షికోత్సవాన్ని వైభవంగా జరపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. కరువు ఎరుగని గ్రామం.. గ్రామంలో వెలిసిన సోమేశ్వరుడు ఎంతో మహిమ గల దేవుడిగా భక్తుల విశ్వాసం. గ్రామం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కరువు, కాటకాలు సంభవించలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ గర్భగుడిలో శివలింగం మునిగేలా గ్రామస్తులు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సోమేశ్వరుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురిపిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. 200 ఏళ్ల నుంచి పంటలు సంవృద్ధిగా పండి కరువుకు ఆస్కారం లేకుండా సోమేశ్వరుడు కాపాడుతున్నాడని విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు.. సోమేశ్వర దేవాలయంలో ప్రతి యేటా ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ ఆలయంలో మహన్యాస, రుద్రాభిషే కం, బిల్వార్చన నిర్వహిస్తారు. వినాయక చవితి, దుర్గాదేవి వేడుకలను, గోపూజ, గ్రామ సంకీర్తన, సామూహిక సత్యనారా యణ వత్రాలు, సహఫంక్తి భోజనాలు కులమతాలకతీతంగా సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
ఖిలాకు కొత్తశోభ
గణతంత్ర వేడుకలకు ముస్తాబు 260 ఏళ్లనాటి కోటలో 26 ఉత్సవాలు జగిత్యాల జోన్ : చుట్టూ లోతైన కందకాలు.. అందులో భయంకరమైన మొసళ్లు.. ఫిరంగుల చప్పుళ్లు, సైనికుల విన్యాసాలతో ఒకప్పుడు శత్రుదుర్భేద్యంగా ఉన్న జిల్లాకేంద్రంలోని 260 ఏళ్లనాటి ఖిలా (కోట).. రిపబ్లిక్ దినోత్సవానికి వేదిక కాబోతోంది. గతమంతా కీర్తిగాంచిన ఈ ఖిలా.. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం నీడలో కొనసాగింది. జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించడం.. పరిపాలన అందుబాటులోకి రావడంతో ఖిలా కొత్త శోభ సంతరించుకోనుంది. నాడు మొగలుల సేనలు కవాతు చేస్తే.. అదే ప్రాంతంలో నేడు పోలీసులు దేశానికి గౌరవవందనం సమర్పించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నక్షత్రాకారంలో ఖిలా జిల్లాకేంద్రంలోని ఖిలా కండ్లపల్లి చెరువుకు సమీపాన ఉంటుంది. దీన్ని 20 ఎకరాల్లో నక్షత్రాకారంలో నిర్మించారు. ఆ సమయంలో ఖిలా చుట్టూ లోతైన కందకాలు తవ్వి.. అందులో మొసళ్లను పెంచేవారని ప్రచారం. దీన్ని జల్దర్గా కోటగా సైతం పిలిచేవారు. కోట నిర్మాణం యూరోపియన్ పద్ధతిలో క్యాజిల్‌ను పోలి ఉంటుంది. రాయి, సున్నంతో ఈ కోటను నిర్మించారు. 1747లో నిర్మితమైన ఖిలా జగిత్యాల పరగణానికి పరిపాలన కేంద్రంగా ఉండేది. మొ గల్ గవర్నర్‌గా ఉన్న నవాబ్ ఇబ్రహీం ఈ కోటను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. 1791లో నిజాం సైన్యాలకు, ఇబ్రహీం థంసా కుమారుడికి, ఎలగందుల పాలకుడైన ఎహెత్షామి జంగ్ సైన్యాలకు యుద్దం కూడా జరిగినట్లు చెబుతుంటారు. ఇందులో ఖిలా సంరక్షకుడు జాఫర్ అలం పోరాడి నిజాం సేనల చేతిలో ఓడిపోయినట్లు చెపుతుంటారు. కట్టె చెక్కల మీదుగా కోటలోకి ప్రవేశం కోటలోకి నేరుగా ఎవరూ వెళ్లే అవకాశం ఉండేదికాదు. పొడవైన, లోతైన కందకాలు దాటాలంటే వెడల్పాటి పెద్ద కట్టె చెక్కలు వేసేవారని, అవి దాటాక రెండు ప్రధాన ద్వారాలు వస్తాయి. వీటికీ పొడవైన తలుపులు ఉన్నాయి. వీటిని ఏనుగులతోనే లాగించేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పటికీ కనిపిస్తున్న ఫిరంగులు మొగలులు, తర్వాత వచ్చిన నిజాంలు ఈ కోటను తమకు రక్షణ వలయంగా ఉపయోగించున్నారు. కోటలోని ఎతైన ప్రదేశంలో 100 వరకు ఫిరంగులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫిరంగులు కోటలో ఇప్పటికీ కనిపిస్తాయి. వాటిపై మహ్మాద్ ఖాసీం పేరు కనిపిస్తుంది. కోటలో మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు విశాలమైన గదులు నిర్మించారు. కోటను సంరక్షించేందుకు ఒక ఖిలేదారు, 200 మంది సిపాయిలు పర్యవేక్షించేవారని తెలుస్తోంది. పరిపాలన కేంద్రంగా ఖిలా 17వ శతాబ్దంలో నిర్మించిన ఖిలా ఓ పరిపాలన కేంద్రంగా ఉండేది. 1905 దాకా ఎలగందుల సర్కారుగా ఉన్న సమయంలో ఖిలాలోనే పరగణా కార్యాలయాలు పనిచేసేవి. దువ్వం తాలుకాదార్ (సబ్ కలెక్టర్) ఇక్కడి నుండే పాలన సాగించేవారు. ఇలా 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాన్ని ఈ కోటలోనే నిర్వహించారు. వేడుకలకు సర్వంసిద్ధం కోట మరమ్మతు, ఆధునీకరణకు రూ.50 లక్షలు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం. రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ఆ నిధులు చిన్నచిన్న పనులకే సరిపోలేదు. ఖిలాలో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంకా ఆచరణలోకి రాలేదు. ఖిలాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో, ఈ సారైన అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టి పడుతుందని జగిత్యాల ప్రజలు ఆశిస్తున్నారు. -
ఉమ్మడిగా.. ఉత్సాహంగా
సకుటుంబ సపరివారంగా భోగి ఉత్సవాలు పల్లె వాతావరణంలో వెలిగిపోయిన మురళీనగర్ హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దంపతులు మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులో భోగి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీలోని వారంతా కలిసి ఉమ్మడిగా పండగను జరుపుకున్నారు. కాలనీ వాసులంతా కదలి వచ్చి వయోభేదం లేకుండా పిల్లా పాపలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వందలాది కుటుంబాలు తరలిరావడంతో పాటు పల్లెవాతావరణాన్ని తలపించే విధంగా ఉత్సవాలు జరిగాయి. ఎక్కడ చూసినా సంక్రాంతి ముగ్గులు మెరిసిపోయాయి. ఉత్తర నియోజకవవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ప్రజలను ఉత్సాహపరిచారు. అలరించిన కళారూపాలు ఉత్సవాలు భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవ ప్రాంగణంలోకి అందరూ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో తరలి వచ్చారు. భోగిమంటల్లో పాత ఆశలను వదిలేసి నూతన ఉషస్సు కోసం ఆకాంక్షిస్తూ భోగిమంటల చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. ఒక వైపు భోగిమంటలు వేస్తుండగా మరోవైపు మహిళలు కొత్త బియ్యంతో భోగి జావ తయారు చేసి అందరికి ప్రసాదంగా అందజేశారు. హరిలో రంగ హరీ అంటూ హరిదాసు కీర్తనలతో హరిదాసు విష్ణు స్తుతి గీతాలతో ఆధ్మాత్మికత సంతరించుకుంది. గంగిరెద్దు విన్యాసాలు, పద్మనాభం మండలం అనందపురం గ్రామానికి చెందిన తప్పెట గుళ్ల కళాకారుల విన్యాసాలు విశేషంగా అలరించాయి. పులివేషధారులు మంటల్లో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. స్వాగత నృత్యం, కూచిపూడి నృత్యాలు, వనితా వాకర్స్ మహిళల కోలాటాలు, దాండియా నృత్యాలు పండగకు మరింత వన్నె తెచ్చాయి. అంతా ఒకటై.. ఆనందించిన వేళ డప్పుల శబ్దాలకు ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు వారితో పాటు జతకలిసి మరింత ఉత్సాహాన్ని నింపారు. బామ్మలు తాతయ్యలు తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు చిన్నారులకు భోగిపళ్లు వేసి దీవెనలు అందజేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నా«థం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, స్వాతి ప్రమోటర్స్ అధినేత ఎం.కృష్ణారెడ్డి, వైశాఖి స్పోర్ట్స్ పార్కు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్, సనపల వరప్రసాద్, కార్యదర్శి నారాయణరావు, టీఎన్ రెడ్డి, కూర్మారావు, 39వ వార్డు వైఎస్సార్సీïపీ అధ్యక్షుడు ఎస్.మౌళి, వాకర్స్ క్లబ్ కార్యదర్శి కె.త్రిపుర సుందరరావు, వనితా వాకర్స్ క్లబ్ కార్యదర్శి వి.జయప్రభాశర్మ, ఎస్.వరప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రారంభమైన గూగూడు బ్రహ్మోత్సవాలు
గూగూడు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పీర్లచావిడిలోని పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను దొరికిన కొండారెడ్డి వంశీకులు బయటకు తీసి ప్రథమ దర్శనం చేయించారు. కుళ్లాయిస్వామి పంజాను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి పీరును ప్ర«థమ దర్శనం కోసం చావిడి ముందుటి అరుగు పైకి తీసుకు రాగానే భక్తులు పెద్ద ఎత్తున కుళ్లాయిస్వామి నామస్మరణ చేశారు. -
ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు
కడప కల్చరల్ : కృత్తిక నక్షత్రం సందర్భంగా గురువారం జిల్లా అంతటా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వరునికి జిల్లాలో ఆలయాలు తక్కువే అయినా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని చోట్ల శివాలయాల్లో ఉండే ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు మయూర వాహనంపై గ్రామోత్సవాలు నిర్వహించారు. తమిళ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు
కడప కల్చరల్ : కృత్తిక నక్షత్రం సందర్భంగా గురువారం జిల్లా అంతటా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వరునికి జిల్లాలో ఆలయాలు తక్కువే అయినా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని చోట్ల శివాలయాల్లో ఉండే ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు మయూర వాహనంపై గ్రామోత్సవాలు నిర్వహించారు. తమిళ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వ ఉగాదికి దుర్గగుడి మార్కు..!
నగరంలోని ‘నాక్’లో ఉత్సవాలు ఉగాది పచ్చడి దేవస్థానం నుంచే.. అర్చకులు, వేదపండితులు, సిబ్బంది సేవలు విజయవాడ : నగరంలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం నిర్వహించే దుర్ముఖి నామ ఉగాది ఉత్సవాల్లో దుర్గగుడి మార్కు కనపడుతోంది. వేడుకలను సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను దుర్గగుడి అర్చకులు, వేదపండితులు, సిబ్బందే నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్, స్థానాచార్య విష్ణుబోట్ల శివప్రసాద్‌తోపాటు సుమారు ఆరేడుగురు అర్చకులు, పరిచారకలు, అదే సంఖ్యలో వేదపండితులు ప్రభుత్వ ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మినిస్టీరియల్ సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వీవీఐపీలకు, ప్రజలకు కావాల్సిన ఉగాది పచ్చడిని దేవస్థానం నుంచే పంపుతున్నారు. అంతేకాకుండా కొంతమంది వీవీఐపీలకు దేవస్థానం ప్రసాదాలను కూడా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దేవస్థానానికి వీవీఐపీల తాకిడి? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులంతా నగరంలోనే ఉంటున్నందున ఉగాది రోజున వీఐపీలకు తాకిడి బాగానే ఉంటుందని దేవస్థానం అర్చకులు అంచనాలు వేస్తున్నారు. వచ్చేవారికి ఆలయ మర్యాదలో సత్కరాలు, దర్శనాలకు సిద్ధం చేస్తున్నారు. మరో వైపు సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత్వరగా అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాగ శ్రవణంపెతైలుగు తమ్ముళ్ల పెత్తనం దుర్గగుడిలో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా ఈవో ఆధ్వర్యంలో ఉగాది పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ ఏడాది అలాగే నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి వాస్తు, జ్యోతిష్యం చెబుతున్న ఒక సిద్ధాంతి చేత ఇంద్రకీలాద్రిపై పంచాగ శ్రవణం చేయించి, దేవస్థానం ఖాతా నుంచి నజరానా ఇప్పించాలని నగరానికి చెందిన కొంతమంది రాష్ట్రస్థాయి అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. దీనిపై కమిషనర్ కార్యాలయం నుంచి కూడా సిఫార్సు చేయించారు. ఆ సిద్ధాంతిని ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చి ఆయన ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని నేతల ఆలోచన. అయితే దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇటీవలే దేవస్థానానికి విశ్వనాథ్ ఆస్థాన సిద్ధాంతిగా నియమితులయ్యారు. ఆయనతోనే పంచాంగ శ్రవణం చేయిస్తానంటూ తెలుగు తమ్ముళ్లకు, ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. -
జాతర ముసుగులో రికార్డింగ్ డ్యాన్స్‌లు!
ఆనందపురంలో మాజీ ఎంపీపీ నిర్వాకం మంత్రి ఫొటో పెట్టి వేదిక ఏర్పాటు సహకరించిన పోలీసు యంత్రాంగం విశాఖపట్నం :రికార్డింగ్ డ్యాన్స్‌లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించినా ఆనందపురం జంక్షన్లో మాత్రం అమ్మవారి జాతర పేరుతో ఓ మాజీ ఎంపీపీ ఏర్పాటు చేసి అందరికీ వినోదం పంచాడు. నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి తమ వంతు సహకారం అందించారు. వేదికపై జిల్లా మంత్రి ఫొటోను ఏర్పాటు చేయడంతో పోలీసు యంత్రాంగం అతనికి దాసోహమంది. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు భారీగా నజరానా అందినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. ఆనందపురానికి చెందిన మాజీ ఎంపీపీ ఒకరు మండలంలోని వేములవలసలో పైడితల్లమ్మ ఉత్సవాలను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆదివారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మంగళవారం సినీ మ్యూజికల్ నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు కాస్త పక్కదారి పట్టి రికార్డింగ్ డ్యాన్స్‌లుగా మారిపోయాయి. యాంకరింగ్ పేరుతో వచ్చిన మహిళలతో కురుచ దుస్తులు వేయించి ప్రదర్శన చేయించారు. ఆదివారం నాటి కార్యక్రమం శ్రుతిమించి మహిళలు సిగ్గు పడే విధంగా ఉందని పలువురు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కార్యక్రమంలో కూడా సినిమా పాటలకు పురుషులు, మహిళలతో గ్రూపు రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను మంత్రి ముఖ్య అనుచరుడు వేదికపై కూర్చొని కాసేపు వీక్షించారని తెలిసింది. వీధి డ్యాన్స్‌లపై కేసులు బనాయించే పోలీసులు ఈ కార్యక్రమాలపై కన్నెత్తై చూడకపోవడం వెనక మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు నజరానాలు కూడా అందడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
త్యాగరాజ స్వామి నడయాడిన ఊరు తిరువయ్యారు
దేవునికి ఉత్సవాలు జరుగుతాయి. కాని ఒక వాగ్గేయకారునికి కూడా జరుగుతాయా? జరుగుతాయి. ఆ గౌరవం, వైభవం త్యాగరాజ స్వామికే దక్కింది. వేదిక తిరువయ్యారు. అవును. తమిళనాడులో తంజావూరుకు చేరువలోనున్న తిరువయ్యారులో ప్రతి ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వీనుల విందుగా కన్నుల పండువగా జరుగుతాయి. కావేరీ నది ఒడ్డున త్యాగరాజ స్వామివారి సమాధి వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో దేశం నలుమూలలకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని, త్యాగరాజ కీర్తనలను గానం చేస్తారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను బృందగానం చేస్తారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులుగా ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజు ఖ్యాతిపొందారు. ఈ త్రిమూర్తులలో తెలుగువాడైన త్యాగరాజుకు మాత్రమే ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం. త్యాగరాజ స్వామి 1847లో పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారులో సమాధి పొందాడు. ఆయన అంత్యక్రియలు కావేరి నది ఒడ్డున జరిగాయి. సంవత్సరం తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనకు నివాళిగా ఆరాధనోత్సవాలు ప్రారంభించారు. 1921 వరకు రెండు బృందాలు ఈ కచ్చేరిలు నిర్వహించేవి. అయితే ప్రఖ్యాత నర్తకి, గాయని బెంగుళూరు నాగరత్నమ్మ ఇక్కడ త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడమే గాక అంతవరకూ స్త్రీలకు ప్రవేశం లేని ఆ ఆరాధనోత్సవాలలో స్త్రీలు పాల్గొనాలనే ఉద్యమాన్ని ప్రారంభించింది. తనే స్వయంగా వేదిక కట్టి ఆరాధనోత్సవాల్లో కచ్చేరీలు ఇచ్చింది. అంతేకాదు శేషజీవితం అక్కడే గడుపుతూ తన ఆస్తి ఐశ్వర్యాలన్నీ త్యాగరాజ స్వామికే అంకితం చేసింది. ఈ పోటాపోటీ కొనసాగుతుండగా ఇది సరైనది కాదని 1940లో అందరూ కలిసి సమూహిక ఆరాధన చేసే ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి ఏటా ఆ తిథిని బట్టి ఐదు రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఐదు నదుల ఊరు ఐదు పవిత్ర నదుల మధ్య ఉన్న ఊరు కావడం వల్ల తిరువయ్యారుకు ఆ పేరు వచ్చింది. ఆ నదులు: అరిసిలారు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు, కావేరియారు. తమిళంలో ‘తిరు’ అంటే పవిత్ర, ‘ఐ’ అంటే ఐదు, ‘ఆరు’ అంటే నది అని అర్థం. తంజావూరు నుంచి తిరువైయారుకు చేరుకోవాలంటే ఈ ఐదు నదుల మీద నిర్మించిన వంతెనలను దాటుకుంటూ రావాల్సిందే. కాని వాస్తవానికి ఇక్కడ ఆరునదులు ఉన్నాయని చెప్పాలి. సంగీతం ఆ ఆరోనది. త్యాగరాజస్వామి ఆ నదీపురుషుడు. ప్రాచీన క్షేత్రం పంచనదీశ్వరాలయం త్యాగరాజస్వామి సమాధి చెందిన ఊరు కావడం వల్లే కాక ప్రాచీన శైవక్షేత్రమైన పంచనదీశ్వరాలయం వల్ల కూడా తిరువయ్యారు ప్రసిద్ధి చెందింది. పంచ ప్రాకారాలతో 60 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో వివిధ కాలాల్లో చోళులు, పల్లవులు, పాండ్యులు తదితర రాజవంశాలకు చెందిన రాజులు నిర్మించిన మందిరాలు, వేయించిన శిలాశాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ దక్షిణ భాగాన్ని దక్షిణ కైలాసం అని, ఉత్తర భాగాన్ని ఉత్తర కైలాసమని అంటారు. ఉత్తర కైలాస భాగాన్ని రాజరాజ చోళుని భార్య క్రీస్తుశకం పదో శతాబ్దంలో నిర్మించిందని చెబుతారు. ఆ సందర్భంగా ఆమె పలు దానాలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే ‘ఆట్కొండర్’ (కాల సంహారమూర్తి) మందిరం, దాని ఎదుట ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన హోమగుండం కనిపిస్తాయి. ఏటా ఇక్కడకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో, మహాశివరాత్రి వేడుకల్లో ఇక్కడ ఘనంగా పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయానికి చేరువలో ఉన్న చిన్న ఇంట్లోనే త్యాగరాజు తన సన్యాసాశ్రమ జీవితాన్ని గడిపారు. భక్తి వినా సన్మార్గము కలదే... ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా...’ అని మానవాళికి బోధించిన త్యాగరాజు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరులో 1767 మే 4వ తేదీన జన్మించారు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం అయినా భక్తులు, సంగీతాభిమానులు త్యాగరాజుగా, త్యాగయ్యగా పిలుచుకుంటారు. రామభక్తుడైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామానికి చెందిన వారు. బాల్యంలో సొంఠి వెంకటరమణయ్య వద్ద సరిగమలు నేర్చుకున్న త్యాగరాజు అనతి కాలంలోనే వాగ్గేయకారుడిగా ఎదిగారు. శిష్యుడి గురించి తంజావూరు రాజుకు సొంఠి వెంకట రమణయ్య సిఫారసు చేయగా, రాజు ఆయనను ఆహ్వానించారు. సభకు విచ్చేసిన త్యాగయ్యకు రాజు విలువైన కానుకలను సమర్పించి, ఆస్థాన పదవి అలంకరించమని కోరారు. అయితే, ‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సుఖమా...’ అంటూ కోరి వచ్చిన సంపదను సైతం తృణప్రాయంగా తిరస్కరించి, రాముని సన్నిధినే పెన్నిధిగా ఎన్నుకున్న భాగవతోత్తముడు త్యాగయ్య. అందుకే, ఆయన అంటే నేటికీ సంగీత విద్వాంసులకు, సంగీతాభిమానులకు అంతటి భక్తి ప్రపత్తులు. త్యాగయ్య తన జీవితకాలంలో దాదాపు 24 వేలకు పైగా కీర్తనలను రచించి, స్వరపరచాడు. అయితే, ప్రస్తుతం దాదాపు ఏడువందల కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చరమకాలంలో సన్యాసం స్వీకరించిన త్యాగయ్య తన శేషజీవితాన్ని తిరువయ్యారులో గడిపారు. ఇక్కడే ఒక చిన్న ఇంటిలో ఉంటూ పలు అపురూప కీర్తనలను రచించి, స్వరబద్ధం చేశారు. ఇక్కడే ఆయన 1847 జనవరి 6న సమాధి చెందడంతో నాటి నుంచి ఇది కర్ణాటక సంగీతకారులందరికీ పుణ్యస్థలిగా మారింది. - పన్యాల జగన్నాథ దాసు తిరువయ్యారుకు వెళ్లాలంటే... వైమానికమార్గం తిరుచిరాపల్లిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తిరువయ్యారుకు ఈ విమానాశ్రయం 71 కిలోమీటర్ల దూరం. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. తిరుచిరాపల్లి నుంచి తిరువయ్యారుకు రైలు/రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. రైలుమార్గం తిరువయ్యారుకు సమీపంలోని తంజావూరులో రైల్వేస్టేషన్ ఉంది. త్రిచి, మదురై, కోయంబత్తూర్,నాగోర్ రైల్వే లైన్లు ఈ స్టేషన్‌కు అనుసంధానించి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా తంజావూరుకు రైలు సదుపాయం ఉంది. రోడ్డు మార్గం హైదరాబాద్ నుంచి తంజావూరుకు బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి. తంజావూరు నుంచి తిరువయ్యారుకు 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సు ద్వారా తిరువయ్యారుకు చేరుకోవచ్చు. -
చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
-
మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి
సందర్భం- 23న దీపావళి భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి. ధనత్రయోదశి ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథనాలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది. నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్లిపోయాడు. అందరూ ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్థిల్లుతారు. కనుక ఇది ధనత్రయోదశి అయింది. ధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి. భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు. దీపావళి ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ. దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది. కార్తీకం-పాడ్యమి కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి. భగినీహస్త భోజనం కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు. ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు. - డా॥పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సరసిజ నిలయే సరోజ హస్తే ధవళ తరాంకుశ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్... అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ ధర్మశాస్త్రం చెబుతోంది. -
బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి
ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఘనంగా చండ్ర రాజేశ్వరరావు శతజయంతి వేడుకలు చండ్ర ‘జీవిత చరిత్ర’ పుస్తకావిష్కరణ సాక్షి, సిటీబ్యూరో: పాశ్చాత్య దేశాల పెత్తనం, అంతర్జాతీయ పెట్టుబడిదారి శక్తులను ఎదుర్కొనేందుకు బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు కొండాపూర్‌లోని ఎన్ఆర్ఆర్ రిసెర్చ్ సెంటర్లోని ఇంద్రజిత్ మెమోరియల్ హాల్లో ఆది వారం ఘనంగా జరిగాయి. కార్యక్రమా న్ని పురస్కరించుకుని ‘సోషల్ మూవ్మెంట్ అండ్ రోల్ ఆఫ్ లె ఫ్ట్’ అంశంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహిం చారు. వివిధ దేశాలకు చెందిన లెఫ్ట్ నేతలు ప్రసంగించారు. శతజయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కె.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో పట్నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తలొగ్గుతోందని ఆరోపించారు. ఫలితంగా వారికి బహుళ ప్రయోజనా లు చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడంతో ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశంపై పడుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశ సమగ్రతకు ముప్పుపొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చండ్ర కు ఘన నివాళి.. శత జయంతిని పురస్కరించుకుని పలువురు నేతలు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మడమతిప్పని, నిష్టగల కమ్యూనిస్టువాది అని సీపీఐ మాజీ జనరల్ సెక్రటరీ ఏబీ బర్దన్ కీర్తించారు. సామాజిక రోగులకు వైద్యం చేసిన గొప్పవ్యక్తి చండ్ర అని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపి వారి లో ప్రశ్నించేతత్వాన్ని రాజేశ్వరరావు రగిల్చారని ఫ్రొఫెసర్ రమా మేల్కోటి కొనియాడారు. అంతకుముందు డాక్టర్ కె.పూర్ణచంద్రరావు రాసిన ‘చండ్ర రాజేశ్వరరావు జీవిత చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చండ్ర ఉద్యమ స్ఫూర్తి, ఆయన చేసిన సేవలను వివరి స్తూ డాక్టర్ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో వియత్నాం, క్యూబా, బంగ్లాదేశ్‌లకు చెందిన లెఫ్ట్ నేతలు త్రాన్ క్వాన్గ్ తు యెన్, నుయెన్ తి కియెన్వాన్, మేరిలేదిస్ డ్యునాస్ మొరాలెస్, సయ్యద్ అబూ జఫార్ అహ్మద్, బిమాల్ బిస్వాస్, సీఆర్ ఫౌండేషన్ జర్నల్ సెక్రటరీ పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.