ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు | grand celebration to Sri Subramanya Swamy fairs | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు

Published Thu, Jul 28 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు

ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్సవాలు

కడప కల్చరల్‌ : కృత్తిక నక్షత్రం సందర్భంగా గురువారం జిల్లా అంతటా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వరునికి జిల్లాలో ఆలయాలు తక్కువే అయినా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని చోట్ల శివాలయాల్లో ఉండే ఉత్సవమూర్తులకు  విశేష పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు మయూర వాహనంపై గ్రామోత్సవాలు నిర్వహించారు. తమిళ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement