ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం | MLC Elections Counting Starts in Telangana | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 30 2015 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాల చొప్పున, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా, 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్నగర్లో అంబేడ్కర్ భవన్లో, నల్లగొండలో డ్వామా కార్యాలయంలో, ఖమ్మంలో అంబేడ్కర్ భవన్లో, రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో ఓట్లు లెక్కిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement