'ఐడియాతో రండి...ప్రాజెక్టుతో వెళ్లండి'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన టీ-హబ్ ను గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో టీ హబ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయదుర్గం సమీపంలో 15 ఎకరాల్లో టీ- హబ్ ను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఐడియాతో రండి .... ప్రాజెక్టుతో వెళ్లండి' అని కేటీఆర్ పిలుపు నిచ్చారు. టీ-హబ్లో 200 స్టార్టప్ కంపెనీలకు అవకాశం కల్పించనున్నారు. స్టార్టప్ల రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.