వారం రోజుల పాటు బడిబాట
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏటా జూన్ 12వ తేదీనే పాఠశాలలు పునఃప్రారంభ మవుతుంటాయి. కానీ ఈసారి జూన్ 12వ తేదీ శుక్రవారమైంది. తరువాత 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం రెండూ సెలవు దినాలు ఉన్నాయి. 12వ తేదీన స్కూళ్లు ప్రారంభిస్తే వెంటనే వరుసగా రెండు సెలవు దినాలు ఉండడంతో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు అధికారులు బడుల ప్రారంభ తేదీని 15వ తేదీకి మార్చారు. ఆరోజునుంచి బడిబాట కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. బడిబయట ఉన్న పిల్లలందర్నీ పాఠశాల ల్లో చేర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరంలో ప్రారంభించనున్నారు.
జూన్ 15 నుంచి బడులు
Published Mon, May 25 2015 9:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement