ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్‌లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.
గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్‌లో 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.
దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.
యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్‌కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్‌లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment