ఆరోగ్యానికి ఉపకరించనున్న ఈత | swimming is the best use for health | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి ఉపకరించనున్న ఈత

Published Sun, Jan 28 2018 9:27 AM | Last Updated on Fri, Aug 10 2018 5:05 PM

సాక్షి, విజయవాడ: విజయవాడలోని దుర్గా ఘాట్లో ఆక్వాడెవిల్స్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపి గోకరాజు గంగరాజు, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్లు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా ఆక్వాడెవిల్స్ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఈత ఉపకరిస్తుందని అన్నారు. పోటీల్లో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అయిదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వయస్సు వరకు స్విమ్మర్లు ఆయా కేటగిరీల్లో ఈత పోటీల్లో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజికి సమాంతరంగా 1.5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో స్విమ్మర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement