Swimming Competitions
-
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో.. జరిగిన స్విమ్మింగ్, రైడింగ్ పోటీలు..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో హైదారాబాద్ పోలో, రైడింగ్ ఆధ్వర్యంలో క్లబ్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. నగర శివార్లలోని అజీజ్ నగర్ వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల అండర్ 14 స్విమ్మింగ్ విభాగంలో పూర్వి కస్సాం, పురుషుల 21 ఏళ్ల విభాగంలో కున్వర్ కుషాల్ సింగ్ గోల్డ్ మెడల్స్ పొందారు. జూనియర్ హక్స్గా దీప్ కుక్రేటి, సీనియర్ హక్స్గా అభినవ్‌లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు
R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్ డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్‌కు పథకాలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు’ అంటూ పోస్ట్ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: R Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
Mahesh Babu: గర్వపడే పని చేసిన గౌతమ్.. మురిసిపోతున్న నమ్రత
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గౌతమ్ ఘట్టమనేని. సినిమా కోసం మహేశ్‌బాబు ఏ రకంగా కష్టపడతాడో అందరికి తెలిసిందే. దర్శకుడు ఆశించిన ఔట్‌పుట్‌ని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాడు. అవే లక్షణాలు ఆయన తనయుడు గౌతమ్‌కి వచ్చాయి. ఏ పని అయినా మొదలుపెడితే దాంట్లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దీనికి నిదర్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మహేశ్ సతీమణి నమ్రత. గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. ఇక తమ అభిమాన హీరో కొడుకు స్విమ్మింగ్‌లో రికార్డు క్రియేట్ చేయడంతో.. మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా, గౌతమ్ ఘట్టమనేని మహేశ్ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: మహేశ్ రియలైజ్ అవుతున్నాడు.. రేర్ పిక్ షేర్ చేసిన నమ్రత -
ఆరోగ్యానికి ఉపకరించనున్న ఈత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని దుర్గా ఘాట్‌లో ఆక్వాడెవిల్స్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపి గోకరాజు గంగరాజు, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా ఆక్వాడెవిల్స్ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఈత ఉపకరిస్తుందని అన్నారు. పోటీల్లో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అయిదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వయస్సు వరకు స్విమ్మర్లు ఆయా కేటగిరీల్లో ఈత పోటీల్లో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజికి సమాంతరంగా 1.5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో స్విమ్మర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు పోటీపడ్డారు. -
కృష్ణానదిలో అట్టహాసంగా స్విమ్మింగ్ పోటీలు
-
రిలేలో రాష్ట్రానికి ఆరు పతకాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రిలే జట్లు అరడజను పతకాలు సాధించాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో కర్ణాటక జట్టు 1300 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. 700 పాయింట్లతో తమిళనాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 400 మీ. ఫ్రీస్టయిల్ బాలుర (గ్రూప్-1) విభాగంలో రేవంత్ రెడ్డి, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో గుణ చక్రవర్తి రజత పతకాలు గెలిచారు. 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలే బాలుర ఈవెంట్లో శివ కుమార్, సాగర్‌దీప్, నిశాంత్, చిన నాగేంద్రలతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకం గెలుపొందింది. ఇదే విభాగం గ్రూప్-2లో గృహంత్ సాయి, రాఘవ, శివ సాకేత్, అభిషేక్‌లు ఉన్న ఏపీ జట్టు కూడా కాంస్యం నెగ్గింది. 4ఁ50 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో శ్రీభువన్ రెడ్డి, సుశాంత్, రియాన్ చెరియన్, అఖిల్‌ల జట్టు మూడో స్థానంలో నిలిచింది. 400 మీ. ఫ్రీస్టయిల్ బాలికల (గ్రూప్-1) విభాగంలో భవ్య, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో నివేదిత కాంస్య పతకాలు నెగ్గారు. బాలికల 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో అలేఖ్య, స్పందన, శ్రీవల్లూరి, రత్నవల్లూరిలతో కూడిన ఏపీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 50 మీ. ఫ్రీస్టయిల్లో అతమిక కృష్ణన్ బంగారు పతకం గెలుపొందింది. 4ఁ100 మీ. రిలేలో బబిత, ఆశ, స్మృతి మానే, లక్ష్మీలయ గల రాష్ట్ర జట్టు, 4 x50 మీ. ఫ్రీస్టయిల్ రిలే (గ్రూప్-3)లో సాయి కీర్తి, అనిక సోనిగ్, శ్రేష్ట, నదియా ఇషాన్‌లతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకాలు సాధించింది. అమిత గొండి మరో స్వర్ణ పతకం నెగ్గింది. 50 మీ. ఫ్రీస్టయిల్లో ఆమె విజేతగా నిలిచింది. బాలికల 100 మీ. ఫ్రీస్టయిల్ (గ్రూప్-4) ఈవెంట్లో త్రిన తనూజ, నికిత వరుసగా రజత, కాంస్యాలు చేజిక్కించుకున్నారు.