Gokaraju Gangaraju
-
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
-
‘అక్వా డెవిల్స్’పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట వద్ద బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నిర్మించిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏడీడబ్లు్యఏ) కట్టడాల కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు జారీచేసిన తుది నోటీసులపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇవ్వలేదు. సదరు నోటీసులకు ఏడీడబ్లు్యఏ ఏమాత్రం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని హైకోర్టు అభిప్రాయపడింది. సంతృప్తికరమైన వివరణలు ఇవ్వకుండా, జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరితే ఎలా అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సీఆర్డీఏ జారీచేసిన నోటీసులకు ఇచ్చిన వివరణలను అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ న్యాయవాదికి న్యాయస్థానం సూచించి తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. తమకు చెందిన స్విమ్మింగ్ ఫూల్, ఇతర నిర్మాణాలను కూల్చివేసే నిమిత్తం సీఆర్డీఏ అధికారులు జారీచేసిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏడీడబ్లు్యఏ అధ్యక్షుడు కేఎస్ రామచంద్రరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ విజయలక్ష్మి గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టామన్నారు. తమవి చిన్నచిన్న షెడ్డులు మాత్రమేనని.. ఇవి కృష్ణా నదికి 100 మీటర్ల వెలుపలే ఉన్నాయని వివరించారు. సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏడీడబ్లు్యఏ ఆర్సీసీ నిర్మాణాలు చేపట్టిందన్నారు. స్విమ్మింగ్ ఫూల్తో సహా ఈ నిర్మాణాలన్నీ 100 మీటర్లలోపే ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన కోర్టు ముందుంచారు. పిటిషనర్ కోర్టులో చెబుతున్న అంశాలేవీ సీఆర్డీఏ అధికారులకిచ్చిన వివరణలో లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్డీఏ ఉత్తర్వులపై ఎటువంటి స్టే మంజూరు చేయకుండా తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేశారు. తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవు కరకట్ట వద్ద తమకున్న నిర్మాణాన్ని కూల్చివేయకుండా సీఆర్డీఏను నియంత్రించాలని కోరుతూ పాతూరి సుధారాణి అనే మహిళ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ వివరణను పరిగణనలోకి తీసుకున్నాకే తుది ఉత్తర్వులు జారీచేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జగన్మోహన్రెడ్డి కోర్టుకు తెలిపారు. తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవన్న కాసా వాదనను న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి నమోదు చేస్తూ సుధారాణి పిటిషన్‌ను పరిష్కరించారు. -
గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..
సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్‌ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్సీసీ రూఫ్‌తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది. హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీఆర్డీఏ డైరెక్టర్ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అని, ఆయన కుమారుడు సింగపూర్‌లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు. -
గోకరాజు సహా ఐదుగురికి నోటీసులు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన ఐదు భవనాల యజమానులకు సీఆర్డీఏ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రకు చెందిన భవనాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చిన అన్ని నిర్మాణాల వద్ద ఏ తరహా నిర్మాణాలున్నాయి? వాటి కొలతలు వంటి అన్ని వివరాలను సేకరించారు. మొత్తం ఇప్పటివరకు 26 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చినట్లయింది. మరికొన్ని భవనాలకు ఒకటి, రెండురోజుల్లో నోటీసులిచ్చే అవకాశం ఉంది. -
చక్కెర..ఓ చేదు నిజం
సాక్షి,గన్నవరం : జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్ ప్రకటించడం జంక్షన్ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్జంక్షన్కు ఓ తలమానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన షుగర్ ఫ్యాక్టరీ ప్రస్థానం.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం.. షుగర్స్ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్లో ప్రారంభమైన చెరకు క్రషింగ్ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్‌ను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? మూడేళ్లుగా డెల్టా షుగర్స్ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి. జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
దాసరి విగ్రహావిష్కరణలో వివాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎంపీల పేర్లు లేకుండా అన్నీ తానై నడిపించినట్టుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య తదితరులు మనస్తాపం చెందారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పోస్టర్లా ఉందంటూ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన అందరివాడు.. మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి అందరివాడు. ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారు. పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించాం. స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరాం. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్లా ఉంది. అందరికి సంబంధించినదిలా కనపడడం లేదు. వాళ్ల తాలూకు మంత్రులు, ఎంపీలు, కాబోయే ఎంపీల పేర్లున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. -
2019లో చంద్రబాబు ఓడిపోతారు
సాక్షి, విజయవాడ : 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు రాజీనామ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధానిపై బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాబు నవ్వుతారా అని మండిపడ్డారు. అధ్యక్షుడు అమిత్‌షా తిరుమల వస్తే దాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారా అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కర్ణాటక ఫలితాలు.. బాబుకు చెంపపెట్టు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు చెంపపెట్టని, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. బీజేపీని ఓడించాలని బాబు ప్రయత్నించారని, కానీ కర్ణాటకలోని తెలుగు ప్రజలు బాబు కుతంత్రాలను తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్ తరపున ఉద్యోగులు ప్రచారం చేయడం తప్పని, అభివృద్ధి నినాదమే బీజేపీని గెలిపించిందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రభావం దక్షిణాది మీద ఉంటుందన్నారు. -
దీక్షకు దిగిన ఎంపీ గోకరాజు గంగరాజు
-
కేంద్ర పథకాలను హైజాక్ చేస్తున్న టీడీపీ
ఆచంట : కేంద్ర ప్రభుత్వ పథకాలను హైజాక్ చేసి టీడీపీ పబ్బం గడుపుకుంటోందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు విమర్శించారు. ప్రధాని మోడీ చేపడుతున్న పనులకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి లభిస్తోందని, అయితే రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులు, పథకాలకు కేంద్రం ఊసే లేకుండా పసుపు రంగు పులిమి, పక్కన చంద్రన్న బాట అంటూ బోర్డులు తగిలించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆచంట మండలంలో పలు రహదారులను ప్రారంభించిన అనంతరం పెదమల్లం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముచ్చెర్ల నాగ సుబ్బారావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ గంగరాజు పరోక్షంగా అధికార టీడీపీపైనా, మంత్రి పితాని సత్యనారాయణపైనా మండిపడ్డారు. టీడీపీ సహకరించకపోయినా ఏనాడూ అభివృద్ధి పనులు ఆపలేదన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తే టీడీపీ నేతలు రాకపోగా ప్రజాప్రతినిధులు, అధికారులను సైతం రాకుండా చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రూ 10 లక్షలు తక్కువ కాకుండా నిధులు కేటాయిస్తుంటే టీడీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో పెద్ద ఎత్తున స్కాం జరుగుతోందని, ర్యాంపుల్లో రౌడీ రాజకీయం నడుస్తోందని గంగరాజు వ్యాఖ్యానించారు. ఎవరైనా సాయం చేస్తే విశ్వాసం ఉండాలన్నారు. నియోజకవర్గ బీజేపీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల కబర్ధి, జాతీయ కాయర్ బోర్డు సభ్యుడు పీవీఎస్ వర్మ, పార్టీ నాయకులు గోపావఘుల మాధవశర్మ, రఘుబాబు పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి ఉపకరించనున్న ఈత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని దుర్గా ఘాట్‌లో ఆక్వాడెవిల్స్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపి గోకరాజు గంగరాజు, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా ఆక్వాడెవిల్స్ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఈత ఉపకరిస్తుందని అన్నారు. పోటీల్లో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అయిదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వయస్సు వరకు స్విమ్మర్లు ఆయా కేటగిరీల్లో ఈత పోటీల్లో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజికి సమాంతరంగా 1.5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో స్విమ్మర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు పోటీపడ్డారు. -
'నన్ను అందరూ దానకర్ణుడు అంటారు'
విజయవాడ: కృష్ణానది కరకట్టల ఆక్రమణలపై ఎంపీ గోకరాజు గంగరాజు స్పందించారు. కరకట్టలపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు రావన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. తాను కట్టిన భవనాలు ఆక్రమణలు అయితే భవానీ ఐలాండ్ ఆక్రమణ కాదా అని ఆయన ప్రశ్నించారు. తమ భవనాలు ఒక రూలు, భవానీ ఐలాండ్ కు మరో రూలా అని ప్రశ్నించారు. తనను అందరూ దానకర్ణుడు అంటారని, కబ్జాదారుడు అనడానికి ఆధారాల్లేవన్నారు. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యాలయంపై కథనాలు రావడం తగదన్నారు. 2 లీటర్ల నీళ్లు తాగితే తనకు వాంతులు రావని చెప్పారు. తక్కువ డబ్బుకే వైద్యం చేస్తున్నారని, వ్యాపారం అని విమర్శించడం తగదని పేర్కొన్నారు. నది ఒడ్డున ఒక్క అంగుళం కూడా ప్రభుత్వ భూములు లేవని, అన్ని రైతుల భూములేనని చెప్పారు. బీజేపీ కార్యాలయానికి అనుమతులు రాకుంటే మరోచోట స్థలం ఇస్తానని ప్రకటించారు. -
అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు
గుంటూరు: కృష్ణానది కరకట్టలపై అక్రమ నిర్మాణాలు చేశారంటూ నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి గోకరాజుతో సహా 23 మందికి స్థానిక తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లతో హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖ కూడా వారికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
ఎంపీలపై విచారణకు ఆదేశం
ఏలూరు : గోదావరి జిల్లాల్లో కోడి పందేల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ విషయంలో ముగ్గురు ఎంపీల తీరుపై విచారణ జరపాల్సిందిగా జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ ఆదేశించింది. మాగంటిబాబు, మురళీమోహన్, గోకరాజు గంగరాజుపై జిల్లాకు చెందిన న్యాయవాది బాబూ గణేష్ న్యాయసేవాధికార సంస్థలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎంపీలు కోడిపందేల విషయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కోన్నారు. దాంతో.. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. -
బావమరిదికే కేబినెట్ బెర్త్!
చూడబోతే కేంద్ర మంత్రి పదవి బుర్ర మీసాల బాపిరాజుగారి బావమరిది నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజునే వరించేలా ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఆ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఇద్దరు బీజేపీ ఎంపీలు కె.హరిబాబు, గోకరాజు గంగరాజులకు స్థానం లభించలేదు. వీరిద్దరిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే హరిబాబు కంటే గంగరాజుకే నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రిపదవి దక్కే ఛాన్స్ అధికంగా ఉందని సమాచారం. ఎందుకంటే విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఓ వ్యక్తికి ఒకే పదవి అనే సిద్దాంతాన్ని ప్రస్తుతం బీజేపీ తు.చ తప్పక పట్టిస్తుంది. అదికాక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పోత్తుతో ఆ పార్టీ ఆ రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలపడేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. రానున్న రోజుల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అవసరమైన కసరత్తు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అనుభవజ్ఞుడైన హరిబాబు సేవలు ఉపయోగించుకోవాలని అగ్ర నాయకత్వం భావిస్తుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలుపై కూడా హరిబాబుకు సమగ్ర అవగాహన ఉంది. ఒకవేళ హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మరో కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాల్సివుంటుంది. కొత్త అధ్యక్షుడికి రాష్ట్రంలో పరిస్థితిని అవగాహన చేసుకునేందుకు సమయం పడుతుంది. ఇదంతా పెద్ద తలనొప్పిగా మారి మొదటికే నష్టం వచ్చే అవకాశాలున్నాయని అగ్ర నాయకులు తలపోస్తున్నారు. దాంతో హరిబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిస్తూ... కొత్తగా పార్టీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన గోకరాజు గంగరాజుకు కేంద్రమంత్రి పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో మోడీ తొలి కేబినెట్ కూర్పులో టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీగా తొలిసారి ఎన్నికైన అశోక్‌గజపతి రాజుకు పౌర విమానాయానశాఖ కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఎంపీలకు స్థానం దక్కలేదన్న ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా ఉంది. గోకరాజును కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా కార్యకర్తలను సంతృప్తి పరచాలని చూస్తోంది. ఇక తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఒక్కరే ఎంపీగా నుంచి గెలుపొందారు. ఆయనకు మోడీ కేబినెట్లో మంత్రి పదవి వరిస్తుందని ఆశించారు. కానీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా దత్తాత్రేయ పేరును అమిత్ షా తాజాగా ప్రకటించడంతో మంత్రి పదవిపై ఆయన పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇరు రాష్ట్రంలోని ముగ్గురు ఎంపీలలో గంగరాజుకే తదుపరి కేబినెట్ విస్తరణలో పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
గంగరాజు ఆశలు గల్లంతే
కలవని టీడీపీ శ్రేణులు అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత మోడీ బహిరంగ సభపైనే ఆశలు అరుునా కష్టమేనంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు ఆశలు గల్లంతవుతున్నారుు. ఎన్నికల ప్రచారానికి ఆయన తిరగలేక తిరుగుతున్నారు. అడుగడుగునా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన ప్రభావం ఎక్కడా కనిపించడంలేదు. ప్రజలు సైతం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి జనంలో ఏమాత్రం పట్టులేకపోవడంతో గంగరాజు ఆ పార్టీ అభ్యర్థి అనే విషయమే కొన్ని గ్రామాల్లో తెలియని పరిస్థితి నెలకొంది. కలవని తెలుగుదేశం శ్రేణులు పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీని దూరంగా పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు తాముగానే ప్రచారం చేస్తున్నారు తప్ప ఎంపీ అభ్యర్థి ప్రస్తావన తీసుకురావడం లేదు. గంగరాజు కూడా వారికి దూరంగానే ఉంటున్నారు. ఒకవేళ కలిసినా కాసేపు మొక్కుబడిగా ప్రచారం చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ మాత్రం అది కనిపించడం లేదు. బీజేపీ సీటు కేటాయించే సందర్భంలో అవలంభించిన వైఖరే దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ మాట చెల్లుబాటుకాకపోవడంతో ఆ పార్టీ నేతలంతా బీజేపీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి మధ్య కనీస సయోధ్య కూడా కనిపించడం లేదు. దీంతో గంగరాజు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన తన గ్రూపు సంస్థల ఉద్యోగులపైనే పూర్తిగా ఆధారపడ్డారు. ఆశ్రం కాలేజీ, డీఎన్ఆర్ కాలేజీతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గల లైలా గ్రూపు సంస్థల ఉద్యోగులను దిగుమతి చేసుకుని గ్రామాల్లో తిప్పుతున్నారు. వారందరికీ ఈ ప్రాంతం కొత్త కావడం, ఎవరేమిటో తెలియకపోవడంతో అయోమయూనికి గురవుతున్నారు. అట్టడుగు వర్గాల్లో వ్యతిరేకత అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దళిత వర్గం పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తోంది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎస్సీల ఓట్లు అత్యంత కీలకం. వారంతా మతం ముద్ర ఉన్న బీజేపీ అంటే భయపడున్నారు. గణనీయంగా ఉన్న దళిత క్రిస్టియన్లు బీజేపీ అభ్యర్థి గంగరాజు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మైనార్టీలైతే బీజేపీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే తమ పరిస్థితి దుర్భరంగా మారుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నట్టు బీజేపీ భావిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజశేఖరెడ్డి హయాంలో అమలైన పథకాల వల్ల లబ్ధిపొంది అనేక కుటుంబాలు నేటికీ ఆయనను ఆరాధిస్తున్నాయి. ఇవన్నీ గంగరాజుకు ప్రతికూలంగా మారాయి. మోడీ సభపైనే ఆశలు ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల పోరులో బాగా వెనుకబడిన గంగరాజు మే 1వ తేదీన భీమవరంలో జరిగే నరేంద్ర మోడీ సభపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సభ తర్వాత కొంతమార్పు వస్తుందేమోననే ఆశతో ఆయన వర్గం పనిచేస్తోంది. ఆ సభకు ఎలాగోలా జనాన్ని తీసుకొచ్చేందుకు హైరానా పడుతోంది. అయితే మోడీ వచ్చి సభ పెట్టినంత మాత్రాన అద్భుతం ఏమీ జరగదని టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆయన సభ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే తమకున్న ఒకేఒక్క అవకాశం మోడీ బహిరంగ సభేనని గంగరాజు వర్గం భావించి ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ నాయకులు మాత్రం ఈ సభపైనా పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో సభకు జనం వస్తారో రారోననే భయం బీజేపీ నేతలను వేధిస్తోంది. -
బావమరిదికే బావ ఓటు
భీమవరం, న్యూస్‌లైన్ :గెలుపుపై ఆశలు వదిలేసుకున్న నరసాపురం సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు కుటుంట కథా చిత్రానికి తెరలేపారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట అయిన కనుమూరి ఈ ఎన్నికల్లో కొత్త ఎత్తుగడతో రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు శత్రువుగా మారిన కాంగ్రెస్‌కు సీమాంధ్రలో నూకలు చెల్లటంతో ఆ పార్టీ తరుపున అధిష్టానం బాపిరాజును మళ్లీ బరిలోకి దింపింది. అయితే పెద్దల మాట కాదనలేక అయిష్టంగానే తిరిగి ఆ పార్టీ తరుపున నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవటంతో టీడీపీ మద్దతుతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సొంత బావమరిది గోకరాజు గంగరాజుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందుకనుగుణంగానే తెరవెనుక రాజకీయాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు అనూహ్యంగా బీజేపీ టికెట్ తెచ్చుకుని పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉండి ప్రచారం చేస్తున్న కనుమూరి బాపిరాజు కాడి వదిలేసి తూతూమంత్రంగా తిరుగుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు లోపాయికారీగా బావమరిది గెలుపు కోసం శతవిధాలా సహకరిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో మెలిగే బాపిరాజు వారిని నొప్పించకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూనే తెరవెనుక మాత్రం మంత్రాంగం నడుపుతున్నారు. తన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులకు బావమరిది గంగరాజు గెలుపునకు పనిచేయాలని చెబుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే పలువురు బాపిరాజు అనుచరులు గోకరాజు గంగరాజు పంచకు చేరుతున్నారు. ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, కాళ్లకూరు దేవస్థానం చైర్మన్ అడ్డాల నాగరాజు, మాజీ జెడ్పీటీసీ పద్మావతి దంపతులతోపాటు ఇదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బాపిరాజు శిబిరం నుంచి ఆయన బావమరిది శిబిరంలోకి చేరారంటున్నారు. ఇదేవిధంగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గంగరాజు విజయం కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో మరి కొంతమంది బాపిరాజు అనుచరులు, కాంగ్రెస్ నేతలు బీజేపీ శిబిరానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కాం గ్రెస్-బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని చీకటి రాజకీయాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ముఖ్యనేత అడ్డాల నాగరాజు గంగరాజు శిబిరానికి వెళ్లిపోవటంతో అసెంబ్లీ బరిలో ఉన్న గాదిరాజు లచ్చిరాజు కనుమూరి బాపిరాజు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ మాత్రానికి తమను బరిలో పెట్టి బలిచేయడం చేయ డం ఎందుకని బాపిరాజు తీరును ఎండగడుతున్నారు. ఇదే రీతిగా వ్యవహరిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కేపరిస్థితి ఉండదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. బాపిరాజు తాను ఒడినా తన బావమరిదిని గె లిపించి పార్లమెంట్‌కు పంపేందుకు తెరవెనుక చేస్తున్న రాజకీయాలతో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త కుమ్మక్కు రాజకీయాలను తెరలేచింది.