!['నన్ను అందరూ దానకర్ణుడు అంటారు'](/styles/webp/s3/article_images/2017/09/2/61408256096_625x300_0.jpg.webp?itok=FVUSJ11R)
'నన్ను అందరూ దానకర్ణుడు అంటారు'
విజయవాడ: కృష్ణానది కరకట్టల ఆక్రమణలపై ఎంపీ గోకరాజు గంగరాజు స్పందించారు. కరకట్టలపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు రావన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. తాను కట్టిన భవనాలు ఆక్రమణలు అయితే భవానీ ఐలాండ్ ఆక్రమణ కాదా అని ఆయన ప్రశ్నించారు. తమ భవనాలు ఒక రూలు, భవానీ ఐలాండ్ కు మరో రూలా అని ప్రశ్నించారు. తనను అందరూ దానకర్ణుడు అంటారని, కబ్జాదారుడు అనడానికి ఆధారాల్లేవన్నారు.
మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యాలయంపై కథనాలు రావడం తగదన్నారు. 2 లీటర్ల నీళ్లు తాగితే తనకు వాంతులు రావని చెప్పారు. తక్కువ డబ్బుకే వైద్యం చేస్తున్నారని, వ్యాపారం అని విమర్శించడం తగదని పేర్కొన్నారు. నది ఒడ్డున ఒక్క అంగుళం కూడా ప్రభుత్వ భూములు లేవని, అన్ని రైతుల భూములేనని చెప్పారు. బీజేపీ కార్యాలయానికి అనుమతులు రాకుంటే మరోచోట స్థలం ఇస్తానని ప్రకటించారు.