
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన ఐదు భవనాల యజమానులకు సీఆర్‌డీఏ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రకు చెందిన భవనాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చిన అన్ని నిర్మాణాల వద్ద ఏ తరహా నిర్మాణాలున్నాయి? వాటి కొలతలు వంటి అన్ని వివరాలను సేకరించారు. మొత్తం ఇప్పటివరకు 26 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చినట్లయింది. మరికొన్ని భవనాలకు ఒకటి, రెండురోజుల్లో నోటీసులిచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment