CRDA officials
-
ముంచెత్తిన ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి బ్యూరో/విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట వెంబడి నిర్మించిన అతిథి గృహాలు, ఇతర కట్టడాల్లోకి బుధవారం వరద నీరు ప్రవేశించింది. కరకట్ట లోపలి వైపున నదీ గర్భంలోకి చొచ్చుకెళ్లి గతంలో భారీ కట్టడాలను నిర్మించారు. వాటికి కొండరాళ్లతో పునాదులు వేసి.. నీటి ప్రవాహానికి అడ్డంగా గట్లు నిర్మించారు. నది పోటెత్తి ప్రవహిస్తుండటంతో చాలా కట్టడాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వీటివల్ల నదీ ప్రవాహ దిశ మారుతోందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా కరకట్ట దిగువన ఉన్న అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి తెలిసిందే. నదీ గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని సామగ్రిని మరో అంతస్తులోకి చేర్చారు. నీటిమట్టం పెరుగుతుండటంతో చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్ సమీపంలో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తున ఇసుక బస్తాలు వేసి ముంపు నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు. చంద్రబాబు వాహన శ్రేణిని సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కరకట్ట లోపల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం మంతెన సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం, గణపతి సచ్చిదానందం ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. నదిని ఆనుకుని అనాథ బాలల కోసం నిర్మించిన ‘చిగురు’ బాలల ఆశ్రమం సైతం ముంపుబారిన పడింది. దీంతో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కరకట్ట వెంబడి ఉన్న అతిథి గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ప్రవాహానికి అక్రమ కట్టడాలు ఎలా అడ్డు తగులుతున్నాయో సీఆర్డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీశారు. లంక గ్రామాలను ముంచెత్తిన వరద ప్రకాశం బ్యారేజి నుంచి భారీఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతోపాటు పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్దండరాయనిపాలెం లంకలోని 150 కుటుంబాలను, తాళ్లాయపాలెం లంకలోని 70 కుటుంబాలను, వెంకటపాలెంలోని 24 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దలంకకు చెందిన 200 కుటుంబాలను ఇబ్రహీంపట్నం వైపు పడవల ద్వారా తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. గొట్టిముక్కల గ్రామం నీట మునగటంతో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. కొల్లిపర మండలంలోని పాతబొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరిలంక గ్రామాల నుంచి 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుపాలెం, తూములూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు 200 కుటుంబాలను తరలించారు. రేపల్లె మండలం పెనుమూడి, పులిగడ్డ వారధికి వరద నీరు చేరింది. కొల్లూరు మండలం దోనేపూడి, పోతార్లంక మధ్య చిన్నరేవు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నది మధ్యలో చిక్కుకున్న ఘంటసాలకు చెందిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మంత్రుల పర్యటన వరద ఉధృతిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిస్థితిని, తీసుకున్న జాగ్రత్తలను మంత్రులకు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రులు ఆదేశించారు. -
గోకరాజు సహా ఐదుగురికి నోటీసులు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన ఐదు భవనాల యజమానులకు సీఆర్డీఏ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రకు చెందిన భవనాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చిన అన్ని నిర్మాణాల వద్ద ఏ తరహా నిర్మాణాలున్నాయి? వాటి కొలతలు వంటి అన్ని వివరాలను సేకరించారు. మొత్తం ఇప్పటివరకు 26 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చినట్లయింది. మరికొన్ని భవనాలకు ఒకటి, రెండురోజుల్లో నోటీసులిచ్చే అవకాశం ఉంది. -
జనవరి మొదటివారం నుంచే..
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు తమను ఏ దశలోనూ సంప్రదించడం లేదని, ఏ విషయం కూడా తమకు చెప్పడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయమూర్తుల కమిటీ సోమవారం పలువురు సీనియర్ న్యాయవాదులతో సమావేశమైంది. ప్రస్తుతం నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక భవనాన్ని డిసెంబర్ 15కల్లా హైకోర్టుకు అప్పగిస్తామని సీఆర్డీఏ అధికారులు చెప్పిన విషయాన్ని న్యాయవాదులకు ఆ కమిటీ తెలియచేసింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటివారం నాటికి తాత్కాలిక భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు సాగించేందుకు వీలవుతుందని ఆ కమిటీ తెలిపింది. అంతేకాక హైకోర్టు భవనంలో న్యాయవాదులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆ కమిటీ వివరించింది. అందుకు సంబంధించి సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేసిన ప్లాన్లను న్యాయవాదులకు చూపింది. దాదాపు 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో న్యాయవాదుల కోసం ఓ హాల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా న్యాయవాదుల సంఘం కార్యవర్గం కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ఛాంబర్లు, మహిళా న్యాయవాదులకు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు వారికి తెలియచేసింది. అలాగే పార్కింగ్ ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. ఇదే సమయంలో న్యాయవాదులు తాము ఎదుర్కొనే ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రవాణా సదుపాయంతో పాటు బ్యాంకు, పోస్టాఫీస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వారు కమిటీని కోరారు. వీటన్నింటినీ కూడా జస్టిస్ రామసుబ్రమణియన్ ఓ పుస్తకంలో నోట్ చేసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా తగిన సంఖ్యలో బస్సులను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిటీ న్యాయవాదులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశానికి పిలుస్తామని న్యాయవాదులకు తెలియచేసింది. న్యాయవాదులతో సమావేశమైన కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలున్నారు. సీనియర్ న్యాయవాదులు డి.వి.సీతారామమూర్తి, టి.నాగార్జునరెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, ఆర్.రఘునందన్‌రావు, వై.వి.రవిప్రసాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అమరావతిలో విధ్వంసకాండ
సాక్షి, అమరావతి: రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న ఏపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు దిగింది. చేతికి వచ్చిన పంటలను నాశనం చేసి అన్నదాతల నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో బుధవారం సీఆర్డీఏ అధికారులు దౌర్జన్యాలకు దిగారు. దిగుబడికి వచ్చిన మల్లె తోటలను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నాశనం చేయొద్దని అధికారులను రైతులు వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవాలని అభ్యర్థించినా అధికారులు కనికరించలేదు. చేసేదిలేక అధికారులను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పంట పొలాల జోలికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తమ నుంచి భూములు తీసుకునే సమయంలో మల్లె తోటకు ఐదు లక్షలు నష్టపరిహరం ఇస్తామని చెప్పి, కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. మంత్రులు గ్రామాల్లో పర్యటించి పదేపదే భూసేకరణ చేస్తామని బెదిరిస్తే భయపడి రాజధానికి భూములిచ్చామని వెల్లడించారు. తమ దగ్గర నుంచి భూములు తీసుకుని ఇచ్చిన హమీలు అమలు చేయ్యకుండా ప్రభుత్వం మోసం చేసిందని మల్లె తోట రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత తమ తోటల జోలికి రావాలని డిమాండ్ చేశారు. -
సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
-
ఇక రంగంలోకి రాజమౌళి..
సాక్షి, అమరావతి/లండన్ : ఏపీ రాజధాని అమరావతి డిజైన్ల విషయంలో టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రంగంలోకి దిగారు. రాజధాని డిజైన్ల విషయంపై ఏపీ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులతో కలిసి రాజమౌళి శుక్రవారం లండన్ వెళ్లారు. గత నెలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లపై రాజమౌళి చర్చించిన విషయం తెలిసిందే. తాను రాజధాని అమరావతికి కన్సల్టెంట్‌ను కాదని, డిజైనర్ సూపర్వైజర్గా తాను నియమితుడిని అయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్న రాజమౌళి.. డిజైన్ల విషయంలో సాయం చేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణను అదేశించారు. దీంతో రాజమౌళిని లండన్ తీసుకెళ్లడానికి సీఆర్డీఏ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డిజైన్ల కోసం మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు గత మూడు నెలల నుంచి వరుసగా లండన్ పర్యటనలు జరిపినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. ఈ క్రమంలో డిజైన్ల విషయంలో ఈసారి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో రాజమౌళితో కలిసి సమావేశమై రాజధాని డిజైన్ల విషయంపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు భావాలు, అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్ సంస్థకు తెలియజెప్పి ఈ డిజైన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజమౌళి యత్నిస్తున్నారు. అయితే మంత్రి నారాయణ బృందం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో జరిగిన భేటీలో పాత డిజైన్లలో మార్పులపై చర్చించారా, లేక కొత్త డిజైన్లు రూపొందించాలని సూచించారో తెలియాల్సి ఉంది. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల
అమరావతి: పెనుమాక కేసులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్ రాయాలని నిలదీసినందుకు ఆయనపై సీఆర్డీఏ అధికారులు కేసు పెట్టారు. ఎమ్మెల్యే సహా 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. కాగా, స్టేషన్ బెయిల్‌పై ఎమ్మెల్యే ఆర్కే విడుదలయ్యారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి వల్లే అధికారులు తనపై కేసు పెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అరాచకాలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. భూ సేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మినిట్స్ బుక్ రాయమన్నందుకు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులు చేస్తే తప్పులేదు కానీ, మినిట్స్ బుక్ రాయమంటే తప్పా అని అడిగారు. -
పంట కుంటలతో కరవును అధిగమించొచ్చు
‘నీరు–ప్రగతి’ టెలికాన్ఫరెన్స్‌లో సీఎం సాక్షి, అమరావతి: పంట కుంటల ద్వారా కరవు పరిస్థితులను అధిగమించవచ్చునని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పూర్తయిన 3.41 లక్షల పంట కుంటలను గురువారం జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో గురువారం ‘నీరు–ప్రగతి’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులతో బుధవారం సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. రాష్ట్రంలో మరో 6.59 లక్షల పంట కుంటలను ఏర్పాటు చేస్తే కరవు పరిస్థితులను పూర్తిగా అధిగమించవచ్చునని సీఎం చెప్పారు. కాగా రాజధాని పరిపాలనా నగరంలో ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలూ ఒకేచోట ఉండేలా భవనాల నిర్మాణం ఉండాలని చంద్రబాబు సూచించారు. బుధవారం వెలగపూడి లో సీఆర్డీఏ అధికారుల సమావేశంలో రాజధాని అంశాలపై చర్చించారు. రాజధాని లో ఇప్పటికే గుర్తించిన ఏడు ద్వీపాలను స్వాధీనం చేసుకుని అక్కడ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఏడు ద్వీపాలతోపాటు ఎనిమిదో ద్వీపాన్ని గుర్తించామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పగా దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. -
పూలింగ్‌లో కుంభకోణం
⇒ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ⇒ సీఆర్డీఏ అధికారులు చట్టాలు,రాజ్యాంగం చదవాలి సాక్షి, అమరావతి : సీఆర్డీఏ అధికారులకు ఇంగిత జ్ఞానం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. వారు చట్టాలు.. రాజ్యాంగాన్ని చదవాలని హితవు పలికారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలు, ఆదేశాలపై వారు చెబుతున్న మాటలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ల తర్వాతైనా అధికారులు ఇబ్బంది పడక తప్పదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సమీకరణలో కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. విశాఖపట్నం పరవాడ భూ సమీకరణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, ఇక్కడా అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిలో డి ఫారం పట్టా భూములు కొనుగోలు చేసిన వారికి పరిహారం ఇవ్వవచ్చని ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిందని, అది చెల్లదని దానిపై ప్రభు త్వ సీఎస్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. అవసరం లేకున్నా వేలాది ఎకరా లు సేకరి స్తూ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తోందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని మారిస్తే హైకోర్టులో సవాలు చేస్తామన్నారు. మంచినీళ్లు తాగినట్లు..: మంచినీళ్లు తాగినంత తేలిగ్గా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం – అమరావతి రహదారికి 26,800 ఎకరాలు, అమరావతి అవుటర్ రింగు రోడ్డుకు 8,500 ఎకరాలను నెలల వ్యవధిలో సేకరించాలని ముఖ్య మంత్రి ఆదేశించడం దారుణమన్నారు. -
అమరావతికి అనువైన ప్రాజెక్టులు ఇవే..
సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం సలహాలు సాక్షి, విజయవాడ : రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం వివరించారు. జపాన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2015 అక్టోబర్ 22న జరిగిన ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశంపై పరిశీలించింది. దీనికి సంబంధించిన నివేదికను జపాన్ బృందం తయారు చేసి శనివారం సీఆర్డీఏ అధికారులకు అందజేశారు. సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జపాన్ బృందం ఆయా ప్రాజెక్టులపై సీఆర్డీఏ, అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), పోలీసుశాఖ అధికారులకు వివరించారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ రామమోహనరావు, డీసీపీ రాణా, ఇతర సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వుండే ప్రాజెక్టుల గురించి జాపాన్ బృందం చెప్పిన వివరాలు.. డేటా సెంటర్. క్రౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ రాష్ట్రమంతంటికీ తక్కువ ఇంధన ఖర్చుతో అత్యుత్తమంగా ఇంటర్ నెట్ సేవలు అందించే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాడ్యూలర్ డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచిం చారు. క్రౌడ్ కంప్యూటింగ్‌తో పాటు తక్కువ వ్యవధిలో పౌరులకు ఉపయోగపడే దరఖాస్తులకు పరిశీలించేందుకు ఈ మాడ్యులర్ డేటా సెంటర్‌ను ఉపయోగించవచ్చన్నారు. వాతావరణ రాడార్ సిస్టమ్స్ ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలుసుకుని, కాపాడేందుకు ఉపయోగపడే వాతావరణ రాడార్ సిస్టమ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని జపాన్ బృందం సూచించింది. ఈ రాడార్ సిస్టమ్ రాజ« దాని ప్రాంతంలోని కాల్వలు, నది, మురికి కాల్వలు, రవా ణా రంగాలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది. తద్వారా ప్రాణ, భారీగా ఆస్తినష్టం జరగకుండా చూసుకోవచ్చు. మంచినీటి సదుపాయం అతి తక్కువ ఖర్చుతో అతి పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికి ఇచ్చేం దుకు వీలుగా ఒక ప్రాజెక్టును జపాన్ బృందం సీ ఆర్డీఏ అధికారు లకు వివరించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో తాగునీటి కోసం ఏ విధానాలను అవలంబిస్తున్నారో వివరించి రాజధాని లో మంచినీటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. పర్యావరణ ఇబ్బందులు రాకుండా ఇంధనం కూడా ఉత్పత్తి చేసే సీవియేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వివరాలను బృందం వివరించింది. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సిగ్నల్స్ ఏర్పాటు గురించి వివరించారు. ఇదే సమయంలో డీసీపీ రాణా విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు గురించి వారికి వివరించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు ఒక ప్రణాళిక ఇస్తామని జపాన్ బృందం హామీ ఇచ్చింది. భూకంపాలు తట్టుకునేలా నిర్మాణాలు ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు రామవరప్పాడు : భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమవుతున్నాయని ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు తెలిపారు. ఎనికేపాడులోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు– మారుతున్న సాంకేతికత’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శనివారం ముగిసింది. రాజు మాట్లాడారు. -
అరిస్తే... అరెస్టే!
‘ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మీరు రచ్చ చేసినా ప్రయోజనం ఉండదు. ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమంలో ఎవరైనా అరిస్తే అరెస్టు చేరుుస్తాం. కేసులు పెట్టటంతోపాటు విలువలేని చోట ప్లాట్లు కేటారుుస్తాం. ఆ తరువాత మీకే నష్టం’ అని అనంతవరం రైతులకు అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర స్థారుులో హెచ్చరికలు వచ్చారుు. సాక్షి, అమరావతి బ్యూరో : అధికార పార్టీ నేతల బెదిరింపులతో తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని కేవలం 15 నిముషాల్లో ముగించేశారు. బెదిరింపులకు భయపడిన గ్రామస్తులు అవగాహన సదస్సు జరక్కపోరుునా.. పక్క ఊరు చెరువులో ప్లాట్లు కేటారుుంచినా.. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా... మాటైనా మాట్లాడకుండా ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని చూస్తుండిపోయారు. తుళ్లూరు మండలం అనంతవరం గురించి తెలియని వారుండరు. రాజధాని ప్రకటించాక ‘అధికార’ అక్రమాలు ఈ గ్రామం నుంచే పురుడుపోసుకున్నారుు. టీడీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మకై ్క పలువురు రైతుల భూములను మాయం చేశారు. ఎవరూ తెలుసుకోలేరని, తెలుసుకున్నా మాయమైంది సెంట్లే కదా? అడగరని భావించిన టీడీపీ నేతలు అక్రమాలకు తెగబడ్డారు. వారి అక్రమాలను ‘సాక్షి’ పక్కా ఆధారాలతో కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. రైతులకు అన్యాయం జరుగుతుంటే స్పందించాల్సిన ‘ముఖ్య’ నేతలు, ఉన్నతాధికారులు తమ్ముళ్లకు అండగా నిలబడ్డారు. అక్రమాలపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. మాయమైన సెంట్లు సరిచేయలేదు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖలు రాశారు. ఫలితం లేకపోగా..ప్లాట్ల కేటారుుంపులోనూ రైతులు మరోసారి మోసపోయారు. అవగాహన సదస్సును బహిష్కరించినా.... రాజధాని రైతులకు ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమానికి ముందు సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సు నిర్వహిస్తారు. అందులో ప్లాట్ల కేటారుుంపు ప్లాన్ గురించి వివరిస్తారు. అభ్యంతరాలు ఉంటే వాటిని సరిచేసి ఆ తరువాత ప్లాట్ల కేటారుుంపు నిర్వహించాలి. అనంతవరం విషయానికి వచ్చేసరికి ఈనెల 5న గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అరుుతే ఆ అవగాహన సదస్సును గ్రామస్తులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మాయమైన సెంట్లు సరిచేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్లాట్లు కేటారుుంచటానికి వీల్లేదంటూ గ్రామస్తులు సదస్సును బహిష్కరించి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. బహిష్కరణను తట్టుకోలేని అధికారపార్టీ నాయకులు, కొందరు అధికారులు రాజధాని కమిటీ సభ్యులతో విజయవాడలో సమావేశమయ్యారు. ఎలాగైనా ప్లాట్ల కేటారుుంపు తంతు ముగించాలని పథకం వేశారు. ఈక్రమంలోనే గ్రామంలో సెంట్లు మాయమైన ముఖ్యమైన వారిని ఫోన్లో, కొందరిని పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల కేటారుుంపు ప్రకటన మొదలు, బాధిత రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నిఘా పెట్టారు. వారికి కూడా ఫోన్లు, బంధువుల ద్వారా తీవ్రంగా హెచ్చరించినట్లు ఓ అధికారి తెలిపారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మంగళవారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంవద్ద ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని ముగించింది. పక్క ఊరులో.. చెరువులో ప్లాట్లు అనంతవరం రైతులు కొందరికి నెక్కల్లు గ్రామ సరిహద్దులో, మరి కొందరికి తుమ్మల చెరువులో ప్లాట్లు కేటారుుంచారు. అవి కూడా రాజధానికి పూర్తి చివర ప్రాంతంలో కేటారుుంచారు. భవిష్యత్‌లో ఆ ప్రాంతం అభివృద్ధి చెందటానికి సంవత్సరాలు పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమై విక్రరుుంచాలన్నా అక్కడ ప్లాట్లు కొనేవారు తక్కువేనని ఆవేదన చెందుతున్నారు. భూములు వదులుకున్నందుకు మేలుచేయాల్సిన ప్రభుత్వమే... తమకు అన్యాయం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి అని ఇద్దరు మహిళలు కన్నీరు పెట్టుకోవటం గమనార్హం. -
అక్రమాల అంతస్తులు
సాక్షి, అమరావతిబ్యూరో : రాజధాని అమరావతిలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, గుంటూరులో చోటుచేసుకున్న వరుస ఘటనలలో పలువురు మృత్యువాతకు గురయ్యారు. రెండు రోజుల కిందట విజయవాడలో ఓ భవనం కూలింది. ఆ ఘటన పగటి వేళ సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదు. అదే అర్ధరాత్రి జరిగి ఉంటే పరిస్థితిని ఊహించలేం. రాజధానిగా అమరావతి ప్రకటన వెలువడిన తరువాత గుంటూరు, విజయవాడ పరిధిలోని భూములు, స్థలాలు, నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు తరలిరావడంతో అద్దె గృహాలకు, భవనాలకు మరింత గిరాకీ పెరిగింది. ఈ అవసరాన్ని గుర్తించిన కొందరు వ్యాపారులు, బిల్డర్లు, అధికార పార్టీ నాయకులు వారి అనుచరులు, బంధువులు ఇలా అంతా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఒక్కసారిగా ఖాళీ స్థలాలలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాజధానికి S తరలివచ్చే వారికి నివాసాలు అత్యవసరం కావడంతో హడావుడిగా నిర్మాణాలు చేపట్టారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో మూడు అంతస్తులకు అనుమతి లేకపోయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటీ రెండు మినహా మిగిలిన అన్ని గ్రామాలలో 20 నుంచి 50 కట్టడాల వరకు నిర్మించారు. ఒక్క తుళ్లూరు గ్రామంలోనే దాదాపు 250 వరకు భారీ కట్టడాలు నిర్మించడం విశేషం. అదేవిధంగా మందడం, మల్కాపురం, వెలగపూడి, వెంకటపాలెం, మంగళగిరి, ఉండవల్లి, తాడేపల్లి సహా పలు గ్రామాలలో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతులుండవ్....అధికారులకు ఆమ్యా...మ్యాలు గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలలో మొత్తం 3,204 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు సమాచారం. ఇటీవల సీఆర్డీఏ అధికారులు విజయవాడ నగరంలోని కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ క్రమంలో అధికారులపై పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిడి వచ్చింది. ఈ కారణంగానే అధికార పార్టీ నాయకు భవనాల జోలికి అధికారులు వెళ్లలేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అదీకాక గుంటూరు, అమరావతి నగరాలతో పాటు వివిధ మున్సి పాలిటీలలోను బహుళ అంతస్తులకు అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో ఓ మంత్రికి అత్యంత సన్నిహితురాలైన ఓ మహిళ ఈ భవన నిర్మాణాలకు అడ్డదిడ్డంగా అనుమతులు ఇప్పిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆమె స్వయంగా గుంటూరు, విజయవాడ నగరాలలో తిష్ట వేసి అధికారులను తన వద్దకు పిలిపించుకొని కట్టడాలకు అనధికారిక అనుమతులను ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా విజయవాడలో 1809, గుంటూరులో 963, అమరావతిలో 432 భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేందుకు అనుమతులు ఇప్పించినట్లు సమాచారం. అదేవిధంగా రాజధాని ప్రాం తంలో సైతం ఇదే తరహాలో అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇప్పిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో జీ–ప్లస్ త్రీ వరకే అనుమతి ఉన్నా అంతకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో అధికశాతం తెలుగు తమ్ముళ్ల భవనాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ కట్టడాలలో సీఆర్డీఏ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ దృష్ట్యా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అబ్బే.. కార్యాలయం బాగాలేదు
- సచివాలయంలోని తన ఆఫీసుపై చంద్రబాబు అసంతృప్తి - మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ /అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏ మాత్రం బాగా లేదు... నాణ్యత అసలే లేదు.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఆయన బుధవారం తాత్కాలిక సచివాలయంలో ప్రవేశించారు. తన కార్యాలయంలోకి వెళ్లిన తరువాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌పై తీవ్రస్థారుులో మండిపడ్డారు. ఇదేనా ఇన్ని రోజులు ఇక్కడ కూర్చుని మీరు ఏర్పాటు చేసిన కార్యాలయం? అని నిలదీశారు. హైదరాబాద్ సచివాలయంలోని ‘డి’ బ్లాకును ఎల్అండ్టీ సంస్థ నిర్మించిందని, అక్కడ బాగా నిర్మించిన ఆ సంస్థ వెలగపూడిలో కార్యాలయ భవనాన్ని సొంతంగా నిర్మించిందా? లేక సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు. నిర్మాణంలో నాణ్యత కూడా లేదని చంద్రబాబు పెదవి విరిచారు. సచివాలయ ప్రవేశం నా రెండో మజిలీ ఉద్యోగుల త్యాగాలు వృథాగా పోవని, వారి ఇబ్బందులను తొలగించి తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తనదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదని అన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రవేశం తన రెండో మజిలీ అని తెలిపారు. ఈరోజు కొత్త శకం ప్రారంభమైందన్నారు. బుధవారం ఉదయం సచివాలయానికి చేరుకున్న బాబుకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. అమరావతిలో ‘మెట్రో’ రహదారులు మెట్రో నగరాలకు దీటుగా రాజధాని అమరావతిలో అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కమిటీలు పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలను చక్కదిద్దేందుకు రాష్ట్రం నుంచి మండల స్థారుు వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.పదివేలు ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లను కోరుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వీలుకాని పక్షంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఒకేసారి రూ.పదివేలు చెల్లించేలా బ్యాంకర్లు ప్రయత్నం చేయాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు సంబంధిత బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బ్యాంకులకు రాసిన లేఖలో సూచించారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
జూన్ నాటికి శాఖమూరులో రిజర్వాయర్ పార్కు
- రాజధాని వ్యవహారాల సమీక్షలో ముఖ్యమంత్రి - బుధవారం నుంచి వెలగపూడి కార్యాలయానికి సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నగరానికి అలంకారంగా నిలిచే శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సెంట్రల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్న ఈ రిజర్వాయర్ ప్రాంతాన్ని అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్ పార్కుగా తీర్చిదిద్దాల్సివుందని, వివిధ దేశాల నగరాల్లోని నమూనాలను పరిశీలించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని సూచించారు. నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న 24 కిలోమీటర్ల కొండవీటి వాగు వాటర్‌ఫ్రంట్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ, సీసీడీఎంసీ అధికారులు, కన్సల్టెంట్లతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. 97 హెక్టార్లలో ఉన్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దితే అది రాజధానికి మకుటాయమానంగా మారుతుందని చెప్పారు. రోడ్ క్రాస్ సెక్షన్ ఆకృతులపై సమావేశంలో అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. విద్యుత్, ఇతర అవసరాలకు ఉపయోగించే అంతర్ వాహికల (డక్ట్స్) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సివుందని చెప్పారు. రాజధానిలోని ప్రతి ఇంట్లోనూ వర్షం, వరద నీరు భూమిలోకి నేరుగా ఇంకిపోయే ఏర్పాటు ఉండి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రహదారుల విషయంలో వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని, వీటివల్ల 15 శాతం వ్యయం అధికమైనా ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని శ్రీధర్ తెలిపారు. వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయ ఇంటీరియర్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు చెప్పగా వచ్చే బుధవారం నుంచి విధులకు హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ఫీజులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఇస్తున్నామని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరెంటు చార్జీల పెంపు ఖాయమే రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు అనివార్యమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) తేల్చారుు. ప్రజలపై ఎంత భారం మోపాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారుు. సర్కారు ఇచ్చే రారుుతీ ఎంతో తెలిస్తే పెంపు స్పష్టమవుతుంది. విద్యుత్ శాఖ 2017-18 వార్షిక ఆదాయ అవసర నివేదికలపై విజయవాడలో బుధవారం సీఎం సమక్షంలో చర్చలు జరిగారుు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.నేరుగా చార్జీల భారం మోపకుండా పరోక్ష విధానాలను అనుసరించాలని, విద్యుత్ సంస్థల ఆదాయాన్ని పెంచాలని ఆయన సూచించారు. -
ప్లాట్ల గోల్మాల్
-
ముఖం చాటేసిన సీఆర్డీఏ అధికారులు
గుంటూరు: అనంతవరం రైతులకు సీఆర్డీఏ అధికారులు ముఖం చాటేశారు. తుళ్లూరు మండలం అనంతవరంలో రికార్డులు తారుమారు చేసి, సెంట్ల రూపంలో టీడీపీ నేతలు కొట్టేశారు. దీంతో నిజమైన రైతుల భూములు కోల్పేయే అవకాశం ఉంటడంతో నిలదీస్తారనే భయంతో సీఆర్డీఏ అధికారులు ముఖం చాటేశారు. సోమవారం ఉదయం సీఆర్డీఏ కార్యాలయానకి వెళ్లి రైతులు నిలదీశారు. రైతులకు సమాధానం చెప్పలేక, కార్యాలయానికి తాళం వేసి సీఆర్డీఏ అధికారులు వెళ్లిపోయారు. అధికారుల కోసం రోజంతా రైతులు వేచి చూశారు. -
రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’
- పూలింగ్ రికార్డుల్లో తీవ్ర గందరగోళం.. - అనంతవరంలో భూముల గోల్మాల్ - లేని పేర్లు పుట్టుకొచ్చి భూములు ఇచ్చాయ్... - రైతులు ఇచ్చిన భూమి తగ్గిపోయింది.. - ‘అయినవాళ్లు’ తక్కువిచ్చినా రికార్డుల్లో పెరిగింది - లెక్కలు సరిచేయడానికి సవాలక్ష అవకతవకలు - సహకరించిన సీఆర్డీఏ అధికారులకు నజరానాలు - ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన వాస్తవాలు సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తోంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని పేరుతో అమరావతికి భూమిపూజ చేసి ఏడాది పూర్తయింది. ఇంతవరకు అక్కడ తట్ట మట్టి తవ్విపోయలేదు. నాలుగు ఇటుకలు పేర్చి ఓ గోడ కట్టలేదు. చివరకు కంకర రోడ్డు కూడా కానరావడం లేదు. కానీ... భూముల మాయాజాలం కొనసాగుతూనే ఉంది.రాజధానిని ప్రకటించక ముందే ప్రభుత్వ పెద్దలు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’తో విలువైన భూములు కైంకర్యం చేశారు. అవసరం లేకపోయినా 34వేల ఎకరాలను సమీకరించారు. వాటికి పరిహారమిచ్చే ఈ తరుణంలో మరో తంత్రానికి తెరతీశారు. భూములు లేకపోయినా ఉన్నట్టు కనికట్టు చేసి అధికారపార్టీ నేతలకు అందిస్తున్నారు.... అస్మదీయులైతే చాలు వారి భూమికి మరికాస్త చేర్చి చూపిస్తున్నారు. అదే సమయంలో సామాన్య రైతులకు ఉన్న భూమిని తగ్గించి చూపుతున్నారు. ఇలా తిమ్మిని బమ్మిని చేసి భూములు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో, అధికారుల సాయంతో సాగుతున్న ఈ భూమాయకు చెందిన ఆధారాలను ‘సాక్షి’ సంపాదించింది. ఆ వివరాలివీ... అనంతవరంలో అన్నీ తారుమారు..: రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో భూములకు డిమాండ్ బాగా పెరిగింది. రాజధాని నిర్మాణమెప్పుడో తెలియదు కానీ... ఆలోగా అందినంత భూమిని కాజేయాలని అధికారపార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ అధికారుల సాయంతో బినామీల పేర్లతో భూములను ఆక్రమించుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా భూ రికార్డులు తారుమారు చేసి భోంచేస్తున్నారు. సహకరిస్తున్న అధికారులకు భారీగా నజరానాలు ముట్టజెపుతున్నారు. చిన్నచిన్న బిట్లు.. అంటే ఎకరం లోపు, అర ఎకరం లోపు ఎవరూ లెక్కలోకి తీసుకోరనే ఉద్దేశ్యంతో ఆ తరహాలో కైంకర్యం చేస్తున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొందరు రైతుల సహకారంతో ‘సాక్షి’ పక్కా ఆధారాలు సంపాదించింది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాలలోనూ ఇలా భూ కైంకర్యం సాగుతోందని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. నిజానికి సీఆర్డీఏ 9.1 రికార్డుల (సమీకరణకు ముందు రికార్డులు) ప్రకారం భూ సమీకరణ నోటిఫికేషన్లో ఎంత ఉంటే అంతే సమీకరించాలి. కానీ రికార్డులు తారుమారు చేస్తున్నారు. 9.5 రికార్డుల ప్రకారం (సమీకరణ అనంతరం రికార్డులివి) భూములు ఇచ్చినట్లు సృష్టిస్తున్నారు. అంటే 9.1కి 9.5కి పొంతనే లేకుండా చేస్తున్నారన్నమాట. అనంతవరం గ్రామంలో మొత్తం 1,963 మందికి భూములు ఉన్నాయి. అర ఎకరం లోపు నుంచి ఎకరం పైన చిన్న చిన్న బిట్లుగా ఉన్నాయి. వీటిలో సగానికి పైగా భూముల రికార్డులను సీఆర్డీఏ అధికారులు తారుమారు చేశారు. లెక్క సరిచేశారిలా: సర్వే నంబర్ 115లో శృంగారపాటి యలమంద అనే వ్యక్తికి ప్రభుత్వ రికార్డు ప్రకారం 2 ఎకరాల పొలం ఉంది. ఇతను సీఆర్డీఏకి 1.85 సెంట్లు ఇచ్చినట్లు ఉంది.అతను గొడవ చేయడంతో యలమందకి 144సీలో 7 సెంట్లు, 144ఏలో 03 సెంట్లు, 145బీలో 01 సెంటు, 154లో 13 సెంట్లు, 144జేలో 17సెంట్లు చొప్పున మొత్తం 41 సెంట్ల భూమిని కట్టబెట్టారు. దీనికి అధికారులకు రూ.20 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సర్వే నంబర్ 115లో భూమి ఉంటే.. భూమి తగ్గించటంతో ఐదు సర్వే నంబర్లలో ఉన్న రైతుల భూములను కత్తిరించి యలమందకు కట్టబెట్టటం గమనార్హం. అధికారపార్టీ నేతలకు అందించారిలా... రాజధాని కమిటీలో ఉన్న టీడీపీ నేత పారా కిషోర్‌కి సర్వే నంబర్ 287లో భూమి లేకపోయినా ఆయన తండ్రి సీతారామయ్య పేరుతో సీఆర్డీఏకు 0.82 సెంట్లు ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారు. ఇలా సర్వే నంబర్ 168లో 9 సెంట్లు, సర్వే నంబర్ 70ఏలో పారా తులసమ్మ పేరుతో 12 సెంట్లు ఉన్న దానికన్నా పెరిగింది. సీతారామయ్య కుటుంబానికే మొత్తం 1.03 ఎకరాలను రికార్డుల్లో లేకపోయినా అధికారులు కట్టబెట్టారు. రాజధాని కమిటీలోని మరో సభ్యుడు సుంకర రామారావుకు సర్వే నంబర్ 54లో 70 సెంట్లు ఉంటే... 6 సెంట్లు కలిపారు. మరో టీడీపీ నేత నెల్లూరి అప్పారావు కుటుంబీకులు నెల్లూరి రాఘవయ్య పేరుతో సర్వే నంబర్ 119బీ, 120ఏలో మొత్తం 28 సెంట్లు చేర్చి విధేయతను చాటుకున్నారు. ఇలా ఒక్క అనంతవరంలో సుమారు 50 ఎకరాల వరకు కబ్జా చేశారు. మిగిలిన 28 గ్రామాల్లోనూ ప్రతి పల్లెలో 25 ఎకరాల నుంచి 50 ఎకరాలను ఆక్రమించుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో రాయపూడి గ్రామస్తులు కోర్టును ఆశ్రయించనున్నారు. వీరి బాటలోనే మరికొందరు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మమ్మల్ని మోసం చేశారు... రాజధాని కోసం ముందుగా భూములు ఇచ్చింది మేమే. మా భూములనే తగ్గించారు. మాకు 1.20 ఎకరాలు ఉంటే.. కొద్దిరోజుల క్రితం 25 సెంట్ల భూమిని మాయం చేశారు. సీఆర్డీఏ అధికారులు, ఎమ్మార్వో, వీఆర్వో, ఎమ్మెల్యే అందరూ కలసి మమ్మల్ని మోసం చేశారు. న్యాయం జరిగే వరకు వదిలేది లేదు. - బండ్ల బసవయ్య (అనంతవరం రైతు) -
ఆ లాటరీ.. ఓ మిస్టరీ..!
- తమవారికి కోరుకున్న చోట ప్లాటు - సామాన్యులకు ఎక్కడపడితే అక్కడ - అంతా పెద్దల కనుసన్నల్లో.. - లాటరీ మోసంపై రైతుల ఆగ్రహం సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లాటరీ విధానంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి స్తున్నాయి. ఎవరికీ అన్యాయం జరక్కుండా ప్లాట్లు కేటాయిస్తున్నామని చెబుతూనే.. అధికార పార్టీ నేతలు, బంధువులు, మిత్రులకు కోరుకున్నచోట విలువైన ప్లాట్లు ఇస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం అంతగా విలువ చేయని ప్లాట్లు ఎక్కడపడితే అక్కడ కేటాయిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. నిన్నటి వరకు ఆన్లైన్లో కనిపించిన యాజమాన్య పత్రాలు రెండు రోజులుగా అదృశ్యమవ్వడమే ఇందుకు నిదర్శనం. రాజధాని కోసం ప్రభుత్వం సమీకరణ పేరుతో భూములను లాక్కున్న విషయం తెలిసిందే. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కింద కోరుకున్న చోట.. కోరుకున్నట్లు ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో నివాస యోగ్యమైనవి, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ఎకరం జరీబు భూమి ఇచ్చిన వారికి నివాసానికి వెయ్యి గజాలు, కమర్షియల్ కోసం 450 గజాల ప్లాట్లు.. మెట్ట భూమి ఇచ్చిన వారికి వెయ్యి గజాలు నివాసానికి, 250 గజాలు కమర్షియల్ ప్లాట్లు కేటాయిస్తున్నారు. రైతులు ఏ గ్రామంలో అయితే భూములు ఇచ్చారో అక్కడే కోరుకున్నట్లు ప్లాట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే వాస్తవంగా జరుగుతోంది మాత్రం పూర్తి విరుద్ధం. తెరపైకి లాటరీ విధానం.. ఒకే ప్లాటును ఇద్దరు ముగ్గురు కోరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో సీఆర్డీఏ అధికారులు లాటరీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ లాటరీ విధానాన్ని జూన్ 25న సీఎం చంద్రబాబు తుళ్లూరులో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు తుళ్లూరు మండల పరిధిలో నేలపాడు, శాఖమూరు, అబ్బురాజుపాలెం, పిచ్చుకలపాలెం, దొండపాడు, ఐనవోలు గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించారు. మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు ప్రారంభం కావాల్సి ఉంది. ఇలా వెలుగులోకి.. ఇటీవల తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం వాసులకు సీఆర్డీఏ కార్యాలయం వద్ద లాటరీ విధానం ద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతున్న ప్రక్రియేనని భావించిన రైతులంతా ప్లాట్లు ఎక్కడపడితే అక్కడ ఇచ్చినప్పటికీ మారు మాట్లాడకుండా అధికారులు ఇచ్చిన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఇదిలాఉండగా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జమ్ముల వెంకటరమణయ్య ల్యాండ్ పూలింగ్‌కు 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్లాట్ల కేటాయింపులో 500 గజాల నివాస ప్లాట్లు రెండు, వెయ్యి గజాల నివాస ప్లాట్లు మరో రెండు, కమర్షియల్ కోసం 780 గజాల ప్లాట్లు రెండు కావాలని అడిగారు. ఆ మేరకు ఇతనికి కేటాయించిన ప్లాట్లన్నీ పక్కపక్కనే వాస్తు ప్రకారం, కోరుకున్న చోట, లాటరీకి సంబంధం లేకుండా ఉన్నాయి. సీఆర్డీఏ వేసిన లేఅవుట్లలో ఒక దానిలో వెయ్యి గజాల ప్లాట్లు నంబర్ 3, 4 కేటాయించారు. 500 గజాల ప్లాట్లను మరో లేఅవుట్లో 4, 5 నంబర్ ప్లాట్లు కేటాయించారు. 780 గజాల కమర్షియల్ ప్లాట్లను మరో లేఅవుట్లో 16, 17 నంబర్లలో కేటాయించటం గమనార్హం. మిగతా రైతులకు మాత్రం వీధిపోటు ఉన్నవి, వాస్తు బాగోలేని ప్లాట్లు ఎక్కడో దూరంగా కేటాయించారు. టీడీపీ నేత వెంకటరమణయ్యకు ఒకే చోట ప్లాట్లు కేటాయించిన విషయం బయటకు పొక్కటంతో విద్యావంతులైన కొందరు సీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్లారు. అందులో ఉంచిన భూ యాజమాన్య పత్రాలను బయటకు తీశారు. అందులో వెంకటరమణయ్య ప్లాట్ల బాగోతం బయటపడింది. దీంతో సీఆర్డీఏ అధికారులు వెంటనే ఆన్లైన్లో ఉంచిన భూ యాజమాన్య పత్రాలన్నింటినీ తొలగించారు. ప్లాట్ల కేటాయింపంతా ముందే నిర్ణయిస్తున్నారని, లాటరీ విధానం అంతా మోసం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని డిజైన్లలో విద్యార్థుల భాగస్వామ్యం: సీఎం
సాక్షి, అమరావతి: రాజధాని భవనాల డిజైన్ల విషయంలో విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లడం ద్వారా యువత మనోభావాలను గౌరవించినట్లవుతుందని తెలిపారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌లను గుర్తించి వారి సహకారం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్’ సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలో నివాళులర్పించారు. ‘ప్యాకేజీ’ లాభాలపై టీడీపీ నేతలకు శిక్షణ కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల వచ్చే లాభాల గురించి పార్టీ నేతలకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. -
వెలగపూడిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం!
సీఎం కార్యాలయానికి సమీపంలోనే ఏర్పాటు: సీఎం సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణం గురించి సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో తన కార్యాలయానికి సమీపంలోనే కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు. అసెంబ్లీ భవనాన్ని సచివాలయంలోని మిగిలిన ఐదు భవనాల నుంచి విడదీసే ప్రణాళికపై చర్చించి సూచనలు చేశారు. అసెంబ్లీ చుట్టూ ఎత్తై ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సచివాలయం కంటే అసెంబ్లీ భవనం ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్డీఏ అధికారులు తయారు చేసిన ప్రణాళికను ఆమోదించారు. రాజధాని గ్రామాల్లో ప్లాట్ల పంపిణీపైనా చర్చించారు. ఈ నెల 21న శాఖమూరులో చేసే ప్లాట్ల కేటాయింపు గురించి అధికారులు ఆయనకు వివరించారు. డ్రోన్లతో రియల్‌టైమ్ గవర్నెన్స్ : రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా రియల్‌టైమ్ గవర్నెన్స్ కింద డ్రోన్లు, సర్వైలెన్సు కెమేరాల పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆదివారం ఫైబర్ నెట్వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో డ్రోన్ల వినియోగం గురించి ఆయన చర్చించారు. గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ముంచుకొస్తున్న ముహూర్తం
* పూర్తికాని తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు * పలుచోట్ల కుంగిన ఫ్లోరింగ్.. ఉద్యోగుల్లో ఆందోళన సాక్షి,అమరావతి: సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌నుంచి అమరావతి తరలివచ్చేందుకు ముఖ్యమంత్రి పెట్టిన ముహూర్తం ముంచుకొస్తోంది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వేలాదిమంది కూలీలతో రేయింబవళ్లు పనిచేయిస్తున్నా 27నాటికి పూర్తయ్యేలా కనిపించడంలేదు. మరోవైపు తాత్కాలిక సచివాలయం ఆరు బ్లాకుల్లో రెండు భవనాల్లో ఫ్లోరింగ్ కుంగిపోవడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న మందడం గ్రామంలో ఓ భవనం కుంగితే యజమాని దాన్ని జాకీలతో పైకిలేపి అత్యాధునిక పద్ధతులతో అడుగు భాగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు కుంగడం సచివాలయ ఉద్యోగుల్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. నాలుగో బ్లాక్‌లో ఫ్లోరింగ్ కుంగడంతో దాన్ని పగులగొట్టి పునర్నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని అధికారులు, ఇంజినీర్లు ధ్రువీకరించకపోయినా అక్కడ పనిచేసే కూలీలు మాత్రం రెండు, మూడుచోట్ల నిర్మాణాలు కుంగినట్లు తెలిపారు. ఈనెల 22న సచివాలయ పనులు పరిశీలించి రోడ్‌మ్యాప్ ప్రకటిస్తానని సరిగ్గా వారం కిందట సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే సీఎం పర్యటనను 23కి వాయిదా వేశారు. ఆ పర్యటన కూడా వాయిదా పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, హైదరాబాద్ నుంచి ఈ నెల 27న తరలిరానున్న అధికారులు తాత్కాలిక సచివాలయం పనుల పరిస్థితిని తెలుసుకుని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కొందరు ఉద్యోగులు వచ్చి పనులు పరిశీలించారు. అమరావతి ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏమాత్రం సాధ్యం కాదని నిపుణులు మొదటి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. వెలగపూడి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలు ఎక్కడా కుంగలేదని సీఆర్డీఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలంగా ఉన్నచోటే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటు మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఎక్కడా రాజీలేకుండా భవనాలను నిర్మిస్తున్నామని, నేల కుంగలేదని, ఆందోళన చెందవద్దని సూచించారు. -
అడ్డగోలు మార్కింగ్లతో ఇళ్ల కూల్చివేత
తుళ్ళూరు : రహదారుల వెంట ఆక్రమణల తొలగింపులో అధికారులు అడ్డగోలుగా మార్కింగ్ చేయడంతో పలువురు నివాసాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్ళూరులో ఆక్రమణల తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు రాజధాని గ్రామాలను సుందరీకరణ చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు తుళ్ళూరు మండలంలోని పెదపరిమి, మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాలలో రహదారుల వెంట వున్న ఆక్రమణలను సీఆర్డీఏ అధికారులు తొలగించారు. మండలకేంద్రమైన తుళ్ళూరులో గత వారం రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వివాదాలకు దారి తీసింది. తుళ్ళూరు ఎస్సీ కాలనీలో రెవెన్యూ సర్వేయర్ల తప్పుడు లెక్కలతో నాలుగు అడుగులు ఎక్కువ దూరం మార్కింగ్ ఇవ్వడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత 50 సంవత్సరాలుగా పంచాయితీకి పన్నులు కూడా కడుతున్నామని, అధికారులు వచ్చి ఈ స్థలాలు ప్రభుత్వానివేనంటూ నివాసాలు తొలగించారని కాలనీకి చెందిన వృద్ధురాలు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఉన్న గూడు పడగొట్టారని, తాను ఎలా బతకాలని ఆమె రోదిస్తోంది. స్థానికులు అధికారులను నిలదీయడంతో సోమవారం మరోసారి సర్వే చేసిన అధికారులు పొరపాటు జరిగిందంటూ పాత మార్కింగ్‌ను కొట్టివేసి, నాలుగు అడుగులు వెనక్కి కొత్తగా మార్కింగ్ ఇచ్చారు. దీంతో తప్పుడు మార్కింగ్‌తో తాము ఇళ్లు కోల్పోయామని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. చెండాచెట్టు కూడా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయం చూపాలని తుళ్ళూరు ముస్లింలు అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలను అర్ధంతరంగా ఖాళీచేయిస్తే వారు ఎలా బతకాలని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ నాయకుడు కత్తెర సురేష్‌కుమార్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు మానవతా ధర్మంతో బాధితులను ఆదుకోవాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు : తహశీల్దార్ దీనిపై తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్‌బాబును వివరణ కోరగా సాధ్యమైనంత వరకు అందరికీ ముందస్తు సమాచారం ఇచ్చామని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. ఎవరికైనా సొంతస్థలాలు, ఆస్తుల నష్టం జరిగితే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రీ సర్వే చేయిస్తామని వివరణ ఇచ్చారు. -
జనం సొమ్మేగా.. జల్సా చేసొద్దాం
పెద్దసార్ల విదేశీ యాత్రల ఖర్చు రూ.100 కోట్లు ♦ ఏకంగా 125 జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ♦ సంక్షేమ పథకాలకు నిధుల్లేవంటూ సర్కారు బీద అరుపులు ♦ విదేశీ పర్యటనలకు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు సాక్షి, హైదరాబాద్: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడానికి నిధుల్లేవు... ఉద్యోగులకు డీఏ ఇవ్వడానికి డబ్బుల్లేవు... నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు సొమ్ముల్లేవు... రైతులు, డ్వాక్రా రుణాల మాఫీకి కాసుల్లేవు... ఇవి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న కబుర్లు. మరి నిధులు లేనప్పుడు చేయాల్సిందేమిటి? వృథా వ్యయాలకు అడ్డుకట్ట వేయాలి. పొదుపు పాటిస్తూ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అధికార యంత్రాంగం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తూ విదేశాల్లో విహరిస్తోంది. ఈ విదేశీ యాత్రల వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అంటే అదీలేదు. ప్రభుత్వ పెద్దల యాత్రల వల్ల ప్రజల సొమ్ము హారతి కర్పూరంలా హరించుకుపోతోంది. ఆయన యంత్రాంగం విదేశీ పర్యటనలకు ఇప్పటిదాకా అక్షరాలా రూ.వంద కోట్లు ఖర్చయ్యాయి. ఇదంతా ముమ్మాటికీ ప్రజల డబ్బే. సీఎం సింగపూర్ యాత్రలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ప్రథమ ప్రాధాన్యంగా విదేశీ పర్యటనలనే ఎంచుకున్నారు. ఇప్పటివరకూ పెద్ద సార్లందరూ 125 సార్లు విదేశాల్లో తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, సీఆర్డీఏ అధికారుల విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం ఏకంగా 125 జీవోలను జారీ చే సింది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై చర్చించడం కోసమంటూ చంద్రబాబు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లారు. మళ్లీ చర్చల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ బృందం సింగపూర్ వెళ్లింది. అనంతరం చంద్రబాబు బృందం జపాన్, చైనా, లండన్ పర్యటనలకు వెళ్లి వచ్చింది. ఇక రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓగా ఉన్న జె.కృష్ణకిషోర్ అమెరికా, చైనా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ దేశాల్లో పర్యటించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ పలుమార్లు సింగపూర్, చైనా, ఆస్ట్రియా తదితర దేశాల్లో పర్యటించారు. ఆయన ఐదారు రోజులకోసారి సింగపూర్‌కు వెళ్లొచ్చిన సందర్భాలున్నాయి. పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి రావత్, పర్యాటక శాఖ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ పలు దేశాలను చుట్టివచ్చారు. ప్రతీ నెలా దాదాపు నలుగురు అధికారులు విదేశాల్లోనే ఉంటున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, మృణాళిని, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు విదేశాలకు వెళ్లివచ్చారు. నిబంధనలకు తూట్లు ప్రభుత్వంలోని ఏ అధికారైనా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సహేతుకమైన కారణాలుండాలి. రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి. అలాంటిదేమీ లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా విదేశాలకు వెళ్లివస్తున్నారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా అడిగే నాథుడే లేకపోవడం గమనార్హం. అనవసర పర్యటనల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేకపోగా ఖజానా గుల్ల అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఆర్డీఏకు మినహాయింపులు విదేశీ పర్యటనల విషయంలో కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ)కు నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. అంటే సీఆర్డీఏ అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సీఆర్డీఏ అధికారుల విదేశీ పర్యటనలకుగాను ఏడాదికి రూ.4 కోట్ల చొప్పున ముందుగానే చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. -
తిరగబడ్డ పెనుమాక రైతులు
పేద రైతుల భూములే కావాల్సి వచ్చాయా? అంటూ నిలదీత మంగళగిరి: రాజధాని ప్రాంతంలో భూసేకరణ వైపు అడుగులు వేస్తున్న సీఆర్డీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని నగర భూసేకరణ, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. జిల్లా సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. గ్రామసభ విషయమై గ్రామస్తులెవరికీ సమాచారం ఇవ్వలేదు. ఉదయం 11 గంటల సమయంలో సభ జరుగుతున్న విషయం తెలుసుకున్న గ్రామ రైతులు సుమారు 70 మంది అక్కడికి చేరుకుని సీఆర్డీఏ అధికారులను నిలదీశారు. తమ భూములిమ్మంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు రాజధానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. వారి భూములు, ఆస్తులు దాచి పెట్టుకుంటారు.. మా భూములు మాత్రం త్యాగంచేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద రైతుల భూములు లాక్కొని విదేశీ సంస్థలకు కట్టబెట్టి అందినకాడికి దోచుకోవడమేనా సీఎం, మంత్రుల త్యాగం అంటూ ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న సీఆర్డీఏ అధికారులు తాము సామాజిక ప్రభావం అంచనాకోసం సర్వే నిర్వహించే ఈపీటీఆర్ సంస్థను పరిచయం చేసి వారికి సహకరించాలని మాత్రమే కోరడానికి వచ్చామని, ఆ ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. గ్రామసభ జరిగినట్లు రైతులు సంతకాలు చేయాలని కోరగా తాము సంతకాలు చేయబోమంటూ రైతులు మూకుమ్మడిగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమిలేక అధికారులు, ఈపీటీఆర్ ప్రతినిధులు గ్రామసభను వాయిదా వేసి వె నుదిరిగారు. -
రేపటి నుంచి ప్లాట్ల కోసం ఆప్షన్ల స్వీకరణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రైతులు తమకు ఏ తరహా ప్లాటు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు గురువారం నుంచి ఆప్షన్లు తీసుకోనున్నారు. ఇందుకోసం 29 గ్రామాల్లో 9.18 ఎ, 9.18 బి ఫారాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. తమ వాటా కింద వ్యక్తిగతంగా ప్లాట్లు కావాలనుకున్నవారు 9.18 ఏ ఫారాన్ని, ఉమ్మడి ప్లాట్లు కోరుకుంటున్న వారు 9.18 బీ ఫారాన్ని పూర్తి చేసి సీఆర్డీఏ అధికారులకు ఇవ్వాల్సివుంటుంది. ఈ ఫారాన్ని స్థానిక సీఆర్డీఏ అధికారులు రైతులతో దగ్గరుండి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఒకసారి ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత మరోసారి దాన్లో మార్పులు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. అందుకే సీఆర్డీఏ అధికారులు 50 మందికి దీనిపై శిక్షణ ఇచ్చి రైతుల వద్దకు పంపుతున్నారు. గురువారం నుంచి పదిరోజుల్లోపు రైతులు తమ ఆప్షన్ల ఫారాలు ఇవ్వాలి. లేకపోతే సీఆర్డీఏ అధికారులు రైతుల వాటా ప్రకారం ఎంత సైజు ప్లాటు వస్తుందో నిర్ధారిస్తారు. ప్లాట్ల సైజులు, విధివిధానాల గురించి ముద్రించిన బ్రోచర్లను సీఆర్డీఏ గ్రామాల్లో పంపిణీ చేసింది. -
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
విజయవాడ: విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. భూములు ఇవ్వని ఉండవల్లి, పెనుమాక రైతుల పోలాల్లో రోడ్డు మార్కింగ్ పిల్లర్లు వేశారంటూ సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల జోలికి రావొద్దని కోర్టు చెప్పినా.. అధికారులు భూమలివ్వాలంటూ తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ. 30 కోట్ల అదనపు భారం
♦ తాత్కాలిక సచివాలయం టెండర్లు 12 శాతం అదనంగా ఖరారు ♦ నిబంధనల ప్రకారం ఐదు శాతం కన్నా ఎక్కువ ఆమోదించరాదు ♦ నిర్మాణ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట.. స్వయంగా జోక్యం చేసుకున్న సీఎం! ♦ మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రకటన.. సాక్షి, విజయవాడ బ్యూరో: అనుకున్నదే అయ్యింది. నిర్ధారించిన విలువ కంటె ఎక్కువ మొత్తానికే తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. సీఆర్డీఏ నిర్దేశించిన వాస్తవ విలువ కంటె 12 శాతం (చదరపు అడుగు రూ.3,350) ఎక్కువ మొత్తానికి టెండర్లను ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 30 కోట్లకు పైగా భారం పడనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత టెండర్ల ఖరారు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మూడు ప్యాకేజీల కింద నిర్మించాల్సిన ఆరు భవనాల నిర్మాణానికి రూ. 170.74 కోట్లు ఖర్చవుతుందని టెండరు ప్రకటనలో సీఆర్డీఏ పేర్కొంది. కానీ 12 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఆమోదించడంతో అంచనా వ్యయం రూ. 201 కోట్లకు పెరిగింది. దీంతోపాటు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసే పేరుతో రెండు శాతం ఇన్సెంటివ్ను కూడా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వజూపింది. అలాగే నిర్మాణ సంస్థలు భరించాల్సిన పన్నులను సైతం తగ్గించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తద్వారా నిర్మాణ సంస్థలకు భారీగా మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తేటతెల్లమవుతోంది. సీఎం జోక్యంతోనే సీఆర్డీఏ అన్నింటికీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ఖర్చులో సగాన్ని హడ్కో నుంచి రుణంగా సేకరించి మిగిలిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు. ఎక్సెస్‌కే సీఎం మొగ్గు.. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఒక్కో ప్యాకేజీకి రెండు భవనాలు చొప్పున మొత్తం ఆరు భవనాలను (బ్లాకులు) మూడు ప్యాకేజీలుగా విభజించింది. చదరపు అడుగు విలువను మూడు వేలుగా నిర్ధారించారు. మూడు ప్యాకేజీలకు ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేయగా వారం క్రితం వాటిని తెరిచారు. రెండు ప్యాకేజీల్లో ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీలో షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఎల్1గా నిలిచాయి. అయితే రెండు సంస్థలూ నిర్దేశించిన విలువ కంటె ఎక్కువగా రూ. 4,300 నుంచి రూ.4,500 (35 శాతం) వరకూ టెండర్లలో కోట్ చేయడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన విలువ కంటె ఐదు శాతానికి మించిన దాఖలు చేసిన టెండర్లను ఆమోదించే అవకాశం లేదు. దీంతో సీఆర్డీఏ అధికారులు మళ్లీ టెండర్లు పిలవాలని భావించినా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ కంపెనీలకే టెండర్లు ఖరారు చేయాలని స్పష్టమైన ఆదేశాలందాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఎక్సెస్కైనా వారికే టెండర్లు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆదివారం దీనిపై ఆయన మరింత స్పష్టత ఇవ్వడంతో అధికారులు చర్చలు జరిపి రూ.3,350కి కంపెనీలను ఒప్పించారు. ఇన్సెంటివ్తోనూ లబ్ధి.. టెండర్లో ఆరు నెలల్లో భవనాలను నిర్మించాలని నిర్దేశించారు. ఐదు నెలల్లోపు పూర్తి చేస్తే ఒక శాతం, నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తే రెండు శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. రెండు సంస్థలూ జూన్ 15లోపు (నాలుగు నెలల్లోనే) నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అంటే అదనంగా రెండు శాతం వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతోపాటు నిర్మాణ సంస్థ భరించాల్సిన పన్నులను కూడా తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. వాటితో కలుపుకుంటే ఆ సంస్థలు కోరిన విధంగా చదరపు అడుగు రూ.3,500కే పనులు అప్పగించినట్లవుతుంది. ఈ టెండర్లు ఖరారు కాకపోవడం వల్లే ఈ నెల 12వ తేదీన జరగాల్సిన తాత్కాలిక సచివాలయం శంకుస్థాపనను వాయిదా వేశారు. ఇప్పుడు టెండర్లు తంతు కొలిక్కి రావడంతో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శంకుస్థాపన తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు. 17వ తేదీలోపు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అయితే ఐదు శాతం కన్నా ఎక్కువకు టెండర్లను ఆమోదించండంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
35 శాతం ఎక్సెస్‌కు టెండర్లు
తాత్కాలిక సచివాలయానికి పలు సంస్థల దాఖలు అయోమయంలో సీఆర్డీఏ అధికారులు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నగరంలోని వెలగపూడిలో తలపెట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు సీఆర్డీఏ నిర్దేశించిన దానికంటే ఎక్కువ మొత్తానికి(ఎక్సెస్) టెండర్లను దాఖలు చేశాయి. దీంతో ఈ నెల 12న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఆరు భవనాల నిర్మాణాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి సీఆర్డీఏ టెండర్లు పిలవగా.. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. టెండర్లో సీఆర్డీఏ చదరపు అడుగుకు రూ.3 వేలు దాటకూడదని నిర్దేశించినప్పటికీ రెండు సంస్థలు రూ.4 వేల వరకూ కోట్ చేసినట్లు తెలిసింది. రెండు ప్యాకేజీలకు ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీకి షాపూర్ పల్లోంజి సంస్థలు ఎల్1గా(లోయస్ట్ బిడ్) నిలిచినా సీఆర్డీఏ నిర్దేశించిన రూ.మూడు వేలకు మించి వారు కోట్ చేసిన ధరలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన దానికంటే ఐదు శాతం ఎక్కువ(ఎక్సెస్)కు కోట్ చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ ఈ రెండు సంస్థలు 35 శాతానికంటే ఎక్కువకు కోట్ చేయడంతో ఏంచేయాలనే దానిపై సీఆర్డీఏ తర్జనభర్జన పడుతోంది. ఆదివారానికల్లా టెండర్లు ఖరారు చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ అడ్డంకి రావడంతో మళ్లీ టెండర్లు పిలవక తప్పదని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. దీంతో రీ టెండర్లు పిలవాలా, దాఖలైన టెండర్లను ఖరారు చేయడానికి ఏమైనా వీలుందా? అనే విషయాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆదివారం ఏ విషయాన్ని తేల్చనున్నారు. -
భూములు ఇవ్వలేదనే అరటి తోటలు ధ్వంసం
‘సీఆర్డీఏ’ బాధిత రైతులు రాజేష్, చంద్రశేఖర్ ఆవేదన విజయవాడ (గాంధీనగర్): ల్యాండ్‌పూలింగ్‌లో భూమి ఇవ్వనందుకే సీఆర్డీఏ అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే అరటితోటను నేలమట్టం చేశారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు గుండపు రాజేష్, చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సామాజికవేత్త పండలనేని శ్రీమన్నారాయణతో కలసి బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు. అరటితోట ధ్వంసం పై తహసీల్దార్, జేసీ, యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని.. పరిహారం రూ.20 లక్ష లివ్వాలని కోరామన్నారు. ఘటనపై స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. కోర్టు ధిక్కారమే.. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పనులు చేపట్టరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నప్పటికీ శంకుస్థాపన పేరుతో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమ ణ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పండలనేని శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఎన్జీటీ స్టే ఆర్డర్ ఉండగా పూలింగ్‌కు ఇచ్చిన భూములతోపాటు, ఇవ్వని భూముల్లో పనులు చేయడానికి వీల్లేదన్నారు. అరటి తోటల ధ్వంసం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
వరదొస్తే అమరావతి అతలాకుతలమే
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో బీభత్సం సృష్టించిన వరద అమరావతి ప్రాంత ప్రజలను, సీఆర్డీఏ అధికారులను ఆలోచనలో పడేసింది. అంతటి వరద కాదు.. అందులో కొంత వచ్చినా అమరావతి అతలాకుతలం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని 50 వేల ఎకరాల్లో నిర్మించేందుకు సర్కారు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. సాధారణ వర్షపాతానికే 13 వేల ఎకరాలు, భారీ వర్షాలు కురిస్తే 25 వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రాంతంలో చెన్నైలో కురిసిన కుంభవృష్టి కురిస్తే మొత్తం రాజధాని నీట మునగడం ఖాయమని అధికారులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. రాజధాని కమిటీ అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో అమరావతికి ముంపు ప్రమాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. వరద ప్రమాదం గురించి ‘మాస్టర్‌ప్లాన్’లో సింగపూర్ కంపెనీలు కూడా హెచ్చరించాయి. కొత్త రాజధానిని ముంచేయడానికి, వరద బీభత్సాన్ని రుచి చూపించడానికి కొండవీటి వాగు ఒక్కటి చాలని, దానికి తోడు కృష్ణా నది ఉప్పొంగితే.. అంచనాలకు అందనంత ప్రమాదం తప్పదనీ ఇటు పట్టణ ప్రణాళిక, అటు నీటి పారుదల రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నై వరద పరిస్థితి చూసిన తర్వాత.. సచివాలయంలో ఏ శాఖ అధికారిని కదిలించినా తుఫాన్లు, వరదల సమయంలో అమరావతి ఎంత భద్రం? అనే అంశం మీదే చర్చిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని సాధారణ ప్రజల్లో, సీఆర్డీఏ అధికారుల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే భద్రత కరువే ‘వాతావరణ మార్పుల ఫలితంగా కుంభవృష్టి కురిసే అవకాశాలు పెరుగుతున్నాయి. చెన్నైలోనూ 100 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ కుంభవృష్టి కురిసింది. కొండవీటి వాగు 63 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. వాగు పొడవునా పొలాల్లో కురిసిన వర్షం వాగులోకి చేరుతుంది. కుంభవృష్టి కురిస్తే వాగు సామర్థ్యానికి మించి వచ్చే నీటితో ఆ ప్రాంతం జలమయమవుతుంది. పట్టణీకరణ జరగక ముందే 25 వేల ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే ముంపునకు గురయ్యే విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. అంటే కుంభవృష్టి కురిస్తే కేవలం కొండవీటి వాగు వల్లే రాజధాని ప్రాంతం మొత్తం జలమయం అవుతుంది. కృష్ణా గరిష్ట వరద ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ముంపు ప్రమాద తీవ్రత రెట్టింపవుతుంది. రెండింటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణ వర్షాలకే ముంపు ప్రమాదం పొంచి ఉంటుంద’ని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో చెప్పిన సింగపూర్ అమరావతిలో వరదల ప్రమాదం గురించి సింగపూర్ కంపెనీలు ముందే హెచ్చరించాయి. కొండవీటి వాగులో మెరుపు ప్రవాహాలు(ఫ్లాష్ ఫ్లడ్స్) ఉంటాయని, సాధారణ ప్రణాళికలతో సరిపెట్టకుండా నిపుణులు రూపొందించిన ప్రణాళికల మేరకు వరద నియంత్రణ కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో ‘లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్’ ఉన్నాయని మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా చెప్పారు. ‘రాజధాని ప్రాంతంలో వర్షాకాలంలో 13,500 ఎకరాలు నీట మునుగుతుందని, ఏటా రెండు, మూడు నెలలు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఒక్కోసారి ముంపునకు గురైన తర్వాత.. 5-7 రోజుల పాటు నీటిలోనే ఉంటుంది. ఇలాంటి 13,500 ఎకరాల్లో 10,600 ఎకరాలు రాజధాని ప్రణాళిక ప్రాంతంలోనే ఉన్నాయి’ అని మాస్టర్‌ప్లాన్‌లోని 82వ పేజీలో స్పష్టంగా పేర్కొంది. భారీగా నిధులు అవసరం కొండవీటి వాగు వరద ప్రభావాన్ని తగ్గించడానికి కనీసం రూ. 1,500 కోట్లు అవసరమని సీఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. కేవలం కొండవీటి వాగు వదర ఉధృతిని తగ్గించి, అమరావతి ముంపునకు గురికాకుండా చేయడానికే ఈ నిధులు సరిపోతాయి. కృష్ణానది ఉప్పొంగితే వచ్చే ప్రమాదాన్ని నివారించేందుకు భారీగా నిధులు వెచ్చించాలని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. కేవలం వరద నియంత్రణకే భారీగా నిధులు వెచ్చించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొండవీటి వాగు స్వరూపం ► కొండవీడు కొండల దిగువన కొండవీటి వాగు ప్రారంభమవుతుంది. పేరేచర్ల, మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 12 గ్రామాల పక్కన ప్రవహిస్తూ ఉండవల్లి దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ► ఏటా సాధారణ వర్షాల సమయంలో 4-5 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంటుంది. పొట్టేళ్లవాడు, పాలవాగు, అయ్యన్న వాగుల నుంచి వచ్చే వర దనీరు మొత్తం తుళ్లూరుకు ఎగువన కొండవీటి వాగులో కలిసిన తర్వాత ఉధృతి తీవ్రమవుతుంది. 25 వేల క్యూసెక్కుల గరిష్ట వరద వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. మెరుపు వేగంతో వరద పోటెత్తడం ఈ వాగు ప్రత్యేకత. అలాంటి సమయాల్లో వరద ప్రవాహ వేగం సాధారణం కంటే కనీసం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ► ఈ వాగు పొంగితే ఏటా తుళ్లూరు మండలంలోని మందడం, వెలగపూడి, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, వెంకటపాలెం, యర్రబాలెం, తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామాలకు చెందిన పంట పొలాలు ముంపునకు గురవుతుంటాయి. ► ఏటా మామూలు వర్షాలకే 13,500 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు మునుగు తుంటాయి. భారీ వర్షాలు కురిస్తే.. 25 వేల ఎకరాలకు ముంపు తప్పదు. ఇది స్థానికులకు అనుభవం నేరిపన పాఠం సీఆర్డీఏ ప్రణాళిక ఫలించేనా? ► కొండవీటి వాగు కృష్ణాలో కలిసే చోట ప్రత్యేకంగా స్లూయిస్ నిర్మాణం ఏర్పాటు చేయాలి. కృష్ణానది పోటెత్తినప్పుడు వాగులో నీరు ఎగదన్ని ముంపు ప్రభావం పెరగకుండా ఉండటం కోసం రెగ్యులేటర్ మాదిరి స్లూయిస్ పనిచేస్తుంది. కృష్ణానది ప్రవాహ మట్టం కంటే వాగు బెడ్ లెవల్ ఎక్కువ. కృష్ణా నీటిని బలంగా నియంత్రిచకపోతే.. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ► ముంపును నివారించేందుకు కొండవీటివాగు నీటిని కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలోకి మళ్లించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. దీనివల్ల వాగు పోటెత్తినప్పుడు రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాకుండా నీటి ప్రవాహం సాఫీగా ఉంటుంది. వాగు ఎగువన నాలుగు చోట్ల రిజర్వాయర్లు నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని ప్రణాళికలు రూపొందించింది. -
ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన రాజధాని వ్యవహారాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాశ్రయ అప్రోచ్ రోడ్డును హైవే వరకు నాలుగు లైన్లుగా విస్తరించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. హైవే, విమానాశ్రయం ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఉండేలా దీన్ని నిర్మించాలని చెప్పారు. భారీ విమానాలు ఆగేందుకు వీలుగా రన్‌వే విస్తరణ కోసం ఏలూరు కాలువను ఏడు కిలోమీటర్లు మళ్లించే పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు ఆర్ అండ్ బీ రోడ్లను మూడు కిలోమీటర్ల మేర మళ్లించే పనులను 45 రోజుల్లో చేయాలని సూచించారు. విశాఖపట్నం - విజయవాడ, చెన్నై - నెల్లూరు, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారులను ఆరు వరుసలుగా విస్తరించాలని చెప్పారు. ఇందుకోసం వెంటనే సవివర నివేదికలు తయారు చేయాలని సీఎం హైవే అధికారులకు సూచించారు. పండుగలా రాజధాని శంకుస్థాపన... అక్టోబర్ 22వ తేదీన రాజధాని శంకుస్థాపనను పండుగలా చేయాలని, ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని సీఎంతెలిపారు. శంకుస్థాపన పైలాన్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక పార్కుగా తయారుచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 29 రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, దానిలో గ్రామస్తులకు ఉపాధికి దొరుకుతుందని తెలిపారు. గ్రామకంఠాలకు ఆనుకుని ఉన్న 8వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇస్తామని పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల రైతులు ముందుకు వచ్చారని, దీన్ని పరిశీలించాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపును వేగవంతం చేయాలని, అధికారులకు అవసరమైన నివాస సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. -
మంత్రి వ్యాఖ్యలపై దుమారం
మంగళగిరి: సీఆర్డీఏ పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు సీఆర్డీఏ అధికారుల్లో దుమారం లేపుతున్నాయి. ఈనెల 26న గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామకంఠాలపై నిలదీయడంతో మంత్రి.. ప్రభుత్వానికి తెలియకుండా డిప్యూటీ కలెక్టర్లే గ్రామకంఠాల జాబితాలను ప్రకటించారని, మా రైతులు మంచివారు కాబట్టి ఊరుకున్నారని, లేకుంటే డిప్యూటీ కలెక్టర్లను చెట్టుకు కట్టివేసి కొట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్ కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయనట్టు సమాచారం. మంత్రి వ్యాఖ్యలపై సీఆర్డీఏ అధికారులు తమ సంఘ సమావేశంలో.. మంత్రులు చెప్పినట్లు తాము సహకరిస్తున్నా రైతుల మెప్పుకోసం తమను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు మూకుమ్మడి సెలవు పెట్టి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. -
ఏమిటో అభ్యంతరం
తాడికొండ : రాజధాని రైతుల అభ్యంతరాలను సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అభ్యంతరాలను తెలుపుతూ అంజేసిన దరఖాస్తులను పరిశీలించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటో కూడా వెల్లడికావడం లేదు. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో జనవరి 2 తేదీ నుంచి ప్రభుత్వం భూ సమీకరణ ప్రారంభించి పూర్తి చేసింది. ఈ క్రమంలో రైతుల నుంచి 9.2 (అభ్యంతరం), 9.3(అంగీకారం) డిక్లరేషన్ పత్రాలను సేకరించింది. ప్రభుత్వం 9.3 దరఖాస్తులకు ఇచ్చిన ప్రాధాన్యత అదే రైతుల నుంచి తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అందజేసిన 9.2 అభ్యంతరాల దరఖాస్తులను నేటికీ పరిశీలించడం లేదు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 33,400 ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వం వెను వెంటనే అనుకూల రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకొని కౌలు చెక్కులు అందజేయటమేకాక పొలాలను చదునుచేసే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికి మూడునెలలు గడిచినా 9.2 దరఖాస్తులపై దృష్టి సారించలేదు. 9.2 దరఖాస్తులంటే భూ సమీకరణకు వ్యతిరేకమని భావిస్తున్న ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా పట్టించుకోని స్థితిలో ఉంది. ఈ విషయమై సీఆర్డీఏ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా, వాటిపై ఇంకా చర్యలు తీసుకోలేదని మాత్రమే సమాధానమిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్న రాజధాని రైతుల దరఖాస్తులను ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకుందో ఇట్టే అర్థమవుతోంది. మూడు మండలాల నుంచి అధికంగా.. రాజధాని ప్రాంతంలో అధికంగా తుళ్లూరు మండలం జరీబు భూములతోపాటు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రైతులు 9.2 దరఖాస్తులను అందజేశారు. వాటిపై ఇప్పటికే పరిశీలన పూర్తి చేసి రైతులకు తగిన సమాధానం ఇవ్వాల్సి ఉండగా, 9.3 దరఖాస్తులు వెనక్కి అడుగుతున్నారని అప్పట్లో ప్రభుత్వం ఎత్తుగడ వేసి 9.2 దరఖాస్తులను కూడా ఆయా గ్రామాల నుంచి తరలించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోవటంపై పలు విమర్శలు వస్తున్నాయి. నెల నుంచి రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులు తమ సమస్యలను పరిష్కరించటం లేదని కౌలు డీడీలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో అధికారులే స్వయంగా ఫోనులు చేసి, రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు డీడీలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి అంశం గోప్యమే... మరో వైపు సీఆర్డీఏలో రైతులకు సంబంధించిన ప్రతి వ్యతిరేక అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని ప్రాంత 29 గ్రామాల భూములకు సంబంధించిన అన్ని వివరాలను గోడ ప్రతుల ద్వారా పొందుపరుస్తామన్న సీఆర్డీఏ ఉప చైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మాటలు ఆచరణలో కానరావడం లేదు. భూ సమీకరణలోని భూముల వివరాలు అందరికి తెలిసేలా అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు విన్నవించినా ప్రభుత్వానికి కనువిప్పు కలగటం లేదు. -
అనధికార లేఅవుట్ల ధ్వంసానికి శ్రీకారం
తోట్లవల్లూరు : జిల్లాలో అనధికార లేఅవుట్ల ధ్వంసానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తోట్లవల్లూరు మండలంలో 12 లే అవుట్లను, పెనమలూరు మండలం యనమలకుదురులో మరో లే అవుట్‌ను శనివారం ధ్వంసం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఆర్డీఏ అధికారులు ఈ పనులను పర్యవేక్షించారు. తోట్లవల్లూరు మండలంలోని యాకమూరులో అనధికార లేఅవుట్లను డీపీవో ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలియజేశారు. మండల పరిధిలో మొత్తం 36 అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 768 అనధికార వెంచర్లను గుర్తించినట్లు చెప్పారు. సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలం వదలకుండా, కనీసం గ్రామపంచాయతీకి దర ఖాస్తు కూడా చేయకుండా గ్రామాలలో లేఅవుట్లు వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేవలం రోడ్లను చూసి అనుమతి లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. యాకమూరు, తోట్లవల్లూరు గ్రామాల్లోని వెంచర్లను ధ్వంసం చేసిన అధికారులు.. విడతల వారీగా మిగిలిన గ్రామాలలో కూడా అనధికార వెంచర్లను ధ్వంసం చేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో వరప్రసాద్, ఈవోపీఆర్డీ అరుణ, పంచాయతీ కార్యదర్శులు కుమారస్వామి, హనుమాన్‌గౌడ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.