
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల
అమరావతి: పెనుమాక కేసులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్ రాయాలని నిలదీసినందుకు ఆయనపై సీఆర్‌డీఏ అధికారులు కేసు పెట్టారు. ఎమ్మెల్యే సహా 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. కాగా, స్టేషన్ బెయిల్‌పై ఎమ్మెల్యే ఆర్కే విడుదలయ్యారు.
సీఎం చంద్రబాబు ఒత్తిడి వల్లే అధికారులు తనపై కేసు పెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అరాచకాలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. భూ సేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మినిట్స్ బుక్ రాయమన్నందుకు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులు చేస్తే తప్పులేదు కానీ, మినిట్స్ బుక్ రాయమంటే తప్పా అని అడిగారు.