రేపటి నుంచి ప్లాట్ల కోసం ఆప్షన్ల స్వీకరణ | Plots options would be taken by CRDA from tomorrow | Sakshi

రేపటి నుంచి ప్లాట్ల కోసం ఆప్షన్ల స్వీకరణ

Apr 27 2016 9:52 PM | Updated on Aug 18 2018 5:50 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని రైతులు తమకు ఏ తరహా ప్లాటు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు గురువారం నుంచి ఆప్షన్లు తీసుకోనున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని రైతులు తమకు ఏ తరహా ప్లాటు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు గురువారం నుంచి ఆప్షన్లు తీసుకోనున్నారు. ఇందుకోసం 29 గ్రామాల్లో 9.18 ఎ, 9.18 బి ఫారాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. తమ వాటా కింద వ్యక్తిగతంగా ప్లాట్లు కావాలనుకున్నవారు 9.18 ఏ ఫారాన్ని, ఉమ్మడి ప్లాట్లు కోరుకుంటున్న వారు 9.18 బీ ఫారాన్ని పూర్తి చేసి సీఆర్‌డీఏ అధికారులకు ఇవ్వాల్సివుంటుంది. ఈ ఫారాన్ని స్థానిక సీఆర్‌డీఏ అధికారులు రైతులతో దగ్గరుండి పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఎందుకంటే ఒకసారి ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత మరోసారి దాన్లో మార్పులు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. అందుకే సీఆర్‌డీఏ అధికారులు 50 మందికి దీనిపై శిక్షణ ఇచ్చి రైతుల వద్దకు పంపుతున్నారు. గురువారం నుంచి పదిరోజుల్లోపు రైతులు తమ ఆప్షన్ల ఫారాలు ఇవ్వాలి. లేకపోతే సీఆర్‌డీఏ అధికారులు రైతుల వాటా ప్రకారం ఎంత సైజు ప్లాటు వస్తుందో నిర్ధారిస్తారు. ప్లాట్ల సైజులు, విధివిధానాల గురించి ముద్రించిన బ్రోచర్లను సీఆర్‌డీఏ గ్రామాల్లో పంపిణీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement