సాక్షి, అమరావతి: రాజధాని భవనాల డిజైన్ల విషయంలో విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలని సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లడం ద్వారా యువత మనోభావాలను గౌరవించినట్లవుతుందని తెలిపారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌లను గుర్తించి వారి సహకారం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్’ సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలో నివాళులర్పించారు.
‘ప్యాకేజీ’ లాభాలపై టీడీపీ నేతలకు శిక్షణ
కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల వచ్చే లాభాల గురించి పార్టీ నేతలకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది.
రాజధాని డిజైన్లలో విద్యార్థుల భాగస్వామ్యం: సీఎం
Published Sun, Oct 2 2016 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement