అమరావతికి అనువైన ప్రాజెక్టులు ఇవే..
సీఆర్‌డీఏ అధికారులకు జపాన్ బృందం సలహాలు
సాక్షి, విజయవాడ : రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్‌డీఏ అధికారులకు జపాన్ బృందం వివరించారు. జపాన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2015 అక్టోబర్ 22న జరిగిన ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశంపై పరిశీలించింది. దీనికి సంబంధించిన నివేదికను జపాన్ బృందం తయారు చేసి శనివారం సీఆర్‌డీఏ అధికారులకు అందజేశారు.
సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జపాన్ బృందం ఆయా ప్రాజెక్టులపై సీఆర్‌డీఏ, అమరావతి డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), పోలీసుశాఖ అధికారులకు వివరించారు. సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ రామమోహనరావు, డీసీపీ రాణా, ఇతర సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వుండే ప్రాజెక్టుల గురించి జాపాన్ బృందం చెప్పిన వివరాలు..
డేటా సెంటర్. క్రౌడ్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్
రాష్ట్రమంతంటికీ తక్కువ ఇంధన ఖర్చుతో అత్యుత్తమంగా ఇంటర్ నెట్ సేవలు అందించే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాడ్యూలర్ డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచిం చారు. క్రౌడ్ కంప్యూటింగ్‌తో పాటు తక్కువ వ్యవధిలో పౌరులకు ఉపయోగపడే దరఖాస్తులకు పరిశీలించేందుకు ఈ మాడ్యులర్ డేటా సెంటర్‌ను ఉపయోగించవచ్చన్నారు.
వాతావరణ రాడార్ సిస్టమ్స్
ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలుసుకుని, కాపాడేందుకు ఉపయోగపడే వాతావరణ రాడార్ సిస్టమ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని జపాన్ బృందం సూచించింది. ఈ రాడార్ సిస్టమ్ రాజ« దాని ప్రాంతంలోని కాల్వలు, నది, మురికి కాల్వలు, రవా ణా రంగాలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది. తద్వారా ప్రాణ, భారీగా ఆస్తినష్టం జరగకుండా చూసుకోవచ్చు.
మంచినీటి సదుపాయం
అతి తక్కువ ఖర్చుతో అతి పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికి ఇచ్చేం దుకు వీలుగా ఒక ప్రాజెక్టును జపాన్ బృందం సీ ఆర్‌డీఏ అధికారు లకు వివరించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో తాగునీటి కోసం ఏ విధానాలను అవలంబిస్తున్నారో వివరించి రాజధాని లో మంచినీటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. పర్యావరణ ఇబ్బందులు రాకుండా ఇంధనం కూడా ఉత్పత్తి చేసే సీవియేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వివరాలను బృందం వివరించింది. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సిగ్నల్స్ ఏర్పాటు గురించి వివరించారు. ఇదే సమయంలో డీసీపీ రాణా విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు గురించి వారికి వివరించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు ఒక ప్రణాళిక ఇస్తామని జపాన్ బృందం హామీ ఇచ్చింది.
భూకంపాలు తట్టుకునేలా నిర్మాణాలు
ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు
రామవరప్పాడు : భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమవుతున్నాయని ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు తెలిపారు. ఎనికేపాడులోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు– మారుతున్న సాంకేతికత’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శనివారం ముగిసింది. రాజు మాట్లాడారు.