‘సీఆర్‌డీఏ’ బాధిత రైతులు రాజేష్, చంద్రశేఖర్ ఆవేదన
విజయవాడ (గాంధీనగర్): ల్యాండ్‌పూలింగ్‌లో భూమి ఇవ్వనందుకే సీఆర్‌డీఏ అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే అరటితోటను నేలమట్టం చేశారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు గుండపు రాజేష్, చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సామాజికవేత్త పండలనేని శ్రీమన్నారాయణతో కలసి బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు. అరటితోట ధ్వంసం పై తహసీల్దార్, జేసీ, యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్‌లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని.. పరిహారం రూ.20 లక్ష లివ్వాలని కోరామన్నారు. ఘటనపై స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు.
కోర్టు ధిక్కారమే..
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పనులు చేపట్టరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నప్పటికీ శంకుస్థాపన పేరుతో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమ ణ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పండలనేని శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఎన్‌జీటీ స్టే ఆర్డర్ ఉండగా పూలింగ్‌కు ఇచ్చిన భూములతోపాటు, ఇవ్వని భూముల్లో పనులు చేయడానికి వీల్లేదన్నారు. అరటి తోటల ధ్వంసం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
భూములు ఇవ్వలేదనే అరటి తోటలు ధ్వంసం
Published Fri, Dec 11 2015 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement