అరిస్తే... అరెస్టే! | If any will shout they will be arrested | Sakshi
Sakshi News home page

అరిస్తే... అరెస్టే!

Published Wed, Jan 11 2017 11:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

అరిస్తే... అరెస్టే! - Sakshi

అరిస్తే... అరెస్టే!

 ‘ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మీరు రచ్చ చేసినా ప్రయోజనం ఉండదు. ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమంలో ఎవరైనా అరిస్తే అరెస్టు చేరుుస్తాం. కేసులు పెట్టటంతోపాటు విలువలేని చోట ప్లాట్లు కేటారుుస్తాం. ఆ తరువాత మీకే నష్టం’ అని అనంతవరం రైతులకు అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర స్థారుులో హెచ్చరికలు వచ్చారుు.
 
 సాక్షి, అమరావతి బ్యూరో : అధికార పార్టీ నేతల బెదిరింపులతో తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని కేవలం 15 నిముషాల్లో ముగించేశారు. బెదిరింపులకు భయపడిన గ్రామస్తులు అవగాహన సదస్సు జరక్కపోరుునా.. పక్క ఊరు చెరువులో ప్లాట్లు కేటారుుంచినా.. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా... మాటైనా మాట్లాడకుండా ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని చూస్తుండిపోయారు. తుళ్లూరు మండలం అనంతవరం గురించి తెలియని వారుండరు. రాజధాని ప్రకటించాక ‘అధికార’ అక్రమాలు ఈ గ్రామం నుంచే పురుడుపోసుకున్నారుు. టీడీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మకై ్క పలువురు రైతుల భూములను మాయం చేశారు.

ఎవరూ తెలుసుకోలేరని, తెలుసుకున్నా మాయమైంది సెంట్లే కదా? అడగరని భావించిన టీడీపీ నేతలు అక్రమాలకు తెగబడ్డారు. వారి అక్రమాలను ‘సాక్షి’ పక్కా ఆధారాలతో కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. రైతులకు అన్యాయం జరుగుతుంటే స్పందించాల్సిన ‘ముఖ్య’ నేతలు, ఉన్నతాధికారులు  తమ్ముళ్లకు అండగా నిలబడ్డారు. అక్రమాలపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. మాయమైన సెంట్లు సరిచేయలేదు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్, సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖలు రాశారు. ఫలితం లేకపోగా..ప్లాట్ల కేటారుుంపులోనూ రైతులు మరోసారి మోసపోయారు.

 అవగాహన సదస్సును బహిష్కరించినా....
 రాజధాని రైతులకు ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమానికి ముందు సీఆర్‌డీఏ అధికారులు అవగాహన సదస్సు నిర్వహిస్తారు. అందులో ప్లాట్ల కేటారుుంపు ప్లాన్ గురించి వివరిస్తారు. అభ్యంతరాలు ఉంటే వాటిని సరిచేసి ఆ తరువాత ప్లాట్ల కేటారుుంపు నిర్వహించాలి. అనంతవరం విషయానికి వచ్చేసరికి ఈనెల 5న గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అరుుతే ఆ అవగాహన సదస్సును గ్రామస్తులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మాయమైన సెంట్లు సరిచేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్లాట్లు కేటారుుంచటానికి వీల్లేదంటూ గ్రామస్తులు సదస్సును బహిష్కరించి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

బహిష్కరణను తట్టుకోలేని అధికారపార్టీ నాయకులు, కొందరు అధికారులు రాజధాని కమిటీ సభ్యులతో విజయవాడలో సమావేశమయ్యారు. ఎలాగైనా ప్లాట్ల కేటారుుంపు తంతు ముగించాలని పథకం వేశారు. ఈక్రమంలోనే గ్రామంలో సెంట్లు మాయమైన ముఖ్యమైన వారిని ఫోన్లో, కొందరిని పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల కేటారుుంపు ప్రకటన మొదలు, బాధిత రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నిఘా పెట్టారు. వారికి కూడా ఫోన్లు, బంధువుల ద్వారా తీవ్రంగా హెచ్చరించినట్లు ఓ అధికారి తెలిపారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మంగళవారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంవద్ద ప్లాట్ల కేటారుుంపు కార్యక్రమాన్ని ముగించింది.
 
 పక్క ఊరులో.. చెరువులో ప్లాట్లు
 అనంతవరం రైతులు కొందరికి నెక్కల్లు గ్రామ సరిహద్దులో, మరి కొందరికి తుమ్మల చెరువులో ప్లాట్లు కేటారుుంచారు. అవి కూడా రాజధానికి పూర్తి చివర ప్రాంతంలో కేటారుుంచారు. భవిష్యత్‌లో ఆ ప్రాంతం అభివృద్ధి చెందటానికి సంవత్సరాలు పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమై విక్రరుుంచాలన్నా అక్కడ ప్లాట్లు కొనేవారు తక్కువేనని ఆవేదన చెందుతున్నారు. భూములు వదులుకున్నందుకు మేలుచేయాల్సిన ప్రభుత్వమే... తమకు అన్యాయం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి అని ఇద్దరు మహిళలు కన్నీరు పెట్టుకోవటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement