
చెరువులో ఈత కొడుతున్న దృశ్యం
డోన్ టౌన్: కర్నూలు జిల్లాలో అతిపెద్ద చెరువుల్లో ఒకటైన డోన్ మండల పరిధిలోని వెంకటాపురం తుమ్మల చెరువులో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈతకొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చెరువుకు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ చెరువును వెంకటాపురం గ్రామానికి చెందిన మేడబోయిన మధు, బద్దల కిట్టు, చిట్యాల బోయ హరికృష్ణ ఈదారు. మొదట మధు ఒకటిన్నర గంటలో ఈదగా.. కిట్టు, హరికృష్ణ రెండు గంటల్లో లక్ష్యాన్ని అధిగమించారు. ఇదే సమయంలో ఇంకొకరు ఈత కొట్టేందుకు సిద్ధం కాగా.. విషయం తెలుసుకున్న డోన్ రూరల్ ఎస్‌ఐ మధుసూదనరావు అక్కడికి చేరుకుని అతన్ని వారించారు. అలాగే అక్కడ గుమికూడిన ప్రజలను వెనక్కి పంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment