జూన్ నాటికి శాఖమూరులో రిజర్వాయర్ పార్కు
- రాజధాని వ్యవహారాల సమీక్షలో ముఖ్యమంత్రి
- బుధవారం నుంచి వెలగపూడి కార్యాలయానికి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నగరానికి అలంకారంగా నిలిచే శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సెంట్రల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్న ఈ రిజర్వాయర్ ప్రాంతాన్ని అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్ పార్కుగా తీర్చిదిద్దాల్సివుందని, వివిధ దేశాల నగరాల్లోని నమూనాలను పరిశీలించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని సూచించారు. నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న 24 కిలోమీటర్ల కొండవీటి వాగు వాటర్‌ఫ్రంట్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో రాజధాని వ్యవహారాలపై సీఆర్‌డీఏ, సీసీడీఎంసీ అధికారులు, కన్సల్టెంట్లతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. 97 హెక్టార్లలో ఉన్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దితే అది రాజధానికి మకుటాయమానంగా మారుతుందని చెప్పారు.
రోడ్ క్రాస్ సెక్షన్ ఆకృతులపై సమావేశంలో అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. విద్యుత్, ఇతర అవసరాలకు ఉపయోగించే అంతర్ వాహికల (డక్ట్స్) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సివుందని చెప్పారు. రాజధానిలోని ప్రతి ఇంట్లోనూ వర్షం, వరద నీరు భూమిలోకి నేరుగా ఇంకిపోయే ఏర్పాటు ఉండి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రహదారుల విషయంలో వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని, వీటివల్ల 15 శాతం వ్యయం అధికమైనా ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని శ్రీధర్ తెలిపారు. వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయ ఇంటీరియర్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు చెప్పగా వచ్చే బుధవారం నుంచి విధులకు హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ఫీజులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఇస్తున్నామని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కరెంటు చార్జీల పెంపు ఖాయమే
రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు అనివార్యమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) తేల్చారుు. ప్రజలపై ఎంత భారం మోపాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారుు. సర్కారు ఇచ్చే రారుుతీ ఎంతో తెలిస్తే పెంపు స్పష్టమవుతుంది. విద్యుత్ శాఖ 2017-18 వార్షిక ఆదాయ అవసర నివేదికలపై విజయవాడలో బుధవారం సీఎం సమక్షంలో చర్చలు జరిగారుు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.నేరుగా చార్జీల భారం మోపకుండా పరోక్ష విధానాలను అనుసరించాలని, విద్యుత్ సంస్థల ఆదాయాన్ని పెంచాలని ఆయన సూచించారు.