2019లో చంద్రబాబు ఓడిపోతారు | Bjp Leader Somu Veerraju Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 1:55 PM | Last Updated on Tue, May 15 2018 1:58 PM

Bjp Leader Somu Veerraju Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు రాజీనామ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధానిపై బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాబు నవ్వుతారా అని మండిపడ్డారు. అధ్యక్షుడు అమిత్‌షా తిరుమల వస్తే దాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారా అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

కర్ణాటక ఫలితాలు.. బాబుకు చెంపపెట్టు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు చెంపపెట్టని, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. బీజేపీని ఓడించాలని బాబు ప్రయత్నించారని, కానీ కర్ణాటకలోని తెలుగు ప్రజలు బాబు కుతంత్రాలను తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్‌ తరపున ఉద్యోగులు ప్రచారం చేయడం తప్పని, అభివృద్ధి నినాదమే బీజేపీని గెలిపించిందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రభావం దక్షిణాది మీద ఉంటుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement