
నేటి నుంచి లాంచీ సేవలు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయంలో గురువారం నుంచి లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం మనోహర్ బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. తెలంగాణ(హిల్‌కాలనీ) వైపు నుంచి లాంచీలు నిత్యం జాలీ ట్రిప్పులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాంచీలను తిప్పనున్నట్లు వెల్లడించారు. లాంచీ నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుతో అనుమతి పొందాల్సి ఉందనిన్నారు. అనుమతి కోసం ధరఖాస్తు చేసినట్లు వివరించారు. పర్యాటకులను బట్టీ లాంచీ ట్రిప్పులు వేస్తామని చెప్పారు. అలాగే కంపెనీలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు మరో లాంచీని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.