దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో కొంత ప్రతికూల వాతావరణమే ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 26వేల 561.15 పాయింట్ల వద్ద ట్రెండ్ అవుతుండగా, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,044.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.