విజయవాడలో తొలి పోస్టల్ ఏటీఎం ప్రారంభమైంది.
విజయవాడ : విజయవాడలో తొలి పోస్టల్ ఏటీఎం ప్రారంభమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటిది. విజయవాడ హెడ్ పోస్టాఫీస్‌లో ఏర్పాటుచేసిన ఈ ఏటీఎంను ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంవత్సరాంతానికల్లా మొత్తం 95 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పొదుపు ఖాతాలన్నింటినీ తమ శాఖ కంప్యూటరీకరించిందన్నారు. తద్వారా కోర్ బ్యాంకింగ్ విధానంలోకి తెచ్చి ఖాతాదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.ఈ నెలాఖరుకల్లా హైదరాబాద్‌లో రెండు, సికింద్రాబాద్, కర్నూల్లో ఒక్కొక్కటి చొప్పున ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు.