direct flight
-
అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ ఏదీ
ఏటా 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నా, శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. దీంతో ప్రయాణికులు అమెరికాలో ఎక్కడికి వెళ్లాలన్నా రెండు, మూడు విమాన సర్వీసులు మారాల్సి వస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల్లో 60శాతం మంది అమెరికాకు వెళ్లేవారే ఉంటారు. గతంలో ఎయిర్ఇండియా చికాగో వరకు వారానికి రెండు సర్వీసుల చొప్పున నడిపింది. 350 సీట్లు ఉండే ఆ ఫ్లైట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. 90శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కోవిడ్‌కాలం నుంచి ఆ సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తామని, ఎయిర్ పోర్టువర్గాలు చెప్పినా, ఇప్పటివరకు షికాగో ఫ్లైట్లు తిరిగి ప్రారంభం కాలేదు.3వ స్థానంలో హైదరాబాద్శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 55,000 మంది డొమెస్టిక్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, మరో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికు లు వివిధ దేశాలకు ప్రయాణం చేస్తున్నారు. దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్రిటన్, దోహా, జెడ్డా, మాలే, థాయ్‌లాండ్, జర్మనీ తదితర దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కానీ అమెరికాకు మాత్రం అలాంటి సదుపాయం లేదు.అమెరికా ప్రయా ణికుల్లో ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్ మూడోస్థానంలో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ఏటా సుమారు 10లక్షల మంది హైదరాబాద్ నుంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి లక్షలాది మంది విద్యార్థులతోపాటు ఉద్యోగులు, వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రయాణాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి మాత్రమే అమెరికాకు డైరెక్ట్‌గా విమాన సర్వీసులు ఉన్నాయి.ఏటేటా పెరుగుతున్న ప్రయాణికులు..హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళుతున్న ప్రయాణికుల్లో ఎక్కువశాతం న్యూయార్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో నగరాలకు వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. కోవిడ్ అనంతరం రాకపోకలు మరింత ఎక్కువయ్యాయి. ఐఏటీఏ లెక్కల ప్రకారం కోవిడ్‌కు ముందు 2019లో 8.5 లక్షల మంది ప్రయాణం చేయగా, కోవిడ్ కాలంలో రాకపోకలు నిలిచిపోయేనాటికి 2020లో 3 లక్షల మంది ప్రయాణం చేశారు.ఆ మరుసటి సంవత్సరం పూర్తిగా నిలిచిపోయాయి.ఆంక్షలు తొలగించి అంతర్జాతీయ రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. యూఎస్ నుంచి కొత్తగా వీసాలు లభించకపోయినా, అప్పటికే వీసాలు కలిగిఉన్న ప్రయాణికులంతా కోవిడ్ అనంతరం ఇరువైపులా పెద్దసంఖ్యలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరినట్టు అంచనా. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నడిచిన ఎయిర్ఇండియా సర్వీసులు పునరుద్ధరించినా ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. శంషాబాద్‌లో ఫ్లైట్ ఎక్కేసి నేరుగా షికాగోలో దిగిపోవచ్చు. -
హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండిగో తాజాగా హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య నేరుగా సరీ్వసులను సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉదయం 3.55కు విమానం బయల్దేరి 9.05కు బ్యాంకాక్ చేరుకుంటుంది. ఇరు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడుపుతున్న భారతీయ తొలి విమానయాన సంస్థ తామేనని ఇండిగో ప్రకటించింది. భారత్–బ్యాంకాక్ మధ్య ఇండిగో ప్రతి వారం 37 సరీ్వసులు నడుపుతోంది. -
విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. విశాఖ నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు ఉండబోతున్నట్లు పేర్కొంది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది కూడా చదవండి: On-time Performance: ఆన్‌టైమ్‌లో బెస్ట్.. ఆకాశ ఎయిర్ ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు
చెన్నై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. ఈ రూట్లో రోజూ రెండు ఫ్లయిట్స్ నడపడంతో పాటు సెప్టెంబర్ 26 నుండి చెన్నై–కొచ్చి మధ్యలో కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ వివరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగవంతంగా విస్తరించాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల జర్నీ
సిడ్నీ : ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల ప్రయాణం అనంతరం సుదూర తీరానికి చేరుకున్న తొలి నాన్‌స్టాప్ ప్యాసింజర్ ఫ్లైట్‌గా ఖంటాస్ క్యూఎఫ్7879 అరుదైన ఘనత సాధించింది. న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల 16 నిమిషాల ప్రయాణం అనంతరం ఈ నాన్‌స్టాప్ ఫ్లైట్ ఆదివారం సిడ్నీలో ల్యాండ్ అయింది. లండన్ నుంచి సిడ్నీకి సైతం నాన్‌స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్‌పై ఖంటాస్ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. అమెరికా, బ్రిటన్ నుంచి ఆస్ర్టేలియాకు ఈ విమానయాన సంస్థ మారథాన్ రూట్లలో రెగ్యులర్ విమాన సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. కేవలం 49 మంది మందితో బోయింగ్ 787-9 విమానం ఇంధనం తిరిగి నింపుకునే అవసరం లేకుండా 16,000 కిలోమీటర్లుపైగా ప్రయాణించి న్యూయార్క్ నుంచి సిడ్నీకి చేరుకుంది. ఇది తమ విమానయాన సంస్థతో పాటు ప్రపంచ విమానయాన రంగంలోనూ చారిత్రక ఘట్టమని ఖంటాస్ సీఈవో అలన్ జోస్ అభివర్ణించారు. భిన్న టైమ్‌జోన్స్‌ను దాటి ప్రయాణీకులు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ప్రయాణీకులు, విమాన సిబ్బందిపై జెట్‌ల్యాగ్ ప్రభావానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖంటాస్ రెండు ఆస్ర్టేలియన్ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకుంది. ఖంటాస్ గత ఏడాది ఆస్ర్టేలియాలోని పెర్త్ నుంచి లండన్‌కు తొలి డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టగా 17 గంటల ప్రయాణంతో కూడిన ఈ విమానమే ప్రపంచంలోనే లాంగెస్ట్ పాసింజర్ విమానంగా నమోదైంది. -
అక్కడికి డైరెక్ట్ విమానం
న్యూఢిల్లీ: అమృత్సర్–బర్మింగ్‌హామ్ మధ్య ఎయిరిండియా నాన్‌స్టాప్ విమాన సర్వీసులు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సేవలు 8 ఏళ్ల క్రితం నిలిచిపోయాయి. తాజాగా సేవల పునరుద్ధరణతో ఇకపై బోయింగ్ 787 విమానం వారానికి రెండుసార్లు(మంగళవారం, గురువారం) ఈ మార్గంలో నడుస్తుంది. పంజాబ్, యూకే మధ్య నేరుగా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది తామేనని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. అమృత్సర్ నుంచి తొలి విమానాన్ని విమానయాన మంత్రి విజయ్ సాంప్లా, ఎంపీలు గుర్జీత్ సింగ్, శ్వాయిత్ మాలిక్‌లు ప్రారంభించారు. -
ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు నాన్‌స్టాప్ విమానం
వాషింగ్టన్: భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి నేరుగా చేరుకునే తొలి ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం డులెస్ విమానాశ్రయంలో ల్యాండైంది. విమానానికి ఎయిర్‌పోర్టులో అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ విమానంలో అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్న, ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని, కమర్షియల్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ తదితరులు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లారు. 238 సీట్లు ఉన్న బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానాన్ని జూలై 9, 17 తేదీల్లో నడపనున్నారు. ఇందులో 8 ఫస్ట్ క్లాస్ సీట్లు, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు ఉన్నాయి.