ఎయిరిండియా విమానాలు (ఫైల్)
న్యూఢిల్లీ: అమృత్‌సర్–బర్మింగ్‌హామ్ మధ్య ఎయిరిండియా నాన్‌స్టాప్ విమాన సర్వీసులు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సేవలు 8 ఏళ్ల క్రితం నిలిచిపోయాయి. తాజాగా సేవల పునరుద్ధరణతో ఇకపై బోయింగ్ 787 విమానం వారానికి రెండుసార్లు(మంగళవారం, గురువారం) ఈ మార్గంలో నడుస్తుంది.
పంజాబ్, యూకే మధ్య నేరుగా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది తామేనని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. అమృత్‌సర్ నుంచి తొలి విమానాన్ని విమానయాన మంత్రి విజయ్ సాంప్లా, ఎంపీలు గుర్జీత్ సింగ్, శ్వాయిత్ మాలిక్‌లు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment