ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి నేరుగా చేరుకునే తొలి ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం డులెస్ విమానాశ్రయంలో ల్యాండైంది.
వాషింగ్టన్: భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి నేరుగా చేరుకునే తొలి ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం డులెస్ విమానాశ్రయంలో ల్యాండైంది. విమానానికి ఎయిర్‌పోర్టులో అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ విమానంలో అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్న, ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని, కమర్షియల్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ తదితరులు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లారు.
238 సీట్లు ఉన్న బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాన్ని జూలై 9, 17 తేదీల్లో నడపనున్నారు. ఇందులో 8 ఫస్ట్ క్లాస్ సీట్లు, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు ఉన్నాయి.