సాక్షి, చెన్నై: వానగరం శ్రీవారు వెంకటాచలపతి కల్యాణ మండ పం వేదికగా గురువారం అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 40 ఎంపీ సీట్లు లక్ష్యంగా ఆ పార్టీ కార్యాచరణ సిద్ధమవుతున్నా, తుది నిర్ణయం ఎటు వైపు మళ్లుతుందో అన్న ఎదురు చూపుల్లో వామపక్షాలు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల సందడి రాష్ట్రంలో మొదలైంది. నాలు గు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోం దన్న సంకేతాలకు బలం చేకూరింది. దీంతో రాష్ట్రంలోని ఆ పార్టీ లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. మరోవైపు
తమది ఒంటరి సమరమేనని డీఎంకే అధినేత కరుణానిధి తేల్చారు. అయితే, లోక్‌సభ ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యడం, ఆ కమిటీ తుది నివేదిక ఆధారంగా డీఎంకే ప్లేటు మార్చే అవకాశాలు కూడా ఉన్యా.
డీఎండీకే మల్లగుల్లాలు పడుతుంటే, కాంగ్రెస్ అయోమయంలో పడింది. అధికార అన్నాడీఎంకే తన వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రంలో చక్రం తిప్పడం లక్ష్యంగా 40 సీట్ల కైవశం తమ కర్తవ్యం అన్నట్టు ఆ పార్టీ వర్గాలు దూసుకెళుతున్నారుు. దీంతో ఆ కూటమిలో తామున్నామని చెప్పుకుంటున్న వామపక్షాలకు సంశయం మొదలైంది. తమను అన్నాడీఎంకే అక్కున చే ర్చుకుంటుందా..? లేదా తిరస్కరిస్తుందా..? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఈ ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల వైపు జయలలిత తలొగ్గేనా, లేదా బీజేపీకి స్నేహ హస్తం ఇచ్చేనా అన్నది సర్వ సభ్య సమావేశంలో తేలబోతోంది.
నేడు సర్వ సభ్య సమావేశం : వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ కల్యాణ మండపం వేదికగా తన నిర్ణయం ఏమిటో సీఎం జయలలిత ప్రకటించబోతున్నారు. సర్వసభ్య సమావేశం అంటే, అన్నాడీఎంకే నాయకులకు దడ. అధినేత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయోనన్న బెంగ వారిలో నెలకొంది. లోక్ సభ ఎన్నికలపై నిర్ణయం ఎలా ఉన్నా, పార్టీ పరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం అయ్యే ఈ సమావేశం కోసం సర్వం సిద్ధం చేశారు. జయలలితకు ఆహ్వానం పలికే ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఈ సమావేశం నిమిత్తం చెన్నైకు తరలి వస్తున్నారు.