చివ్వెమ్ల మండలం తిమ్మాపురం పంచాయతీ జగ్గుతండాలో విషాదం చోటుచేసుకుంది.
చివ్వెమ్ల మండలం తిమ్మాపురం పంచాయతీ జగ్గుతండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన దారావత్ ఉమ(26) అనే వివాహిత తన ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము కాటేసింది. దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. అక్కడ వైద్యులు తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు సమీపంలోకి రాగానే వివాహిత ప్రాణాలొదిలింది.