
పోస్టింగ్‌లు ఇప్పించండి
కరీంనగర్ సిటీ : అర్హత పొంది నెలలు గడుస్తున్నా తమకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని, వెంటనే నియామక ఉత్తర్వు లు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శులుగా అర్హత సాధించిన అభ్యర్థులు జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో మొరపెట్టుకున్నారు. శుక్రవారం అభ్యర్థులు శ్యాంసుం దర్, జయరాజ్, మారుతి, శ్రీనివాస్ తదితరులు జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఫిబ్రవరి 23 న రాత పరీక్ష జరిగిందని,మార్చి 22న ఫలితాలు వెలువడ్డాయన్నారు.
జిల్లాలో 88 మంది అర్హత సాధించామని, జూన్ 10,20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. ఇప్పటివరకు తమకు పోస్టింగ్‌లు మా త్రం ఇవ్వడం లేదన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉందని ఆవేదన చెందారు. వెంటనే పోస్టింగ్‌లు ఇప్పించేలా చూడాలని కోరారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తానని జెడ్పీ చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పాతూరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చోల్లేటి శ్రీనివాస్ కోరారు. ఈమేరకు వారు శుక్రవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమకు వినతిపత్రం సమర్పించారు. బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని కోరారు.
ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని, నెలనెలా స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్‌టైం స్వీపర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. వారి వెంట ఆసంఘం నాయకులు సత్యనారాయణస్వామి, శ్రీనివాస్, కేతిరి తిరుపతిరెడ్డి, పంపయ్య, శ్రీధర్, రాంచంద్రం తదితరులున్నారు.