ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దాం | Uma in congratulatory body of employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దాం

Published Fri, Jul 7 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

Uma  in congratulatory body of employees

► జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
► జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ


కరీంనగర్‌: సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కోరారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జెడ్పీలో ఉద్యోగులు అభినందనసభ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ మూడేళ్లలో అందరి సహకారంతో జిల్లాను ప్రగతి వైపు నడిపించామని, భవిష్యత్‌లోనూ మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా తుల ఉమ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఉమను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. జెడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు ఎడ్ల శ్రీని వాస్, సిద్దం వేణు, వీర్ల కవిత, లచ్చిరెడ్డి, పూర్ణిమ, ఆకుల లలిత, శోభారాణి, వీరమల్ల శేఖర్, గంగుల రజి త, కో ఆప్షన్‌ సభ్యులు జమీలొద్దీన్‌ పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ సీఈవో  పద్మజారాణి ఆధ్వర్యంలో జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించారు. పీఆ ర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు రా జిరెడ్డి, అశోక్, శ్రీనివాస్, జగదీశ్వరాచారి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement