
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో శుక్రవారం మూడేళ్ల బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరెల్ తన బిడ్డ అస్‌కియా హనీ(3)తో షాపింగ్ నిమిత్తం సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు వచ్చింది. షాపింగ్ చేస్తుండగా చిన్నారి షాపింగ్ మాల్‌లో ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత బాలిక కనిపించలేదు.
ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు షాపింగ్‌మాల్‌లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. చిన్నారిని ఇద్దరు బురుకలు ధరించిన మహిళలు బయటకు ఎత్తుకెళుతున్నట్లు కనిపించింది. పోలీసులు రోడ్డు వెంబడి, బస్టాండ్ , రైల్వేస్టేషన్ వైపు ఉన్న సీసీపుటేజీలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment