బాలిక కిడ్నాప్.. ఆపై పెళ్లి.. మతమార్పిడి! | Girl allegedly abducted, forcibly converted in Bihar | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్.. ఆపై పెళ్లి.. మతమార్పిడి!

Published Tue, Sep 2 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

బాలిక కిడ్నాప్.. ఆపై పెళ్లి.. మతమార్పిడి!

బాలిక కిడ్నాప్.. ఆపై పెళ్లి.. మతమార్పిడి!

భాఘల్‌పూర్: ఒక బాలికను కిడ్నాప్ చేసిన కొంతమంది దుండగులు ఆమెను బలవంతంగా మత మార్పిడి చేయించిన ఘటన బీహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. రాష్ట్రంలో పదకొండో తరగతి చదువుతన్న 17 ఏళ్ల సోనురాణి ఈ ఏడాది ఏప్రిల్ 30న భాఘల్‌పూర్ జిల్లాలో స్వగ్రామం ధువాబేకు వెళ్లగా అక్కడ ఆమెను నలుగురు యువకులు అపహరించారు. అనంతరం నిందితుల్లో ఒకరైన మోంటీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తనను కొట్టడంతోపాటు, రెడ్‌లైట్ ప్రాంతంలో విక్రయిస్తామని బెదిరించాడు. ఒకవేళ మత మార్పిడి చేసుకోకపోతే బాలిక కుటుంబ సభ్యులను కూడా చంపుతానని భయభ్రాంతులకు గురి చేసి ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మార్చాడు.

 

అనంతరం వారి చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఇంటికి చేరి తల్లికి విషయంగా చెప్పగా మే 31వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement