యువతి కిడ్నాప్.. ఐదుగురిపై కేసు నమోదు | girl kidnap, case registered against five | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్.. ఐదుగురిపై కేసు నమోదు

Published Sun, Apr 30 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

girl kidnap, case  registered against five

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతిని కిడ్నాప్‌ చేసిన ఘటనలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పి.వీరబాబు కథనం ప్రకారం.. ఈ నెల 23న వాడ్రేవుపల్లికి చెందిన ఎస్‌.సత్యనారాయణ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. పరిసర గ్రామాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో యువతి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మానేపల్లి  గ్రామానికి చెందిన  దుర్గాప్రసాద్‌ తన కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడని, అతడికి మరో నలుగురు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిందితుడు దుర్గాప్రసాద్‌తో పాటు, మరో నలుగురిపై  శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement