బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ : బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసిన బాలికను జన్మభూమి ఎక్స్ప్రెస్లో విశాఖకు తరలిస్తుండగా పోలీసులు వారిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే రాజు అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.