వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ చిన్నారి | Girl acquittal safely from prostitution house in warangal district | Sakshi
Sakshi News home page

వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ చిన్నారి

Published Sat, Feb 8 2014 2:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Girl acquittal safely from prostitution house in warangal district

వరంగల్: రహాస్యంగా వ్యభిచార కూపాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠా చిన్నారులపై పంజా విసురుతోంది. అభం శుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న ముఠా బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. వీరి అగడాలకు పసిమెగ్గల జీవితాలు బలైపోతున్నాయి.

 

తాజాగా వరంగల్ జిల్లాలో వ్యభిచార కూపం నుంచి ఓ 12 ఏళ్ల చిన్నారి తప్పించుకుని బయటపడటంతో  ముఠా బండారం కాస్తా బట్టబయలైంది. వ్యభిచారం నిర్వహించే ముఠా సభ్యుల కన్నుకప్పి తప్పించుకున్న బాలిక భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించింది.  బాలిక ఇచ్చిన సమాచారం మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement