దీప్తిశ్రీ కిడ్నాప్‌ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం! | Kakinada Girl Kidnap Mystery, Dharmadi Satyam Team Started Search Operation | Sakshi
Sakshi News home page

దీప్తిశ్రీ కిడ్నాప్‌ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం బృందం

Published Sun, Nov 24 2019 1:19 PM | Last Updated on Sun, Nov 24 2019 4:29 PM

Kakinada Girl Kidnap Mystery, Dharmadi Satyam Team Started Search Operation - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు.  చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

జగన్నాథపురంలో చిన్నారి చదువుతోన్న స్కూల్‌ ఆవరణంలో కిడ్నాప్‌కు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న దీప్తిశ్రీని సవతితల్లి తీసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తల్లి తీసుకెళ్లడంతో తాము ఏమి అడగలేకపోయామని అంటున్నారు. ఆ తర్వాత చిన్నారి కనిపించడం లేదని తండ్రి తమ దగ్గరకు వచ్చారని స్కూల్‌ సిబ్బంది చెబుతున్నారు. శాంతికుమారినే ఏమైనా చేసి ఉంటుందంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement