
సాక్షి, కాకినాడ: చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసును ఛేదిస్తామని, మరో రెండు, మూడు రోజులు సమయం పట్టొచ్చని కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సవతి తల్లే చంపేసిందన్నది కేవలం వదంతి మాత్రమేనని, ఆ కోణంలోనూ విచారణ చేస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాయని వెల్లడించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పాఠశాల నుండి దీప్తిశ్రీ అపహరణకు గురయిందన్నారు. కొన్ని చోట్ల సిసి కెమెరాలు సరిగా పని చేయకపోవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని డిఎస్పీ తెలిపారు.
చిన్నారి కిడ్నాప్ ఘటనపై స్పందించిన మంత్రి వనిత..
చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
(చదవండి: దీప్తిశ్రీ కిడ్నాప్ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం బృందం)
Comments
Please login to add a commentAdd a comment