కంబాలచెరువు(రాజమహేంద్రవరం): సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ ఆడిన కిడ్నాప్ నాటకానికి పోలీసులు శుక్రవారం తెర దించారు. వారి కథనం ప్రకారం.. తనను ఎవరో బెదిరించారని, ఈ అవమానం భరించలేకపోతున్నానని భార్య కౌసల్యకు చెప్పిన ప్రసాద్ తన బైక్, సెల్‌ఫోన్ ఇంటి వద్ద విడిచిపెట్టి రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లిపోయాడు. దీనిపై కౌసల్య ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్, అతడి స్నేహితుడు పినిపే సందీప్ కాకినాడ సమీపంలోని రాయుడుపాకలు వద్ద ఉన్నట్టు కనుగొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..)
అక్కడికి వెళ్లి ఇద్దరినీ పట్టుకుని, విచారించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడించారు. కొంతమంది ఇచ్చిన ఆదేశాలతో తాను కావాలనే పక్కా వ్యూహంతో కిడ్నాప్ డ్రామా ఆడానని ప్రసాద్ తెలిపాడు. కులాల మధ్య చిచ్చు పెట్టి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈవిధంగా చేసినట్టు తెలిపాడు. దీనిపై లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుల వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన మరికొంతమందిని తమ దర్యాప్తులో కనుగొన్నామని, మరిన్ని సాక్ష్యాధారాలతో వారిని అరెస్టు చేయనున్నామని చెప్పారు.(చదవండి: ఏకగ్రీవాలపై ఇదేం పంచాయితీ?)
Comments
Please login to add a commentAdd a comment