స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలిక కిడ్నాప్ | 9 years old girl sexually assaulted Bangalore | Sakshi
Sakshi News home page

స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలిక కిడ్నాప్

Published Sun, Jan 5 2014 8:48 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

9 years old girl sexually assaulted Bangalore

బెంగళూరు:  అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికపై దుర్మార్గులు లైంగిక దాడికి తెగబడ్డారు. బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. బేగూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు బాలిక ముఖానికి టవల్‌చుట్టి కిడ్నాప్ చేసి వాహనంలో ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.

 

తిరిగి సాయంత్రం ఆరు గంటల సమయంలో బాలిక వ ుుఖానికి టవల్ చుట్టి సమీపంలోని రోడ్డులో వదిలిపెట్టి పరారయ్యారు. టవల్ తొలగించిన బాలిక రాత్రి 7.30 గంటలకు ఇంటికి చేరుకుంది. అప్పటి వరకు బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు, బాలిక ఇంటికి చేరుకోవడంతో విషయాన్ని ఆరా తీశారు. రక్తస్రావం కావడంతో బాలికను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement