బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు | case file on girl kidnap | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు

Published Tue, May 30 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

case file on girl kidnap

పామిడి : మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వితంతువు రాజమ్మ కూతురు అశ్విని(14) కిడ్నాప్‌ కేసులో కర్నూలు జిల్లా డోన్‌ వాసి దాసరి మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు. వివరాలు.. తల్లితో పాటు అశ్విని బతుకుదెరువు కోసం రాజంపేటలోని పుల్లంపేటకు కూలి పనులకు వెళ్లింది. అక్కడ బాలికతో దాసరి మహేష్ పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 11న పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి అతడు వెంట తీసుకెళ్లాడు.

అక్కడకు వెళ్లిన తర్వాత మోసపోయినట్లు బాలిక గ్రహించింది. వెంటనే అతడి బారి నుంచి తప్పించుకుని ఈనెల 25న బాలిక స్వగ్రామానికి వచ్చింది. తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మహేష్‌ను ఎద్దులపల్లిరోడ్డులో అదుపులోకి తీసుకుని, అతడిపై 420 కేసు నమోదు చేసి గుత్తి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement