aswini
-
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో ల్యాండ్‌మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్‌లో టాస్క్‌ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్‌లో భోలే షావళితో మంచి పెయిర్‌గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్‌లో నటించిన సమయంలో పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం. షూటింగ్‌కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్‌పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్‌తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బిగ్ బాస్7 : సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ (ఫొటోలు)
-
రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల
బిగ్‌బాస్ హౌసులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఐదుగురు కొత్తోళ్లు వచ్చారు. వాళ్లలో ఓ హాటెస్ట్ బ్యూటీ ఉంది. ఆదివారం ఆమె ఒంపుసొంపులు చూసి అబ్బా సూపర్ అనుకున్న ప్రేక్షకులు.. సోమవారం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో రామా అనుకున్నారు. ఓ లేడీ కంటెస్టెంట్ వల్ల ఇలా జరిగింది. అలానే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమైందనేది Day 36 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) పుల్ల పెట్టిన బిగ్‌బాస్ కొత్తగా వచ్చిన ఐదుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చేయడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. వాళ్లని చూపించడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఉదయం లేవగానే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని చెప్పాడు. అలానే హెడ్స్ ఆఫ్ లగేజ్ గేమ్‌లో భాగంగా హౌసులో ఉన్నవాళ్లందరికీ కలిపి కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తిరకాసు పెట్టేశాడు. నామినేషన్స్ రచ్చ తొలుత పోటుగాళ్లు మాత్రమే నామినేషన్ చేస్తారని.. గత ఐదువారాలుగా ఉన్న ఇంటి సభ్యుల్ని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. వీళ్లలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నయని పావని - తేజ, అమరదీప్ భోలె షావళి - అమరదీప్, సందీప్ అశ్విని - అమరదీప్, శోభాశెట్టి పూజామూర్తి - తేజ, యవర్ అర్జున్ - సందీప్, అమరదీప్ (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) ఇకపోతే నామినేషన్స్‌లో భాగంగా అమరదీప్ స్వార్థంతో ఆడుతున్నాడని అశ్విని చెప్పింది. అలానే శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని చెప్పింది. దీంతో శోభా ఫైర్ అయింది. అసలు గ్రూపిజం అంటే ఏంటి? నేను ఎవరితో గ్రూపులో ఉన్నానంటూ రెచ్చిపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పోటుగాళ్ల నామినేషన్ పూర్తయిన తర్వాత.. బట్టల విషయంలో అశ్విని- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌కి తానే మహారాణి అనుకుంటుందా అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌసులో ఆమె పాలిటిక్స్ నడిపిస్తోందని చెప్పింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లందరూ మాట్లాడుకుని తనని సెపరేట్ చేసేశారని బోరున ఏడ్చేసింది. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇక పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తిచేసిన తర్వాత ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - అశ్విని, యవర్ శోభాశెట్టి - అమరదీప్, అశ్విని శివాజీ - అమరదీప్, పూజామూర్తి తేజ - సందీప్, నయని పావని ప్రియాంక - తేజ, అశ్విని సందీప్ - తేజ, అర్జున్ యవర్ - శోభాశెట్టి, పూజామూర్తి ప్రశాంత్ - నయని పావని, అమరదీప్ ఈ నామినేషన్లో భాగంగా అమరదీప్, అశ్వినిని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు.. మీరు కన్నింగ్, సెల్ఫిష్ అని పదాలు నా గురించి వాడటం సరికాదని అశ్విని కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు శోభాశెట్టి.. అశ్విని నామినేట్ చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని గట్టిగా ఏడ్చేసింది. తనని పక్కనున్నవాళ్లు ఓదారుస్తున్నా సరే ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో హాట్‌హాట్‌గా కనిపించి వావ్ అనిపించిన అశ్విని.. ఎలిమినేషన్స్ అనేసరికి ఏడవటం చాలామంది కుర్రాళ్లు అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!) -
కట్టుకున్న భర్తే కాలయముడు
-
అనుమానంతో భార్యను చంపేశాడు..
సాక్షి, విజయవాడ రూరల్: భర్తే కాలయముడై భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయవాడ రూరల్ మండలంలో జరిగింది. అనుమానమే పెనుభూతంగా మారింది. దీంతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు రామ్‌నగర్‌కు చెందిన సోమేలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అశ్విని మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోమేలు గొడవ పడుతున్నాడు. ఇదే విషయంపై గతరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతడు శనివారం ఉదయం తిరిగి వచ్చాడు. ఉదయం తలుపు తీసిన భార్యను చూడగానే సోమేలు పట్టరాని కోపంతో రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అశ్విని అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం సోమేలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అంతేకాకుండా భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోలీసులకు అందచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా అశ్వినిని చంపేశానంటూ అల్లుడు ఫోన్ చేసి చెప్పాడని, అయితే తాము నమ్మలేదని, కోపంలో అలా చెబుతున్నాడేమో అనుకున్నామంటూ మృతురాలి తల్లి విలపించింది. కూతురు, అల్లుడికి గొడవ జరిగిందని, ఇదే విషయం ఫోన్లో చెప్పారని, ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పామని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆమె పేర్కొంది. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ ముఖ్య తారలుగా జైరామ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అద్భుతమైన కథని జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు జై రామ్‌వర్మ. ‘‘మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉంది’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్, సమర్పణ: పార్వతి. -
బహుభాషా లేఖిని
చేతిరాతను బట్టి మనిషి గుణగణాలను అంచనా వెయ్యొచ్చని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీరాత పరీక్షల్లో మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతి రాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ అవుదామనే ఆలోచన నుంచి న్యూరో సైంటిస్ట్ కావాలనేలక్ష్యాన్ని నిర్దేశించింది. అలా చేతిరాతతో జీవితానికి చక్కటి బాటను దిద్దుకున్నారు సంగరాజు అశ్విని. తిరుపతిలోని ‘మేక్ మై బేబీ జీనియస్’(ఎంఎంబీజి) స్కూల్ యజమాని సంగరాజు భాస్కర రాజు కుమార్తె అశ్విని. తన లక్ష్యం మారడానికి వెనుక ఉన్న కారణాలను సాక్షితో పంచుకున్నారామె. సెలవుల్లో ఆలోచన మారింది ‘‘జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అందుకు అనుగుణంగానే పదో తరగతి వరకు చదివాను. మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో ఎంబైపీసీ గ్రూపులో చేరాను. నాన్న చేతిరాత నిపుణులు కావడంతో వేసవి సెలవుల్లో చేతిరాతపై పిల్లలకు శిక్షణ శిబిరం నిర్వహించేవారు. అందమైన చేతి రాత కోసం నాన్న దగ్గరే శిక్షణ తీసుకున్నా. అయితే అందరిలా కాకుండా భిన్నంగా గుర్తింపు పొందాలనుకున్నా. అందమైన చేతిరాత కోసం నాన్న చాలా పరిశోధనలు చేశారు. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ప్యాటర్న్స్ (పలక లాంటి 8 పరికరాలు). ప్యాటర్న్స్‌లో రెండు చేతులతో రాయడం సాధన చేశాను. అదనంగా మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ సాధన చేశాను. కుడి చేతితోనే కాకుండా ఎడమ చేతితో రాయడం కూడా సులభంగా నేర్చుకున్నా. రెండు చేతులతో 21 భాషలు ‘‘సాధారణంగా ఒకటి, రెండు లేక మూడు భాషల్లో రాయగలం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడాన్ని నేర్చుకున్నా. నాన్నకు చెప్పడంతో నాకు ప్రత్యేకంగా 18 భాషలకు సంబంధించిన పలకలు (ప్యాట్రెన్స్) చేయించారు. అందులో 18 భారతీయ భాషలు, మిగిలిన మూడు విదేశీ భాషలు. భారతీయ భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపురి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంథలి, సింధి, ఉర్దూలతోపాటు, విదేశీ భాషలు ఇంగ్లీషు, నేపాలి, అరబిక్‌లో రాయడం సాధన చేశాను. అలా మొత్తం 21 భాషల్లో కుడి, ఎడమ చేతులతో రాయగలను. మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ రైటింగ్ కూడా వచ్చు. మిర్రర్ రైటింగ్ ఇండియాలో కొంతమంది రాయగలుగుతున్నప్పటికీ, అప్‌సైడ్ డౌన్ రైటింగ్ మాత్రం అసాధారణమే. డిజార్డర్ పిల్లలకు బోధన ‘‘చేతిరాతలో నిపుణులైన నాన్న మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో పాఠశాలను నెలకొల్పారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్(ఏడీడీ), ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్(ఏఎస్డీ) సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు బోధించడం ఈ స్కూల్ ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ పెద్దగా పట్టించుకోరు. వారి సమస్యలు అర్థంకావు. వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనుకంజలోనే ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి చదువు అందించి సమాజంలో అందరిలా తీర్చిదిద్దాలన్నదే నాన్న కోరిక, నా లక్ష్యం కూడా అదే. దాని కోసం న్యూరో సైంటిస్టు కావాలనుకుంటున్నా. లక్ష్యం మార్చిన ఘటన ‘‘తిరుపతి భవానీనగర్‌లో నివాసముంటున్న మోహన్‌మురళి చంద్రగిరి పీహెచ్సీలో సూపర్వైజర్. ఆయన కుమారుడు దేవనాగ్కు అప్పుడు 16ఏళ్లు. పుట్టినప్పటి నుంచే దృష్టి, నత్తి. దీంతో చదువులో వెనుకబడ్డాడు. ఆ వయసుకు పదో తరగతి పూర్తయి ఉండాలి. కానీ అతను ఎనిమిదో తరగతి చదువుతున్నా కనీసం పదాలు, ఎక్కాలు, గుణింతాలు ఏవీ రావు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా మా పాఠశాలలో చేర్పించారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉండేది. పిల్లవాడి సమస్యను గుర్తించి ఇక్కడ వివిధ రకాల శిక్షణ ఇచ్చాం. దీంతో అతను రెండేళ్లకే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సాధించాడు. ఈ సంవత్సరం ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ప్యారడీ పాటలు రాస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేం. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మొదట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని మార్చుకోవడానికి కారణం ఈ ఘటనే. న్యూరో సైన్స్ చదివి న్యూరో సైంటిస్ట్ అవుదామని నిశ్చయించుకున్నా. నాన్నకు తోడుగా ఉంటూ సహకారం అందించాలనుకున్నాను. దీనికోసం ఇంటర్లో ఎంబైపీసీ తీసుకున్నా. డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్నా. డిగ్రీ మొదటి సెమిస్టర్ వరకు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాను. ఆ తరువాత పాఠశాలలోనే పిల్లలకు బ్రెయిన్ జిమ్‌లో శిక్షణ ఇస్తూ డిగ్రీ పూర్తి చేశాను. న్యూరో సైన్స్ కోర్సు ఇండియాలో లేదు. విదేశాలకు వెళ్లాలి. దీనికోసం ఇక్కడే సైన్స్‌కు అనుబంధంగా ఉన్న పీజీ కోర్సు చేసి, ఆ తరువాత న్యూరో సైన్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు అశ్విని. యంగ్ అచీవర్ అవార్డు చేతిరాతను సాధనం చెయ్యడం చదువులో రాణించడానికి తనకు చాలా దోహదపడిందని అంటారు అశ్విని. ‘‘రెండు చేతులతో విభిన్న భాషల్లో విభిన్నంగా రాయడంతో మల్టిపుల్ స్కిల్స్ పెరిగాయి. నాలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతతోపాటు ఆత్మస్థైర్యం పెంపొందింది. అప్పటి వరకు గంట సమయంలో చదివి గుర్తు పెట్టుకునే అంశాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నా. దీంతో చదువుకోవడానికి సమయం చాలా కలిసొచ్చింది’’ అన్నారు అశ్విని. విలక్షణమైన ఆమె చేతిరాతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్.. ఇలా ఆయా సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. ఇటీవల విజయవాడలో యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు. – ఎస్.శశికుమార్, సాక్షి, తిరుపతి -
మనదేశంలో ‘డబుల్స్’ కష్టం: అశ్విని
ఢిల్లీ: మనదేశంలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వాపోయింది. ఆదివారం పెళ్లి చేసుకున్న ఆమె పీబీఎల్‌లో ఢిల్లీ డాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘యువ క్రీడాకారులు ఈ ఫార్మాట్లో అడుగుపెట్టడానికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. కొత్తగా ఈ ఆటలో అడుగుపెడుతున్న క్రీడాకారులు డబుల్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. దానికి ప్రధాన కారణం మన వద్ద డబుల్స్ ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు లభించకపోవడమే’ అని 2011 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గుత్తా జ్వాలతో కలిసి కాంస్యం సాధించిన పొన్నప్ప తెలిపింది. జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన సింగిల్స్ క్రీడాకారులకు కార్లు బహుమతులుగా ఇచ్చి డబుల్స్ క్రీడాకారులను విస్మరించడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గతంలో గుత్తాజ్వాల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వివాహిత ఆత్మహత్య
పామిడి: వంకరాజుకాల్వ గ్రామంలో అశ్విని (22) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన మేరకు... గుంతకల్ మండలం దోసలుడికి గ్రామానికి చెందిన అక్క నాగేశ్వరమ్మ కుమార్తె అశ్వినిని పామిడి మండలం వంకరాజుకాల్వకు చెందిన శెట్టి బలిజ రామాంజనేయులు నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. రామాంజనేయులు బుధవారం ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య అశ్విని ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఉండటం కనిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దింపి పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కడుపునొప్పి భరించలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు
పామిడి : మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వితంతువు రాజమ్మ కూతురు అశ్విని(14) కిడ్నాప్ కేసులో కర్నూలు జిల్లా డోన్ వాసి దాసరి మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు. వివరాలు.. తల్లితో పాటు అశ్విని బతుకుదెరువు కోసం రాజంపేటలోని పుల్లంపేటకు కూలి పనులకు వెళ్లింది. అక్కడ బాలికతో దాసరి మహేష్ పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 11న పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి అతడు వెంట తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మోసపోయినట్లు బాలిక గ్రహించింది. వెంటనే అతడి బారి నుంచి తప్పించుకుని ఈనెల 25న బాలిక స్వగ్రామానికి వచ్చింది. తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మహేష్‌ను ఎద్దులపల్లిరోడ్డులో అదుపులోకి తీసుకుని, అతడిపై 420 కేసు నమోదు చేసి గుత్తి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
యువత ఆలోచనలకు అద్దం పట్టే 'అమీర్‌పేట లో'
కథలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకు కూడా పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే కొత్త ఆలోచనలతో యువతరాన్ని ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అమీర్‌పేటలో. ఈ తరం యువత ఆలోచనలు, ఆశయాలే కథా వస్తువుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు యువతకు సందేశాన్ని అందిస్తుంది. కథ విషయానికి వస్తే.. అమీర్‌పేట హాస్టల్లో ఉండే వివేక్(శ్రీ), లిబుగా చెప్పుకునే లింగబాబు, చిట్టి, వెంకట్రావులు పెద్ద పెద్ద ఆశయాలతో సిటీకి వస్తారు. వెంకట్రావుకు ఎలాగైన తన ఊరి వారి ముందు ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నదే ఆశయం. చిట్టీ, లిబులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాలి, వివేక్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఇలా ఉన్నత ఆశయాలు ఉన్న ఈ యువత.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరు ఎలా విజయం సాధించారు అన్నదే సినిమా కథ. యూత్‌ను అలరించే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే నేటి యువతరం చెడు స్నేహాం వల్ల ఎలాంటి తప్పటడుగులు వేస్తోందో చూపించారు. అదే సమయంలో ఓ మంచి స్నేహితుడు దొరికితే అప్పటి వరకు చెడ్డ దారిలో నడిచిన వారుకూడా ఎలా మంచి మార్గంలోకి వస్తారో వినోదాత్మకంగా చూపించారు. ముఖ్యంగా మినిమమ్ బడ్జెట్‌తో యూత్ ఫుల్ కథా కథనాలతో సినిమాను తెరకెక్కించిన శ్రీ ఆకట్టుకున్నాడు. హీరోగానూ, దర్శకుడిగాను మంచి మార్కులు సాధించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు కొత్త వారే అయినా తమ పరిథి మేరకు పరవాలేదనిపించారు. ఫస్ట్‌హాప్ అంతా యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా ఉన్నాయి. కథా పరంగా రొటీన్‌గా అనిపించే అమీర్‌పేటలో యూత్‌కు మాత్రం బాగానే కనెక్ట్ అవుతోంది. -
ప్రపంచ వాణిజ్య సంస్థకు శ్రీకర్‌రెడ్డి బదిలీ
* ఆయన హయాంలోనే భారీగా పాస్‌పోర్ట్ సంస్కరణలు * 24 గంటల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ కె.శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణి జ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు బదిలీ అయ్యారు. ఇకపై డబ్ల్యూటీఓలో భారత దేశానికి సంబంధించి జరిగే వాణిజ్య కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం కొండగడపకు చెందిన శ్రీకర్‌రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2001లో ఐఎఫ్ఎస్కు ఎంపికై ఢిల్లీలోని విదేశాంగశాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. అప్పటికే అస్తవ్యస్థంగా ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీపై ఆయన దృష్టి సారించి తీవ్ర సంస్కరణలు చేపట్టారు. వేళ్లూనుకునిపోయిన దళారీ వ్యవస్థను పూర్తిగా తొలగించగలిగారు. ఆయన వచ్చేనాటికి పెండింగ్‌లో ఉన్న లక్ష పాస్‌పోర్ట్‌లను దశల వారీగా జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతోపాటు, ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించడంలోనూ కీలక పాత్ర పోషించారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌ను 24 గంటల్లోనే జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్‌ల జారీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన శ్రీకర్‌రెడ్డి ప్రపంచ అత్యున్నత సంస్థ అయిన డబ్ల్యూటీఓకు బదిలీ అయ్యారు. ఆయన నెలాఖరున రిలీవ్ కావచ్చని సమాచారం. కొత్త పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు నియమితులయ్యారు. ఈమె 2007 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ఉమాపతి కూతురే అశ్విని. ఆమె గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. డాక్టర్ శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో ఆమెను ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమిస్తూ విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. అశ్విని హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి తొలి మహిళా పాస్‌పోర్ట్ అధికారి కావడం విశేషం. ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ వరకూ అశ్విని హైదరాబాద్‌లోనే చదివారు. ఆమె రెండేళ్లపాటు పాస్‌పోర్ట్ అధికారిగా కొనసాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో పాస్‌పోర్ట్ కార్యాలయం, కొత్తగా మినీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటు తదితర వాటిలో ఈమె కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.