పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్‌ బాస్‌ 'అశ్విని' కామెంట్స్‌ | Bigg Boss Ashwini Sree Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్‌ బాస్‌ అశ్విని కామెంట్స్‌

Published Thu, Jan 11 2024 7:44 AM | Last Updated on Thu, Jan 11 2024 9:33 AM

Bigg Boss Ashwini Sree Comments On Pawan Kalyan - Sakshi

బిగ్​ బాస్ తెలుగు సీజన్‌-7లో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్‌ బాస్‌లో  టాస్క్‌ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్‌ తెచ్చుకుంది. హౌస్‌లో భోలే షావళితో మంచి పెయిర్‌గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్‌ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో​ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్​ చేసింది. తాను గబ్బర్‌ సింగ్‌లో నటించిన సమయంలో  పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్‌ OG సినిమా హిట్‌ కావాలని ఆమె కోరుకుంది.  పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది.

పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని  అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్‌ సార్‌ మాట్లాడేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్​ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్‌ చేసేవారు.  ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు..  ఆపై మాతో పాటలు, డ్యాన్స్‌ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్‌ అంటే ఇష్టం.

ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం. షూటింగ్‌కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్‌లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో  ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది.

పవన్‌పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గతంలో గబ్బర్‌ సింగ్‌తో పాటు రాజా ది గ్రేట్‌ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్‌ బాస్‌ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement