
ఢిల్లీ: మనదేశంలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వాపోయింది. ఆదివారం పెళ్లి చేసుకున్న ఆమె పీబీఎల్‌లో ఢిల్లీ డాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘యువ క్రీడాకారులు ఈ ఫార్మాట్‌లో అడుగుపెట్టడానికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. కొత్తగా ఈ ఆటలో అడుగుపెడుతున్న క్రీడాకారులు డబుల్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టడం లేదు.
దానికి ప్రధాన కారణం మన వద్ద డబుల్స్ ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు లభించకపోవడమే’ అని 2011 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గుత్తా జ్వాలతో కలిసి కాంస్యం సాధించిన పొన్నప్ప తెలిపింది. జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన సింగిల్స్ క్రీడాకారులకు కార్లు బహుమతులుగా ఇచ్చి డబుల్స్ క్రీడాకారులను విస్మరించడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గతంలో గుత్తాజ్వాల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment