women raped
-
పట్టపగలే రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): చెత్త సేకరించే మహిళను పెళ్లి పేరుతో నమ్మించి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై పట్టపగలే రోడ్డు పక్కన షెల్టర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళ్లే వారు ఆ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారే తప్ప, అడ్డుకోలేదు. తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కోయ్లా పాఠక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్ అనే వ్యక్తి చెత్త ఏరుకునే ఓ మహిళతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను సమీపంలోనే రోడ్డు పక్కన షెల్టర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. అయితే, రోడ్డు పక్కన వెళ్లే వారు అసాంఘిక కృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారే తప్ప, అడ్డుకోలేదు. పైపెచ్చు, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వైరల్‌గా మారిన ఒక వీడియో పోలీసుల కంటబడింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకాశ్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఇంట్లోనే ఉందని సీపీ చెప్పారు. -
రైల్వే స్టేషన్లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్‌లోకి లాక్కెళ్లి..
దేశంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. సరేనని చెప్పిన బాధితురాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్లో సతీష్‌ను కలుసుకుంది. ఆమెను.. సతీష్ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. Woman gang-raped by railway employees at New Delhi station; 4 arrested https://t.co/TREgTlDj5f — The Nations 🌐 (@nation_365) July 23, 2022 కాగా, బాధితురాలు.. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన -
మోరపల్లిలో మహిళ హత్య.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి..!
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో బుధవారం మరో హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివారులోని ఊరు చెరువులో చేపలు పట్టేం దుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35) మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బుధ వారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటన స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేసి.. ఆమె ప్రతి ఘటించడంతో గొంతుకోసి, తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహి ళల కేసుల నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు, ఆమెపై అత్యాచారం చేసిన వారెవరు? అనే విషయాలేవీ ప్రస్తుతం తెలియరాలేదని డీఎస్పీ చెప్పారు. -
ముంబైకి జాతీయ మహిళా కమిషన్ బృందం
ముంబై: ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్ బృందం ముంబై చేరుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించిందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసముంటున్న బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని రాజవాది ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలు మరణించే వరకు అక్కడే 36 గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ వైద్యుల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సాకినాక పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లారు. కేసుకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యాచార కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజయ్ పాండేని కలిసిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారంలాగే అత్యంత అమానవీయంగా జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
కరోనాపై గెలిచినా కామాంధులకు బలైన మహిళ
డిస్పూర్: మాయదారి కరోనా వైరస్‌ను జయించింది. కానీ కామాంధులకు బలయ్యింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. ఈ ఘటన అసోంలో హాట్ టాపిక్‌గా మారింది. చారడియో జిల్లాకు తల్లి (54)తో పాటు కూతురి (17)కి కూడా కరోనా సోకింది. సపేకాతి మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అయితే వారు అంబులెన్స్ పెట్టుకోలేని పేదవారు. దీంతో తేయాకు తోటల మీదుగా తల్లీకూతురు ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది. 30 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బొర్హట్ టీ ఎస్టేట్ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెను తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది) అయితే పరుగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబులెన్స్‌ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ‘నెగటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు. -
అత్యాచారం: ఇరవై ఆరేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: తనపై ఆత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై 26 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా ఆ నిందితుల బెదిరింపులకు భయపడి సాహసం చేయలేకపోయింది. కాగా, ఇప్పుడు తన కొడుకు సాయంతో వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరెల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1994లో షాజహన్‌పూర్‌లో బాధిత మహిళ తన సోదరితో కలిసి నివాసం ఉండేది. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. ఆమె సోదరి ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఆమె బావ ప్రభుత్వ ఉద్యోగి. సోదరి, బావ ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఇంటికి పక్కన ఉన్న హసన్, గుడ్డు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని, చెబితే చంపెస్తామని బెదిరించారు. అలా ఆమెపై రెండెళ్ల పాటు సామూహికంగా ఆత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే 1995లో బాధిత మహిళ గర్భవతి అయ్యారు. ఆ సమయంలో ఆమె సోదరి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలనుకుంది. అలా ఫిర్యాదు చేస్తే నిందితులు ఆమె సోదరిని కూడా చంపుతామని బెందిరించారు. బాధితురాలి గర్భం తీసివేసివేయాలని ఆమె సోదరి ప్రయత్నించారు. కానీ, వైద్యులు ఆమె ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పడంతో విరమించుకున్నారు. బాధితురాలి బావకు మరో ప్రాంతానికి ఉద్యోగం బదిలీ కావటం వాళ్లు ఇల్లు వదిలి మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో బాధిత మహిళ బాబుకు జన్మనించింది. అయితే ఆ బాబును ఆమె తన బంధువులకు దత్తత ఇచ్చింది. 2000 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెపై జరిగిన అత్యాచారాన్ని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు. ఆమె కుమారుడు తన తల్లి తనను దత్తత ఇచ్చిందని తెలుకున్నాడు. అనంతరం తల్లిని కలుసుకొని తన తండ్రి ఎవరని ప్రశ్నించాడు. జరిగిన విషయం తెలుసుకున్న కుమారుడు తన తల్లిపై ఆత్యాచారం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయలని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె తన 24 ఏళ్ల కొడుకు సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. ముందుగా పోలీసులు వారిపై కేసు నమోదు చేయడాన్ని నిరాకరించారు. బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు -
మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్లో దింపాడు. అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఫోన్లో సందేశాల ద్వారా కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో నిందితుడు తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న మరో హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఫిబ్రవరి 23న ముంబైకి పంపినట్లు తెలిపారు. చదవండి: ఇంటి బేస్మెంట్లో ఓ పెద్ద సొరంగం -
పోలీస్ రైడ్ పేరుతో అమ్మాయిపై అత్యాచారం
లక్నో: స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్ రైడ్ మాదిరి చేయించాడు. పోలీసులతో ఆ యువతిని బెదిరింపులకు పాల్పడి.. తన కోరిక తీరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. అయితే పోలీసులే దగ్గరుండి అమ్మాయిపై అత్యాచారం జరిగేలా సహకరించడం వివాదాస్పదమవుతోంది. తీరా ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లితే పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ కేసు నమోదు చేసుకోలేదు. ఎందుకంటే వచ్చిన పోలీసులు ఆ స్టేషన్‌కు సంబంధించినవారే. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మీరట్ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అతిథిగృహానికి శనివారం (ఫిబ్రవరి 20) ఓ అమ్మాయి తనకు తెలిసిన వ్యక్తితో వచ్చింది. దీన్ని ఆ అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఆ అమ్మాయిపై కన్ను పడింది. దీంతో తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్ రైడ్ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ మేరకు అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీయువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీన్ని తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్ సీఐ ప్రేమ్‌చంద్ శర్మ స్పందించారు. ‘మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరిస్తాం. విచారణ చేపడతాం’ అని సీఐ ప్రేమ్‌చంద్ శర్మ తెలిపారు. ఈ విధంగా రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కుమ్మక్కై ఓ ఆడపిల్లపై అఘాయిత్యం జరగడంతో పాటు బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. చదవండి: భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష! చదవండి: ఆ 136 మంది మరణించినట్టే.. చదవండి: ఎస్సై, ఏఎస్సైతో పాటు 6మంది అరెస్ట్ -
లంకె బిందెలు తీస్తానంటూ..లైంగిక దాడి
సత్తుపల్లిరూరల్ : ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. కొన్ని వారాల పాటు పూజలు చేసి వాటిని బయటకు తీస్తా.. అప్పుడు మీరు కోటీశ్వరులవుతారు..’ అంటూ మంత్రగాడు మాయమాటలు చెప్పి ఓ మహిళను లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన ఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి బంగ్లాబజార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు మంగళవారం వివరాలను వెల్లడించారు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే గిరిజనులైన గుళ్ల రాంబాబు దంపతులు కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఉప్పలమ్మను పెట్టుకున్నారు. ఇందుకోసం కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం నుంచి పూజారి లక్ష్మీనర్సయ్యను పిలిపించారు. పూజల అనంతరం ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. వాటిని బయటకు తీయాలంటే కొన్ని పూజలు చేయాలి’ అని నమ్మబలికి వెళ్లిపోయాడు. ప్రత్యేక పూజ పేరుతో.. మళ్లీ వారం తర్వాత వచ్చి పూజలు చేస్తానంటూ రూ.30 వేలు తీసుకున్నాడు. రాంబాబు దంపతులను ఉప్పలమ్మ గుడి వెనుకకు(కర్టెన్ కట్టిన) వెళ్లాలని, తాను గుడి ముందు పూజ చేస్తానని చెప్పాడు. కాసేపటి తర్వాత ప్రత్యేక పూజ పేరుతో రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే నీ భర్త, పిల్లలను చంపేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కాగా, మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గంపా వసంతరావు ఇంటికి పూజ చేసేందుకు లక్ష్మీనర్సయ్య వచ్చాడు. రాంబాబును కూడా అక్కడికి పిలిచి మళ్లీ పూజలు చేయాలని చెప్పాడు. దీంతో తన భార్య అంగీకరించటం లేదని, తమకు పూజలు వద్దని రాంబాబు అనడంతో.. ‘నేను వచ్చి నీ భార్యను ఒప్పిస్తా’ నంటూ మళ్లీ రాంబాబు ఇంటికి వచ్చాడు. ఇప్పటి వరకు పూజలు చేశారు.. ఇలా మూడు నెలలు చేస్తే లంకెబిందెలు వస్తాయి ఆలోచించుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు. సోమవారం రాంబాబుకు ఫోన్ చేసి ఈ రోజు వస్తున్నానని, తప్పకుండా పూజ చేయాలని చెప్పాడు. రాంబాబు ఈ విషయాన్ని గ్రామ పెద్ద దుంపా వెంకన్నకు చెప్పాడు. గ్రామస్తులంతా మంత్రగాడి రాక కోసం కాపలా కాస్తుండగా, రాత్రి 10 గంటలకు టీఎస్04 ఈఎల్8504 నంబర్ గల కారులో మరో ఇద్దరితో కలిసి వచ్చాడు. పూజ చేసేప్పుడు కుటుంబ సభ్యులెవరూ రాకూడదంటూ రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లాడు. తన తర్వాత, మరో ఐదుగురు యువకులతో గడపాలని.. వారిని కూడా తీసుకొచ్చానని బలవంతం చేయటంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అప్పటికే అక్కడే వేచి ఉన్న గ్రామస్తులంతా గది వద్దకు రావటంతో లక్ష్మీనర్సయ్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితులు, గ్రామస్తులు కలిసి అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై లైంగిక దాడి.. హత్య
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లిలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన వెలుగుచూసింది. 18 సంవత్సరాల యువతిపై గుర్తు తెలియని దుండగులు లైంగికదాడి చేసి, ఆపై ఆమెను హతమార్చి గోనె సంచిలో కుక్కి బావిలో పడేశారు. మంగళవారం ఉదయం గోనెసంచి సహా యువతి మృతదేహం బావిలో తెలియాడుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిపై లైంగిక దాడిచేసి హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. యువతి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. -
మహిళపై అత్యాచారం ఆపై...
మహబూబ్ నగర్ జిల్లా : ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుకు సమీపంలోనే ఓ గుర్తు తెలియని మహిళను అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన వంగూరు మండలం చారకొండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చారకొండ సమీపంలో బుధవారం ఉదయం గుండె యాద య్య గౌడ్ వ్యవసాయ పొలంలో కాలిపోయి గుర్తుపట్టనట్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన చుట్టు పక్కల రైతులు వెంటనే డిప్యూటీ సర్పంచ్, పొలం యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని, విషయం పోలీసులకు చేరవేశారు. కల్వకుర్తి సీఐ వెంకట్, వంగూరు, వెల్దండ ఎస్ఐలు నరేష్, జానకిరాంరెడ్డి, వంగూరు ట్రైనీ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, పంచనామా నిర్వహించారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లాకేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి దుండగులు మహిళను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్ తెలిపారు. మృతురాలి చేతిమీద రాజప్ప అని రాసి ఉందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను తెలుసుకుని మృతురాలి ఆచూకీ తెలుసుకుంటామని, ఆతర్వాత ఇందుకు బాధ్యులైన వారిని గుర్తిస్తామన్నారు. ఈ సంఘటనతో చారుకొండ ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.