
దేశంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. సరేనని చెప్పిన బాధితురాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్‌లో సతీష్‌ను కలుసుకుంది. ఆమెను.. సతీష్ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Woman gang-raped by railway employees at New Delhi station; 4 arrested https://t.co/TREgTlDj5f
— The Nations 🌐 (@nation_365) July 23, 2022
కాగా, బాధితురాలు.. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన