
బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి దేవాలయంలోని అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అమ్మవారికి సంబంధించిన పాత వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రెండు లక్షల విలువైన పాత చీరలు, వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు.
(బాసర)